పిన్నమనేని నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిన్నమనేని నరసింహారావు

డాక్టర్ పిన్నమనేని నరసింహారావు (1914 -2002) ప్రముఖ ఇ.ఎన్.టి వైద్య పరిశోధకులు. గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, ఆంధ్ర మెడికల్ కాలేజి కి రెండు సార్లు ప్రిన్సిపాల్‌గా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా, ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడమీకి అధ్యక్షులుగా పనిచేసారు. డా.బి.సి.రాయ్ జాతీయ పురస్కార గ్రహీత.

జననం,విద్య[మార్చు]

పిన్నమనేని నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా లోని నెప్పల్లి గ్రామంలో 1914లో పున్నయ్య, వరలక్ష్మీ దంపతులకు జన్మించారు. ఆయన కుటుంబం సమాజ సేవ, జాతీయ వాదం కలిగి ఉండేవారు. ఆయన తండ్రి పిన్నమనేని పున్నయ్య గారు స్థానిక సంస్థల నిర్వహణలలో నాయకత్వం వహించేవారు. ఆయన తల్లివైపు బంధువులు జాతీయ ఉద్యమాలలో పాల్గొనేవారు. వారసత్వంగా నరసింహారావు బాల్యంలో సమాజ సేవలలో అంకిత భావంతో భాగస్వాములయ్యేవారు. ప్రజలకు సేవలందించలనే తలంపుతో ఆయన వైద్య వృత్తిపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన ప్రాథమిక విద్యను స్థానిక విజయవాడలో పూర్తిచేసారు. తరువాత మద్రాసు వెళ్ళి క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించారు.[1]

ఆయన విశాఖపట్నం మెడికల్ కళాశాలలో చేరి 1939లో మెడిసిన్ లో పట్టభద్రుడయ్యారు. 1946లో ఆయన ఒటొలారినాలజీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్. డిగ్రీని చేసారు.

జీవిత విశేషాలు[మార్చు]

నరసింహారావు 1942 లో విశాఖపట్నంలోని కింగ్ జార్జి హాస్పటల్ లో ఇ.ఎన్.టి సర్జన్ గా నియమితులైనారు. తరువాత ఆంధ్ర మెడికల్ కళాశాలలో చెవి,ముక్కు,గొంతు వ్యాధుల విభాగంలో లెక్చరర్ గానూ, ట్యూటరుగానూ తన సేవలనందించారు. 1946లో ఆంధ్ర వైద్య కళాశాలలో ఇ.ఎన్.టి వ్యాధుల కోర్సు ప్రారంభించగా దానికి విభాగాధిపతిగా పనిచేసారు. 1959లో హాస్పటల్ సూపర్నిడెంట్ గా ఆతరువాత ఆంధ్ర మెడికల్ కాలేజి కి రెండు సార్లు ప్రిన్సిపాల్‌గా పనిచేసారు.

గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా, ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడమీకి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.[2] ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడమీకి వ్యవస్థాపక సభ్యులుగా 1981 నుండి2002 వరకు ఉండి విశిష్ట సేవలు అందించారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధుల శస్త్రచికిత్స చికిత్సలో నూతన పరిశోధనలు చేసి, అత్యుత్తమ నిపుణులుగా ఖ్యాతి గడించారు.

గుంటూరు వైద్య కళాశాలలో 1968లో మైక్రో ఇయర్ సర్జరీస్ ప్రారంభించారు.[3]

1990 లో ఇంటర్నేషనల్ మెడికల్ సైన్స్ అకాడమీకి అధ్యక్షులుగా పది సంవత్సాలు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో అకాడమి ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధించింది. పరిపాలనా దక్షత, క్రమశిక్షణలతో అకాడమి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసారు. ఇండియన్ మెడికల్ సైన్సెస్ అకాడమీ, ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడమీలూ రెంటినీ అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో కఠోర పరిశ్రమ చేసారు.

ఆగస్టు 1994లో ఆయన భారత మెడికల్ కౌన్సిల్ కు అధ్యక్షునిగా ఎన్నికైనారు.[4]

మరణం[మార్చు]

వైద్య రంగంలో విశేష సేవ చేసిన పిన్నమనేని నరసింహారావు విజయవాడలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని 2002 లో మరణించారు.

పురస్కారాలు[మార్చు]

ఆయన సుమారు 30 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

పిన్నమనేని పురస్కారాలు[మార్చు]

అంతర్జాతీయ మెడికల్ సైన్సెస్ అకాడమీ వారు ఈయన పేరు మిద అంతర్జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసారు. ఇది "డా.పిన్నమనేని నరసింహారావు అంతర్జాతీయ అవార్డు" పేరుతో అందజేయబడుతుంది.[5]

ఈయన సోదరుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు.[6] ఆయన, ఆయన కుటుంబ సభ్యులు "డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్" 1989, డిసెంబరులో ఏర్పాటు చేసారు.[7] 1989 నుంచి దాదాపు ప్రతి ఏడాది దేశ ప్రముఖులకు పురస్కార ప్రదానం చేస్తున్నారు.

డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కార గ్రహీతలు[8][మార్చు]

మూలాలు[మార్చు]

  1. DR. PINNAMANENI NARASIMHA RAO by santanu-banerjee on Aug 25, 2016[permanent dead link]
  2. 2.0 2.1 "Doctors remember former MCI chief". staff reporter. Thi Hindu. 13 August 2004. Retrieved 4 May 2017.
  3. "ENT Brief history of the E.N.T department". Archived from the original on 2017-07-01. Retrieved 2017-05-04.
  4. "కమ్మ వెలుగు - ప్రముఖ వ్యక్తులు". Archived from the original on 2017-05-12. Retrieved 2017-05-04.
  5. Dr. Pinnamaneni Narasimha Rao International Award[permanent dead link]
  6. "12 Great Sons of Vijayawada". Archived from the original on 2017-09-10. Retrieved 2017-05-04.
  7. 7.0 7.1 Pinnamaneni awards for Achyuta Samanta, RDT
  8. "PS Foundation". Archived from the original on 2017-10-05. Retrieved 2017-05-04.
  9. "Dr. Panangipalli Venugopal Citation". Archived from the original on 2016-03-04. Retrieved 2017-05-05.
  10. Pinnamaneni award for former RBI Governor
  11. Pinnamaneni foundation award for Hariprasad Chaurasia and Hindol
  12. "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాసరెడ్డిలకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ అవార్డు ప్రదానం". Archived from the original on 2018-03-17. Retrieved 2017-05-05.

ఇతర లింకులు[మార్చు]