Jump to content

దిబాంగ్ వ్యాలీ జిల్లా

వికీపీడియా నుండి
(అప్పర్ దీబాంగ్ వ్యాలీ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
డిబాంగ్ వ్యాలీ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో డిబాంగ్ వ్యాలీ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో డిబాంగ్ వ్యాలీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంఅనిని
విస్తీర్ణం
 • మొత్తం9,129 కి.మీ2 (3,525 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం8,004
 • జనసాంద్రత0.88/కి.మీ2 (2.3/చ. మై.)
 • Urban
27.55%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.8%
 • లింగ నిష్పత్తి808

డిబాంగ్ వ్యాలీ జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[1][2] ఈ జిల్లాలో డిబాంగ్ నది ప్రవహిస్తున్న కారణంగా దీనికీ ఈ పేరు వచ్చింది.[3] మిష్మి ప్రజలు దీనిని టాలన్ అంటారు. 9,128 చ.కి.మీ వైశాల్యం ఉన్న డిబాంగ్ లోయ జిల్లా రాష్ట్రంలో వైశాల్యపరంగా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ భారతదేశంలో అత్యల్ప జనసాంధ్రత ఉన్న జిల్లాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

1980లో లోహిత్ జిల్లాలో కొంత భాగం వేరుచేయగా డిబాంగ్ లోయ జిల్లా ఏర్పడింది.[4] 2011 డిసెంబరు 16న డిబాంగ్ లోయ జిల్లా ఎగువ డిబాంగ్ లోయ జిల్లా, దిగువ డిబాంగ్ లోయ జిల్లాలుగా విభజించబడింది.[4]

భౌగోళికం

[మార్చు]

రిపబ్లిక్ చైనాలో జన్మించిన డిబాంగ్ నది ఈ జిల్లా గుండా ప్రవహిస్తుంది, కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాకు అనిని కేంద్రంగా ఉంది. ఇది భారతదేశ ఉత్తర, ఈశాన్య జిల్లాలలో చివరిది.

విభాగాలు

[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లాలో ఒకే ఒక అనిని శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[5]

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని డిబాంగ్ వ్యాలీ జిల్లా మొత్తం జనాభా 8,004. వీరిలో 4,414 మంది పురుషులు కాగా, 3,590 మంది మహిళలు ఉన్నారు.[6] జిల్లాలో మొత్తం 1,952 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 813.

జిల్లా మొత్తం జనాభాలో 29.8% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 70.2% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 55.6%. అలాగే డిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 812 కాగా, గ్రామీణ ప్రాంతాల వారిది 814గా ఉంది.

డిబాంగ్ వ్యాలీ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1084, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య 574 మంది మగ పిల్లలు ఉండగా, 510 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా జిల్లా లోని పిల్లల లింగ నిష్పత్తి 889, ఇది దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (813) కంటే ఎక్కువ. డిబాంగ్ వ్యాలీ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 64.1%. పురుషుల అక్షరాస్యత రేటు 59.22% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 50.75%గా ఉంది.

ప్రజలు

[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి (ఇడు) ప్రజలు అధికంగా ఉన్నారు. మిష్మి ప్రజలలో వారి వలస గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథలో చీతూ- హులుని ప్రాంతం, మిష్మి ప్రజలు సంచరించిన 12 నదీ ప్రాంతాలు గురించిన వర్ణన ఉంది. వీరు మొదట అహూం రాజ్యంలో నివసించారని ఈ కథనాలు వివరిస్తున్నాయి. మిష్మి ప్రజలు సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తుంటారు.

భాషలు

[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి, సిన్జొ-టిబెటన్ భాషలను దాదాపు 25,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. దీనిని టిబెటన్, లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[7]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లా వన్యసంపదతో సుసంపన్నమై ఉంది. ఇక్కడ మిష్మి టాకిన్, గాంగ్షణ్ మౌంట్జాక్ వంటి అరుదైన క్షీరదాలున్నాయి. అలాగే స్కల్టర్ మోనల్ వంటి పక్షులు ఉన్నాయి.[8] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన ఎగిరే ఉడుత కూడా ఈ జిల్లాలో కనిపిస్తుంది.[9] 1991లో ఎగువ డిబాంగ్ లోయ జిల్లాలో 4,149 చ.కి.మీ వైశాల్యంలో " డిబాంగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[10]

మూలాలు

[మార్చు]
  1. National Portal of India : Know India : Districts of India. India.gov.in.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  3. History : Lower Dibang Valley Archived 2011-05-26 at the Wayback Machine. Roing.nic.in (16 December 2001).
  4. 4.0 4.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 August 2011. Retrieved 21 March 2011.
  6. "Dibang Valley District Population Religion - Arunachal Pradesh, Dibang Valley Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  7. M. Paul Lewis, ed. (2009). "Mishmi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  8. Choudhury, Anwaruddin(2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
  9. Choudhury,Anwaruddin (2009).One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
  10. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 August 2011. Retrieved 25 September 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]