నువ్వే కావాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువ్వే కావాలి
దర్శకత్వంకె. విజయ భాస్కర్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతరామోజీరావు, స్రవంతి రవికిషోర్
తారాగణంతరుణ్ ,
రిచా
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 13, 2000 (2000-10-13)
సినిమా నిడివి
146 ని.
భాషతెలుగు

నువ్వే కావాలి 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో తరుణ్, రిచా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచయిత. కోటి సంగీతం అందించాడు. హరి అనుమోలు కెమెరా బాధ్యతలు నిర్వహించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అక్టోబరు 13, 2000 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ కు కథానాయకుడిగా ఇదే మొదటి సినిమా. ఇది హిందీలో తుఝే మేరీ కసమ్ అనే పేరుతో పునర్మించారు. మలయాళ చిత్రం నిరం ఈ చిత్రానికి మాతృక.

తరుణ్, మధు చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరిదీ విడదీయరాని స్నేహం. ఇద్దరూ ఒకేరోజు, ఒకే హాస్పిటల్లో పుట్టి ఉంటారు. వాళ్ళ కుటుంబాల మధ్య కూడా అంతే స్నేహం ఉంటుంది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని అందరికీ తెలుసు. వర్ష అనే అమ్మాయి తరుణ్ ని మనసులోనే ఆరాధిస్తుంటుంది. తరుణ్, మధు చనువుగా తిరగడం చూసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా అని అడుగుతుంది. దానికి తరుణ్ నవ్వుతూ కొట్టి పడేస్తాడు. ఒకసారి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించిన ప్రకాష్ అనే అబ్బాయి అదే కళాశాలలో చేరతాడు. మధును చూడగానే మనసు పారేసుకుంటాడు.

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ చిత్రాన్ని నిర్మించాలని మొదట అనుకున్నది ఎక్జిక్యూటివ్ నిర్మాత స్రవంతి రవికిషోర్. ఈ చిత్రానికి మలయాళీ మాతృకయైన నిరం చూసినప్పటి నుండి అలాంటి సినిమా తెలుగులో కూడా చేస్తే బాగుంటుందని రవికిషోర్ అనుకున్నాడు. దర్శకుడు కె. విజయభాస్కర్ ను సంప్రదించి తన ఆలోచన చెప్పాడు. తర్వాత రవికిషోర్, కె. విజయభాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్ లు ముగ్గురూ కలిసి మళ్ళీ ఆ సినిమా చూసి స్క్రిప్టు తయారు చేశారు. నిరం చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా తెలుగులో సన్నివేశాలు చాలా వరకు వేరుగా ఉంటాయి. కానీ ఆ సమయానికి రవికిషోర్ ఆర్థిక స్తోమత సరిగాలేదు. అంతకు మునుపే ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు రవికిషోర్ తో కలిసి మంచి సినిమా చేయాలని అనుకుని ఉన్నారు. దాంతో రామోజీరావును చిత్ర నిర్మాణంలో సహాయం చేయమని కోరాడు. రవికిషోర్ పనితనం మీద నమ్మకం ఉన్న రామోజీరావు తెలుగు స్క్రిప్టు పూర్తిగా చూడకుండగానే నిర్మాతగా ఉండటానికి అంగీకరించాడు.[2]

నటీ నటుల ఎంపిక

[మార్చు]

ఒక మంచి యువ నటుడితో బడ్జెట్ లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ ఆలోచన. అప్పుడే మహేష్ బాబు కథానాయకుడిగా ప్రవేశించాడు. అతనికి నిరం చిత్రం చూడమని ప్రింట్ పంపించాడు. రెండు నెలలయినా స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ అనుకున్నారు. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు.[3] తర్వాత రాం గోపాల్ వర్మ హిందీ సినిమా మస్త్ లో నటిస్తున్న ఆఫ్తాబ్ శివదాసానీ ని కూడా పరిశీలించారు. అయితే తమ బడ్జెట్ లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించాడు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని కథానాయకుడిగా ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ తమ సినిమాను గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం 3 లక్షలు. కథానాయిక కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్ ను ఎంచుకున్నారు.[4]

విడుదల, ఫలితం

[మార్చు]

ఈ చిత్రం అక్టోబరు 13, 2000 న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.[5] సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.[5] ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయి.

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
జాతీయ పురస్కారములు
ఫిలింఫేర్ సౌత్ పురస్కారములు

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. ఈ చిత్రానికి సంగీతం కూర్చడానికి కోటి 15 రోజుల సమయం తీసుకున్నాడు. చెన్నైలో ఒంటరిగా ఆలోచించి బాణీలు సిద్ధం చేసుకుని వచ్చాడు. తర్వాత చిత్ర బృందానికి ఆ బాణీలు వినిపించగా వారు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. మాధుర్య ప్రధానమైన సంగీతం కావాలన్నారు. మరో రెండు రోజులు సమయం తీసుకుని ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది పాట బాణీ వినిపించాడు. దర్శకుడు కె. విజయభాస్కర్, నిర్మాత స్రవంతి రవికిషోర్ కు అది బాగా నచ్చింది. తర్వాత మిగతా పాటలకు బాణీలు కట్టాడు.[6]

  • అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే, రచన: భువనచంద్ర , గానం. దేవన్, అనురాధ శ్రీరామ్.
  • అనగనగా ఆకాశం ఉందీ గానం: జయచంద్రన్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
  • ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ,గానం: శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • షుక్రియా షుక్రియా , రచన: భువనచంద్ర , గానం. కోటి, సుజాత మోహన్
  • ఓలే ఓలె ఒలే, రచన: భువన చంద్ర, గానం. రాధిక
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి గానం: కె. ఎస్. చిత్ర , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  2. "'నువ్వేకావాలి' తెర వెనుక కథ ఇదే..!". www.eenadu.net. Retrieved 2020-10-12.
  3. "అందుకే 'నువ్వేకావాలి' వదులుకున్నా". EENADU. Retrieved 2024-08-09.
  4. "ఫ్లాష్ బ్యాక్ - మేకింగ్ ఆఫ్ నువ్వే కావాలి - Telugu 360". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.
  5. 5.0 5.1 Focus, Filmy; Focus, Filmy. "20 ఏళ్ళ 'నువ్వే కావాలి' గురించి మనకు తెలియని నిజాలు..!". Filmy Focus (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-17. Retrieved 2020-10-16.
  6. "'నువ్వేకావాలి' పాటల వెనుక కథ ఇది!". www.eenadu.net. Retrieved 2020-10-10.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు