ఖుర్రతుల్ ఐన్ హైదర్
ఖుర్రతుల్ ఐన్ హైదర్ (1927 జనవరి 20 – 2007 ఆగస్టు 21) భారతీయ ఉర్దూ రచయిత్రి, లఘు కథా రచయిత్రి, విద్యావేత్త, జర్నలిస్టు. ఉర్దూ సాహిత్యంలో అత్యంత అద్భుతమైన సాహితీకారులలో ఒకరుగా ఆమె రచనల ద్వారా గుర్తింపు పొందింది. ఆమె రాసిన గొప్ప రచన "ఆగ్ కా దర్యా" (అగ్ని నది) 1959 లో ఉర్దూలో లాహోర్, పాకిస్థాన్ నుండి ప్రచురితమైనది. ఈ రచనలో సా.శ.పూ 4 వ శతాబ్దం నుండి భారతదేశ విభజన వరకు జరిగిన వివిధ అంశాలను వివరించింది.[1][2] ఆమె స్నేహితులు, ఆరాధకులు ఆమెను ప్రముఖంగా "అనీ అఫా" అని పిలుస్తారు. ఆమె ఉర్దూ భాషలో ప్రముఖ రచయిత, సజ్జద్ హైదర్ యిల్దారిమ్ (1880–1943) కుమార్తె. ఆమె తల్లి నాజర్ జహ్రా (మొదట బింట్-ఇ-నజ్రుల్ గా తరువాత నజర్ సజ్జద్ హైదర్ (1894–1967) గా రాసారు.) కూడా నవలా రచయిత్రి. ఆమె తల్లి తన మొదటి నవలను ప్రచురించిన ముహమ్మది బేగం, ఆమె భర్త సయ్యద్ ముంతాజ్ అలీ సంరక్షణలో ఉండేది.
ఆమె 1967లో ఆమె రాసిన "పత్జర్ కీ అవాజ్" (లఘు కథలు) కు గాను ఉర్దూ సాహిత్యంలో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పోందింది. 1989 లో "ఆఖిరే షాబ్ కె హమ్‌సఫర్" రచనకు జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారాలను పొందింది.[3] 1994లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ను పొందింది.[4] ఆమె భారతదేశ అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని 2005 లో అందుకున్నది.[5]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె 1927 జనవరి 20 న ఉత్తర ప్రదేశ్ లోని ఆలీగర్ లో జన్మించింది. ఖుర్రత్-ఉల్-ఐన్ హైదర్ ఉర్దూ కాల్పనిక రచయితలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. ప్రసిద్ధ ఇరానియన్ రచయిత "ఖుర్రత్-ఉల్-అలిన్ తహీరా" పేరుతొ ఆమెకు నామకరణం చేసారు. "ఖుర్రత్ ఐన్"కు సాహిత్యం పరంగా "కళ్ళ ఓదార్పు" అని అర్థం. ఈ పదాన్ని "ప్రియము" అనే పదానికి పర్యాయపదంగా కూడా వాడుతారు. ఉర్దూ కాల్పనిక రచనలలో ఆమె ప్రత్యేక ఒరవడికి రూపుదిద్దింది. కవిత్వం రాజ్యమేలుతున్న ఉర్దూ సాహితీ ప్రపంచంలో నవలా సాహిత్యం ఇంకా కాలూనుకోని కాలంలో ఆమె నవలలు రాయడం ప్రారంభించింది. ఆమె ఉర్దూ సాహిత్యానికి "గ్రాండే డేమ్"గా విస్తృతంగా భావించబడుతుంది.[5]
ఆమె న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ కళాశాల[6] , లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన ఇసాబెల్లా థోబర్న్ కళాశాలలలో విద్యాభ్యాసం పూర్తిచేసిన తరువాత, 1947లో ఆమె పాకిస్థాన్ వెళ్లింది. ఆమె 1960 లో భారతదేశానికి తిరిగి రాక ముందు కొంతకాలం ఇంగ్లాండ్ లో నివసించింది. న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాకు మారే ముందు ఆమె సుమారు 20 సంవత్సరాలు బొంబాయిలో నివసించింది. ఆమె అక్కడ తన మరణం వరకు నివసించింది. ఆమె వివాహం చేసుకోలేదు.
ఆమె తన కుటుంబ సభ్యులతో 1947 లో పాకిస్థాన్ వలస పోయింది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆమె అంతకు ముందు నివసించిన భారతదేశానికి రావాలని నిశ్చయించుకుంది. ఆమె జర్నలిస్టుగా ఇప్పటికి దాదాపు ముప్పై దాకా లఘు కథలను, సాహిత్య అనువాదాలు, నవలలను క్రమంగా ప్రచురించి సంపాదించి జీవనం సాగించేది. ఆమె "ఇంప్రింట్" (1964–68) బొంబాయికి చెందిన పత్రికకు మేనేజింగ్ ఎడిటరుగా పనిచేసింది. ఆమె ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా (1968–75) పత్రికకు సంపాదక వర్గంలో సభ్యురాలిగా పనిచేసింది. ఆమె పుస్తకాలు ఆంగ్లం, యితర భాషలలోనికి అనువదింపబడ్డాయి.
హైదర్ కాలిఫోర్నియా, చికాగో, విస్కోన్సిన్, అరిజోనా విశ్వవిద్యాలలలో అతిథి అధ్యాపకురాలిగా తన సేవలనందించింది. ఆమె ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని ఉర్దూ విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసింది. పూర్వం ఆ విశ్వవిద్యాలయంలోనే ఆమె తండ్రి రిజిస్టారుగా పనిచేసాడు. ఆమె న్యూఢిల్లీ లోని జామియా మిల్లియా ఇస్లామియా వద్ద ప్రొఫెసర్ గా పనిచేసింది.
సాహితీ సేవలు
[మార్చు]ఆమె తన 11వ యేట నుండి రచనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె సాహితీ యానంలో 12 నవలలు నాలుగు కథా సంపుటిలను రాసింది. ఆమె అనేక అనువాదాలను చేసింది. ఆమె రచనలు ఆంగ్లం, ఇతర భాషలలోనికి అనువాదం చేయబడ్డాయి.[7]
ఆగ్ కా దరయా (అగ్ని నది), ఆమె రాసిన గొప్ప నవల. ఇది భారత దేశ చరిత్రలో చాలా కాలానికి సంబంధించిన అంశాలతో కూడిన నవల. ఈ నవలలో భారతదేశం, పాకిస్థాన్ లలో సా.శ.పూ 4వ శతాబ్దం నుండి భారత స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వరకు గల అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. "ఆగ్ కా దర్యా" తప్పనిసరిగా పాకిస్తాన్ విశ్వాసుల దృష్టికోణం నుండి రాసిన నవల. అది పాకిస్థానీయుల వేదనలను చిత్రీకరిస్తుంది.
ఆమె ఇతర ప్రచురణలలో: మేరే భీ సనం ఖానే, 1949; సఫిన-ఎ-గ్రామ్-ఎ-దిల్, 1952; పత్జర్ కీ ఆవాజ్, 1965; రాష్ణీకీ ఫతర్, 1982; లఘు కథా నవల "చాయేకె బాగ్",1965, సీతా హరణ్, అగ్లే జనం మోహె బితియే నా కిజో; కుటుంబ చరిత్ర "కర్ ఎ జహా దరజ్ హై", గర్దిష్ ఎ రంగ్ ఎ చమన్ (1857లో గౌరవ కుటుంబాలకు చెంచిన మహిళల విషాదానికి సంబంధించిన డాక్యుమెంటరీ నవల), "ఆఖిర్ ఎ షాబ్ కె హమ్‌సఫర్ (బెంగాల్ అశాంతి, నక్సలైట్ ఉద్యమం పై నవల), "చాందిని బేగం" మొదలైనవి ఉన్నాయి.
ఆమె మొదటికథ "బీ-చునియా" (లిటిల్ మిస్ మౌస్) పిల్లల మ్యాగజైన్ "ఫూల్"లో ప్రచురితమైనది. ఆమె తన 19వ యేట రాసిన మొదటి నవల "మయ్రాజ్ భీ సనమ్ ఖానే"
పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]"ఆఖిర్-ఎ-షాబ్ కె హమ్‌సఫర్" నవలా రచనకుగాను 1989లో ఆమెకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 1967లో ఆమె సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. 1985లో గాలిబ్ పురస్కారం అందుకున్నది. ఆమె రాసిన కథా సంకలనం "పత్జర్ కీ ఆవాజ్" (రాలిపోతున్న ఆకుల శబ్దం) కు 1967లో సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. 2000 లో బహదూర్ షా జాఫర్ పురస్కారం లభించింది. భారత ప్రభుత్వంచే 1984లో ఉర్దూ సాహిత్య విభాగంలో పద్మశ్రీ పురస్కారం. 2005 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నది.[5][7]
మరణం
[మార్చు]ఖుర్రత్ ఐన్ హైదర్ 2007 ఆగస్టు 21న న్యూఢిల్లీ సమీపంలోని నోయిడా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా మరణించింది. ఆమెను న్యూఢిల్లీ లోని జామియా మిల్లియా ఇస్లామియా శ్మశానంలో ఖననం చేసారు. ఆమె మృతి పట్ల అప్పటి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.
పనులు
[మార్చు]- అనువాదాలు
- Sound of the Falling Leaves. Asia Publishing House, 1996. ISBN 0-948724-44-7.
- A Season of Betrayals: A Short Story and Two Novellas. Oxford University Press, 2000. ISBN 0-19-579417-6.
- River of Fire. Translated by Qurratulain Hyder. New Directions Pub., 2003. ISBN 0-8112-1533-4.
- Fireflies in the Mist. New Directions Publishing, 2010. ISBN 0-8112-1865-1
- The Exiles. tr. by Nadeem Aslam. Hesperus Press, 2010. ISBN 1-84391-854-4.
మూలాలు
[మార్చు]- ↑ "Qurratulain Hyder, 1927–". Library of Congress.
- ↑ Jnanpith, p. 42
- ↑ "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 13 అక్టోబరు 2007. Retrieved 10 మే 2018.
- ↑ "Conferment of Sahitya Akademi Fellowship". Official listings, Sahitya Akademi website. Archived from the original on 2017-07-01. Retrieved 2018-05-10.
- ↑ 5.0 5.1 5.2 "Qurratulain Hyder". Encyclopædia Britannica. 18 January 2013. Retrieved 7 July 2014.
- ↑ "Vital statistics of colleges that figure among India's top rankers". India Today. 21 May 2001. Retrieved 7 July 2014.
- ↑ 7.0 7.1 "Famous Indian Urdu writer is dead". BBC. 21 August 2007. Retrieved 7 July 2014.
- The text and the context: an encounter with Jnanpith laureates (Citation and Biography). Bharatiya Jnanpith. 1994.
బయటి లంకెలు
[మార్చు]- Remembering Ainee Aapa, Obituary published by Aaj Archived 2017-01-13 at the Wayback Machine
- Library of Congress South Asian Literary Recordings Project
- Writer's Muse found at Jahane Rumi blog
- More information about her
- Zee News announcement of her death
- Deccan Herald announcement of her death
- Obituary published by the Friday Times, Pakistan
- Pages using the JsonConfig extension
- Commons category link is the pagename
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1927 జననాలు
- 2007 మరణాలు
- భారతీయ ముస్లిం మహిళలు
- ఉర్దూ రచయిత్రులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ అనువాద రచయిత్రులు
- ఉత్తర ప్రదేశ్ రచయిత్రులు
- భారతీయ నవలా రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు