సీతాకల్యాణం (1976 సినిమా)
మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం సీతా కళ్యాణం అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.
'సీతా కళ్యాణం ' 1976 జులై 16 న విడుదలైన ఉత్తమ తెలుగు కళాచిత్రం . ఆనందలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్, చిత్ర కల్పన పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి చిత్రకారుడు, ఉత్తమ దర్శకుడు అయిన బాపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవి, జయప్రద, నాగయ్య, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .
సీతాకల్యాణం (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
నిర్మాణం | పింజల ఆనందరావు, పింజల సుబ్బారావు |
కథ | సంప్రదాయ గాధ |
తారాగణం | రవి, జయప్రద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | బి.వసంత, ఎస్.జానకి, వాణీ జయరాం,, పి.బి.శ్రీనివాస్, , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, , పి.సుశీల, వి.రామకృష్ణ |
నృత్యాలు | పారుపల్లి శేషు, రాజు, శివ, దుర్గ |
సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
ఛాయాగ్రహణం | రవికాంత్ నగాయిచ్, కె.ఎస్.ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ఆనందలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్, చిత్రకల్పన |
అవార్డులు | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమచిత్రం |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సీతాకల్యాణం, 1976లో వెలువడిన ఒక తెలుగు సినిమా. ప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు అయిన బాపు దర్శకత్వంలో వెలువడిన ఉత్తమ కళా చిత్రాలలో ఇది ఒకటి. తెలుగువారికి సుపరిచితమైన ఈ రామాయణ కథాంశాన్ని కన్నులపండువుగా బాపు చిత్రీకరించాడు.
1978లో చికాగోలోను, 1979లో బెర్లిన్, సాన్‌రినో, డెన్వర్ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి ఈ చిత్రం విమర్శకుల మన్నలందుకొంది. ఇది చూడడం కనుల పండువనీ, దీనిలోని సంగీతం వీనుల విందనీ ప్రేక్షకులు ప్రశంసించారు. [1][2]
ఈ సినిమా ఒక సంగీత రూపకంగా నిర్మించారు.
కథ
[మార్చు]ఇందులో కథాంశం క్రొత్తదేమీ కాదు. కథలో చూపిన ముఖ్యాంశాలు
- రామావతారం ఎలా సంభవించింది
- పుత్రకామేష్టి ద్వారా దశరథునికి పుత్రులు జన్మించడం, జనకునికి సీత లభించడము
- విశ్వామిత్రుడు తన యాగ రక్షణకు రామ లక్ష్మణులను తన తోడు తీసుకొని వెళ్ళడము
- అస్త్రోపదేశం
- తాటకి సంహారం
- యాగ రక్షణ
- వామనావతారం
- అహల్యా శాప విమోచనం
- గంగావతరణం
- శివ ధనుర్భంగం
- సీతారామ కళ్యాణం
- పరశురామ గర్వ భంగం
పాటలు, పద్యాలు
[మార్చు]మహావిష్ణు గాథలు పాటలో వామనవాతార ఘట్టాన్ని వర్ణించే సందర్భంలో, వామనుడు త్రివిక్రముడెలా అయ్యాడో వర్ణించేందుకు పోతన భాగవతం లోని రెండు పద్యాలను గేయంగా మలచారు. "ఇంతింతై వటుడింతయై" అనే పద్యాన్ని కొంత వరకు స్వీకరించగా, "రవిబింబం బుపమింప" అనే పద్యం మొత్తాన్నీ గీతం లోకి కూర్చారు.
ఈ సినిమాలోని పాటలు, పద్యాలు, శ్లోకాల వివరాలు:[3]
క్ర.సం. | పాట/పద్యం | పాడినవారు | రచన |
---|---|---|---|
1 | అంతా రామమయం | పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, పి.సుశీల, బి.వసంత బృందం |
ఆరుద్ర |
2 | అతివల పరాభావించు దురాత్మ నీకు పతనమాశనమయ్యే (పద్యం) | పి. సుశీల | గబ్బిట |
3 | పరమపావనమైన | పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, రామకృష్ణ బృందం |
|
4 | మహావిష్ణు గాధలు | పి.సుశీల, వసంత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పి.బి.శ్రీనివాస్ |
సినారె |
5 | మా జానకి చెట్టాబట్టగా మహారాజువైతివి | పి.బి.శ్రీనివాస్, పి.సుశీల |
త్యాగరాజ కృతి |
6 | రఘుకులాలంకార రామ శ్రీరస్తు సుగుణాభి రామ | పి.బి.శ్రీనివాస్ | గబ్బిట |
7 | సీతమ్మ విహరించు పూదోటకు | పి.సుశీల, బి.వసంత, పి.బి.శ్రీనివాస్ |
ఆరుద్ర |
8 | సీతారాముల శుభ | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్, రామకృష్ణ, వసంత బృందం |
ఆరుద్ర |
9 | సీతమ్మకు సింగారం చేతాము | పి.సుశీల, బి.వసంత, రమోల, ఉడుతా సరోజిని |
ఆరుద్ర |
10 | శుద్దలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతీ శ్రీలక్ష్మి (శ్లోకం) | పి.బి.శ్రీనివాస్ | |
11 | విష్ణుం జిష్ణు౦ మహా విష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం (పద్యం) | పి.సుశీల | |
12 | లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగ (శ్లోకం) | పి.బి.శ్రీనివాస్ | |
13 | రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ | పి.బి.శ్రీనివాస్, పి.సుశీల |
రామదాస కృతి |
14 | మునివెంట వనసీమ చనుచుండ | రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్ |
ఆరుద్ర |
15 | నా తండ్రి వనసీమ నడయాడు సమయాన (పద్యం) | పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ |
గబ్బిట |
16 | జానకి రాముల కలిపే విల్లు జనకుని | రామకృష్ణ, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వసంత బృందం |
|
17 | కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే (శ్లోకం) | మాధవపెద్ది | |
18 | కళ్యాణం చూతము రారండి శ్రీ సీతా | పి.సుశీల, బి.వసంత, పి.బి.శ్రీనివాస్ బృందం |
ఆరుద్ర |
19 | కదిలింది కదిలింది గంగా - | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, రామకృష్ణ, వసంత బృందం |
ఆరుద్ర |
ఇతర విశేషాలు
[మార్చు]- "గంగావతరణం" సన్నివేశ చిత్రీకరణ ఈ సినిమాకు తలమానికం వంటిది. సాంకేతిక నైపుణ్యం, పాట, కళ అందరి మన్ననలూ పొందాయి.
- ఈ సినిమా నాటికి నందమూరి తారక రామారావు వయసు ఎక్కువ కావడం వలన యువ రాముడి పాత్రకు సరిపోడు. కాని రాముని పాత్రలో మరొకరిని చూడడానికి తెలుగువారు అలవాటు పడలేదు. రవి అనే కొత్త యువకునిచే ఈ వేషం వేయించడం చర్చనీయమయ్యింది. ఆర్థికంగా సినిమా అంతగా విజయవంతం కాకపోవడానికి ఇది కూడా ఒక కారణమని అభిప్రాయ పడ్డారు.
- సీత పాత్రలో అప్పుడే సినిమా రంగంలోకి వచ్చిన జయప్రద నటించింది.
- సినిమాలో రామునికి పాత్రకు రెండు మూడు సంభాషణలు మాత్రమే ఉన్నాయి.
పాత్రధారులు
[మార్చు]- రవికుమార్ - శ్రీరాముడు, విష్ణువు
- జయప్రద - సీత, లక్ష్మి
- గుమ్మడి వెంకటేశ్వరరావు - దశరథుడు
- మిక్కిలినేని - జనకుడు
- సత్యనారాయణ - రావణుడు
- నాగయ్య - వశిష్ఠుడు
- ముక్కామల - విశ్వామిత్రుడు
- హేమలత - కౌసల్య
- జమున -కైక
- పి.ఆర్.వరలక్ష్మి - సుమిత్ర
- త్యాగరాజు - పరశురాముడు
- ప్రభ - మండోదరి
- ధూళిపాళ
- ఇతరులు
- కళా దర్శకుడు -పిలకా లక్ష్మీనరసింహ మూర్తి
- సహాయ సంగీత దర్శకుడు - పుహళేంది
మూలాలు
[మార్చు]- ↑ Nigel Andrews of the Financial Times, London " the biggest single treat of the London Film Festival" David Robinson of The Times, London " it is a wondrous film of great visual beauty.." Ken Wlaschin of the London Film Festival.
- ↑ "It is one of the most extravagantly beautiful films I have seen, done with real taste, an amalgam of lyricism, poetry and spectacle achieved with rare authenticity... done with gravita and dignity.." - Derek Malcolm of the Guardian, London non of the vulgarity.. the film has jewel like precision of decor and scenic effect..."
- ↑ కొల్లూరి భాస్కరరావు. "సీతాకళ్యాణం - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 2 ఏప్రిల్ 2020. Retrieved 2 April 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)