అక్షాంశ రేఖాంశాలు: 28°8′34″N 95°50′34″E / 28.14278°N 95.84278°E / 28.14278; 95.84278

రోయింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోయింగ్
పట్టణం
రోయింగ్ is located in Arunachal Pradesh
రోయింగ్
రోయింగ్
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థానం
రోయింగ్ is located in India
రోయింగ్
రోయింగ్
రోయింగ్ (India)
Coordinates: 28°8′34″N 95°50′34″E / 28.14278°N 95.84278°E / 28.14278; 95.84278
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాదిగువ దిబాంగ్ లోయ
Elevation
390 మీ (1,280 అ.)
జనాభా
 (2011)
 • Total11,389
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-AR
Vehicle registrationAR-16
Websitehttps://roing.nic.in/

రోయింగ్, భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాకు ప్రధాన కార్యాలయం.ఇది భారతదేశం ఈశాన్య సరిహద్దులో చివరి ప్రధాన నివాస ప్రాంతం.ఆది, మిష్మి (ఇడు) తెగలకు చెందిన ఇద్దరూ రోయింగ్ ప్రధాన ప్రాంత నివాసులు. రోయింగ్ పట్టణంలో మెహావో వైల్డ్ లైఫ్ సంక్చురి, సాలీ లేక్, మెహావో సరస్సు, భీస్మగ్నగర్ ఫోర్ట్, మయోడియా పాస్ ముఖ్య పర్యాటక ఆకర్షణలు.ఇవి శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటాయి.ఈ పట్టణం మిష్మి కొండల పర్వత ప్రాంతంలో ఉంది. ఆది తెగకు చెందిన ప్రజలు సోలుంగ్ పండుగను సెప్టెంబరు 1నజరుపుకొనగా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ఇడు తెగకు చెందిన ప్రజలు రెహ్ పండుగ ఎంతో ఆనందం, సామరస్యంతో జరుపుకుంటారు. ఉత్తరం వైపు డియోపాని నది ప్రవహిస్తుంది.దీనికి వేసవిలో తరచూ వరదలు సంభవించి, ప్రక్కనే ఉన్న డిబాంగ్ వ్యాలీ జిల్లాకు చాలా ఆర్థిక ప్రతిష్టంభన కలిగిస్తుంది.దానిపై ఉన్న వంతెనలుకు నష్ం జరిగి తరచూ ప్రభుత్వ ఖజానా నిదులను కరిగిస్తాయి. దక్షిణ తూర్పు వైపు అస్సాం సరిహద్దు వరకు విస్తరించి ఉన్న ఆది, మిష్మి తెగలకు చెందిన ప్రజలు నివసించే (ఇడు) గ్రామాలు ఉన్నాయి.ఈ పట్టణం ఎగువ దిబాంగ్ వ్యాలీ జిల్లా, దాని పరిసర గ్రామాలకు మాత్రమే వాణిజ్య కేంద్రంగా ఉంది.అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని ఇతర పనికిరాని భూభాగం ఉన్న పట్టణాల మాదిరిగా కాకుండా, రోయింగ్ పట్టణ ప్రాంతంలో భౌగోళికంగా వ్యవసాయ సాగు కోసం చాలా భూమిని కలిగి ఉంది.ఇది అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలోని 60 నియోజకవర్గాలలో 43 వ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్.టి. రిజర్వుడు) కింద కలిగి ఉంది.రోయింగ్ నియోజకవర్గం శాసన సభ్యునిగా 2019 మే, 23 నుండి ముచు మిథి కొనసాగుచున్నాడు. [1]

జనాభా

[మార్చు]
Roing Entrance
రోయింగ్ పట్టణంలోకి చేరే మార్గం
మయూడియాకు వెళ్లే మార్గంలో ఈజ్ నదిపై డియో వంతెన

2011 భారత జనాభా లెక్కల ప్రకారం రోయింగ్ పట్టణ జనాభా మొత్తం 11,389, వీరిలో 6,064 మంది పురుషులు 5,325 మంది మహిళలు ఉన్నారు.రోయింగ్ పట్టణ సగటు అక్షరాస్యత రేటు 88.39%,ఇది జాతీయ సగటు అక్షరాస్యత రేటు 65.38% కంటే ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 91.94%, స్త్రీల అక్షరాస్యత 84.35%గా ఉంది.0-6 జనాభా వయస్సు గల పిల్లలు 1157 మంది ఉన్నారు. ఇది రోయింగ్ పట్టణ మొత్తం జనాభాలో 10.16%గా ఉంది.స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్రసగటు 938కు వ్యతిరేకంగా (878)గా ఉంది.అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సగటు 972 తో పోలిస్తే రోయింగ్‌ పట్టణంలో పిల్లల లింగ నిష్పత్తి 875.[2]

రవాణా

[మార్చు]
మయూడియాకు వెళ్లే మార్గంలో రోయింగ్‌కు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారా గోలై నుండి దిబాంగ్ రివర్ వీక్షణ చిత్రం

అస్సాంలోని ప్రధాన పట్టణం టిన్సుకియాతో రోయింగ్ పట్టణం అనుసంధానించబడి ఉంది.ఈ ప్రధాన మార్గం బ్రహ్మపుత్ర నది ద్వారా వేరు చేయబడింది.వేసవిలో నదికి వరదలు వచ్చిన సమయాలో ఫెర్రీ-బోట్ ద్వారా మూడు గంటల సమయం ప్రయాణం చేయాల్సి వస్తుంది.ఇది చాలా అనుభూతిగా ఉంటుంది.బ్రహ్మపుత్ర నదిపై ఇటీవల ప్రారంభించిన ధోలా-సాదియా వంతెన (డాక్టర్ భూపెన్ హజారికా సేతు ) రోయింగ్‌కు వెళ్లే మార్గాన్ని మరింత సులభతరం చేసింది. టిన్సుకియాను అనుసంధానించే మరో మార్గం నామ్సాయ్ ప్రదేశం ద్వారా తేజు - చౌఖం మార్గం.తేజు, చౌఖం-నామ్సాయ్ మధ్య రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఎల్లకాలం ప్రయాణించటానికి అంతర్గత రోడ్దు మార్గాలు.ఒకటి పర్శురామ్ కుండ్ వద్ద లోహిత్ నదిపై వంతెన, రెండవది చౌఖంలో లోహిత్ నదిపై అలుబరి ఘాట్ వద్ద మరొక వంతెన ఉంది.

త్రోవ ద్వారా

[మార్చు]

రోయింగ్ పట్టణం నుండి ఇకర ప్రాంతాలకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ, అనధికార సంస్థలకు చెందిన రవాణా సేవల సౌకర్యాలు ఉన్నాయి.

రైల్వే

[మార్చు]

రోయింగ్ పట్టణానికి సమీప రైల్వే స్టేషన్ టిన్సుకియా (న్యూ టిన్సుకియా జంక్షన్ రైల్వే స్టేషన్) ఇది సుమారు 113 కిమీ దూరంలో ఉంది.[3]

విమానాశ్రయం

[మార్చు]

రోయింగ్ పట్టణానికి సమీప విమానాశ్రయాలు

  • చాబువా (సుమారు138 కిమీ) [3]
  • మోహన్‌బరి (దిబ్రుగఢ్) ( సమారు148 కిమీ)
  • గౌహతి ( సుమారు 500కిమీ)

బజార్

[మార్చు]

రోయింగ్ బజార్ ప్రాంతం చాలా మంది నివాసితులు ఆహారాన్ని కొనుగోలు చేసి విక్రయించే సరఫరా వాణిజ్య ప్రదేశం

మీడియా

[మార్చు]

రోయింగ్‌లో ఆల్ ఇండియా రేడియో ప్రసార కేంద్రం ఉంది. దీనిని ఆకాశవాణి, రోయింగ్ అని పిలుస్తారు.ఇది ఎఫ్ఎమ్ పౌన, పున్యాలపై ప్రసారం చేస్తుంది. ఈ పట్టణంలో డాన్లిట్ పోస్ట్, ది రోయింగ్ టైమ్స్ వంటి కొన్ని స్థానిక వార్తాపత్రికలను అందిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "Roing Elected representatives".
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. 3.0 3.1 "District at glance".

బాహ్య లింకులు

[మార్చు]
  • https://roing.nic.in/ జిల్లా పరిపాలన అధికారిక వెబ్‌సైట్.
"https://te.wikipedia.org/w/index.php?title=రోయింగ్&oldid=4292552" నుండి వెలికితీశారు