భారతదేశ సరిహద్దులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశానికి చైనా, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులున్నాయి. [1] బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటితో భూ సరిహద్దులతో పాటు సముద్ర సరిహద్దులు కూడా ఉన్నాయి. శ్రీలంకతో రామసేతు ద్వారా సముద్ర సరిహద్దు మాత్రమే ఉంది. అండమాన్ నికోబార్ దీవుల ద్వారా థాయిలాండ్, మయన్మార్, ఇండోనేషియాలతో భారతదేశానికి సముద్ర సరిహద్దులు ఉన్నాయి.

భూ సరిహద్దులు[మార్చు]

భారతదేశానికి ఏడు సార్వభౌమ దేశాలతో భూ సరిహద్దులున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న 106 kilometres (66 mi) భూ సరిహద్దు ప్రస్తుతం, పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఉంది.

సరిహద్దు దేశం వివాదం ఉందా లేదా పొడవు కి.మీ. లలో (మైళ్ళలో) కాపలా కాసే భద్రతా దళం వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ లేదు 4,096 kilometres (2,545 mi) సరిహద్దు భద్రతా దళం 2015లో చాలా వరకు భారత-బంగ్లాదేశ్‌లు తమ తమ ఎన్‌క్లేవ్‌లను పరస్పరం మార్చుకున్నాయి.
భూటాన్ లేదు 578 kilometres (359 mi) [2] సశాస్త్ర సీమా బల్ స్వేచ్ఛా సరిహద్దు. భూటాన్-భారత సంబంధాలు చూడండి.
చైనా ఉంది 3,488 kilometres (2,167 mi) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ మెక్‌మహాన్ రేఖ, భారత-చైనా సరిహద్దు వివాదం లను చూడండి.
మయన్మార్ లేదు 1,643 kilometres (1,021 mi) అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ
నేపాల్ ఉంది 1,752 kilometres (1,089 mi) [3] సశాస్త్ర సీమ బాల్ స్వేచ్ఛా సరిహద్దు.
పాకిస్తాన్ ఉంది 3,310 kilometres (2,060 mi) సరిహద్దు భద్రతా దళం రాడ్‌క్లిఫ్ లైన్, లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవ క్షేత్ర స్థితి రేఖ, సర్ క్రీక్ కూడా చూడండి. భారతదేశ విభజన, ఇండో-పాకిస్తానీ యుద్ధాలు, వివాదాలు చూడండి.

సముద్ర సరిహద్దులు[మార్చు]

అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలలో EEZలు

భారతదేశపు సముద్ర సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి సముద్రపు చట్టం ద్వారా గుర్తించబడిన సముద్ర సరిహద్దులు. ఇందులో ప్రాదేశిక జలాలు, సమీప మండలాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల సరిహద్దులు ఉంటాయి. భారతదేశానికి 12-nautical-mile (22 km; 14 mi) ప్రాదేశిక సముద్రతీరం, 200-nautical-mile (370 km; 230 mi) స్వంత ఆర్థిక మండలి, ఏడు దేశాలతో 7,000-kilometre (4,300 mi) సముద్ర సరిహద్దు ఉంది.

సముద్ర సరిహద్దు దేశం పొడవు దళం వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ ఇండియన్ నేవీ బంగాళాఖాతంలోని న్యూ మూర్ ద్వీపం
ఇండోనేషియా ఇండియన్ నేవీ అండమాన్ సముద్రంలోని ఇందిరా పాయింట్
మయన్మార్ ఇండియన్ నేవీ అండమాన్ సముద్రంలో ల్యాండ్ ఫాల్ ద్వీపం
పాకిస్తాన్ ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో సర్ క్రీక్
థాయిలాండ్ ఇండియన్ నేవీ అండమాన్ సముద్రంలోని సిమిలాన్ దీవులు
శ్రీలంక > 400 kilometres (250 mi) [4] ఇండియన్ నేవీ పాక్ జలసంధిలోని కచ్చతీవు
మాల్దీవులు ఇండియన్ నేవీ లక్కదీవ్ సముద్రంలో మాలికు కండు

సరిహద్దు వేడుకలు[మార్చు]

వివిధ సరిహద్దు దాటే స్థలాల్లో భారతదేశం పొరుగు దేశాలతో కలిసి ఉమ్మడి వేడుకలను నిర్వహిస్తుంది. అమృత్‌సర్-లాహోర్ సమీపంలోని వాగా వద్ద ప్రజలు ఎక్కువగా హాజరై వేడుకలను చూస్తారు.

భారత్-పాకిస్థాన్ సరిహద్దు[మార్చు]

అట్టారి-వాఘా సరిహద్దులో సరిహద్దు వేడుక.

కింది సరిహద్దు దాటే ప్రదేశాలలో బీటింగ్ రిట్రీట్ జెండా వేడుకలు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు రెండు దేశాల సైన్యాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇవి పర్యాటక ఆకర్షణలుగా ప్రజలకు తెరిచి ఉంటాయి. [5] [6] ప్రత్యేక అనుమతి లేదా టిక్కెట్ అవసరం లేదు. ఉత్తరం నుండి దక్షిణం వరకు, వేడుక స్థలాలు క్రింది విధంగా ఉన్నాయి:

భారత-చైనా సరిహద్దు[మార్చు]

సిక్కింలోని నాథు లా సరిహద్దు.

భారతదేశం, చైనాల మధ్య ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ స్థానాలు (బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ BPM) ఉన్నాయి. ఇక్కడ వారు సైనిక విషయాలను చర్చించడానికి జెండా సమావేశాలను నిర్వహిస్తారు. అలాగే నూతన సంవత్సర దినోత్సవాన్ని (జనవరి 1), భారతదేశ గణతంత్ర దినోత్సవం (జనవరి 26), హార్వెస్ట్ ఫెస్టివల్ (ఏప్రిల్ 14), [10] మే 15 PLA డే, భారత స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజులలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు సాంస్కృతిక మార్పిడి కోసం వేడుకలను నిర్వహిస్తారు. [11] [12] ఈ సమావేశాలలో రెండు దేశాల జాతీయ గీతాన్ని ఆలాపించడం, సంబంధిత జెండాలకు వందనం చేయడం, ఉభయ సైన్యాల ప్రతినిధుల ఉత్సవ ప్రసంగాలు ఉంటాయి. [10] భారతదేశం వైపు ఈ BPM స్థలాల్లో 2 చోట్ల మాత్రమే సందర్శించడానికి, అందునా కేవలం భారతీయ పౌరులను మాత్రమే అనుమతిస్తారు. బుమ్ లా పాస్, నాథు లా లలో బుధవారాలు, గురువారాలు, శనివారాలు, ఆదివారాల్లో మాత్రమే, ఒక రోజు ముందే ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) పొందిన భారతీయ పౌరులకు మాత్రమే, సందర్శించే అనుమతి లభిస్తుంది. [13]

ఈ సమావేశాలు జరిగే ఈ BPM సరిహద్దు పోస్టులు, పశ్చిమం నుండి తూర్పు దిశగా ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • DBO
  • స్పంగూర్ గ్యాప్ (చుషుల్)
  • నాథు లా: సిక్కింలోని రుమ్టెక్ వంటి బౌద్ధమత పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్రికులు ఈ కనుమ గుండా వెళ్తారు. మానస సరోవరాన్ని సందర్శించే హిందూ యాత్రికుల ప్రయాణ సమయం ఈ కనుమ వలన పదిహేను రోజుల నుండి రెండు రోజులకు తగ్గుతుంది. [14]
  • బుమ్ లా కనుమ (తవాంగ్): ఆదివారాలు, సాంస్కృతిక వేడుకల సమయంలో.
  • కాహో, భారతదేశం (వాలాంగ్ సెక్టార్‌లోని కిబితు కు ఉత్తరాన ఉంది).

భారత బంగ్లాదేశ్ సరిహద్దు[మార్చు]

బెనాపోల్-పెట్రాపోల్ సరిహద్దు వేడుకలో భారత, బంగ్లాదేశ్ సైనికులు.

బెనాపోల్-పెట్రాపోల్ సరిహద్దు వేడుక, భారత-పాక్ సరిహద్దు వాఘా వద్ద జరిగే వేడుకల లాంటిదే కానీ, చాలా స్నేహపూర్వకంగా జరిగే వేడుక. భారతదేశ సరిహద్దు భద్రతా దళం, బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ప్రతిరోజూ సాయంత్రం 4.30 నుండి 5 గంటల వరకు దీన్ని నిర్వహిస్తారు. ఎటువంటి టిక్కెట్లు, ప్రత్యేక అనుమతులు లేకుండా పౌరులు దీన్ని తిలకించవచ్చు. [15] బెనాపోల్ - పెట్రాపోల్ జాయింట్ రిట్రీట్ వేడుకలో భారత బంగ్లాదేశ్ జాతీయ జెండాలను అవనతం చేస్తారు. [16]

ICP & LCS లు ఉండే సరిహద్దు దాటే స్థానాలు[మార్చు]

ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు (ICP)[మార్చు]

భారతదేశంలో 7 చెక్‌పోస్టులు ఉన్నాయి. 3,000 crore (US$380 million) ఖర్చుతో మరో 13 కస్టమ్స్‌ స్టేషన్లను (వాటిలో సరిహద్దుల వద్ద ఉన్నవి 7) చెక్‌పోస్టుల స్థాయికి పెంచి, మొత్తం సరిహద్దు చెక్‌పోస్టులను 14 చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి (2017 అక్టోబరు నాటికి). [17][18] ఇంటెగ్రేటెడ్ చెక్‌పోస్టులలో కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలు రెండూ ఉంటాయి. అలాంటి ఇంటెగ్రేటెడ్ చెక్‌పోస్టుల జాబితా ఇది: [19]

భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు[మార్చు]

  • అస్సాం
    • కరీమ్‌గంజ్, బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలోని - గోలప్‌గంజ్ ఉప్పోజిల్లా షియోలా పోస్ట్ (సిల్హెట్ డివిజన్, బంగ్లాదేశ్) ల మధ్య NH37 (భారతదేశం) పై, సుతార్‌కండి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ క్రాసింగ్ మీదుగా. దీని ప్లాన్‌ను 2017 అక్టోబరున ప్రకటించారు. [17]
  • మేఘాలయ
    • షిల్లాంగ్ - సిల్హెట్ - దౌకీ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ క్రాసింగ్ (జైంతియా హిల్స్, ఇండియా), తంబిల్ పోస్ట్ (బంగ్లాదేశ్) ల ద్వారా. దౌకీలో శంకుస్థాపన 2017 జనవరిలో చేసారు. 2018 నుండి పనిచేస్తోంది. [20]
  • మిజోరం
    • కావర్‌పూయిచువా - లంగ్‌లై జిల్లాలోని త్లాబుంగ్ సమీపంలో. 2017 అక్టోబరులో మొదలైంది. [17][21] భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు కనెక్టివిటీని పెంపొందించడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో 2014-2015లో 22 కి.మీ. ల లుంగ్లీ-త్లాబుంగ్-కౌర్‌పుచ్‌హువా రహదారిని మెరుగుపరచారు. [22] ఇది ఖవ్తలాంగ్తుయిపుయ్ నది వద్ద ఉంది.
  • పశ్చిమ బెంగాల్
    • కోల్‌కతా - పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ క్రాసింగ్ ద్వారా ఢాకా, ఇప్పటికే పని చేస్తోంది [18]
    • బరాసత్ (భారతదేశం) నుండి ఘోజదంగా (బంగ్లాదేశ్), 2017 అక్టోబరులో ప్రతిపాదించారు. [17] [23]
    • మాల్దాలోని మాల్దా జిల్లాలోని మహదీపూర్ - మహదీపూర్ క్రాసింగ్ ద్వారా రాజ్‌షాహి, 2019లో ప్రాథమిక ఆమోదం. [23] [19]
    • ఫుల్బారి, 2017 అక్టోబరులో ప్రతిపాదన. [19]
    • హిలీ, 2017 అక్టోబరులో ప్రతిపాదన. [19]
    • చంగ్రబంధ రైల్వే స్టేషన్, 2019లో ప్రాథమిక ఆమోదం. [23]

భారత్-భూటాన్ సరిహద్దు[మార్చు]

  • పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్ జిల్లాలోని జైగావ్, 2016 లో ప్రతిపాదన. [24]

ఇండియా-మయన్మార్ సరిహద్దు[మార్చు]

  • మోరే ICP, ఇప్పటికే పని చేస్తోంది. [25]
  • జోచావ్‌చువా (భారతదేశంలోని లాంగ్ట్లై జిల్లా ) - కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్‌పై ఇండో-మయన్మార్ సరిహద్దు వద్ద జోరిన్‌పుయ్ (మయన్మార్) ఇప్పటికే పని చేస్తోంది [25] [21] సాయిరాంగ్ నుండి హ్మాంగ్‌బుచువా వరకు రైలు మార్గం కోసం సర్వే 2017 ఆగస్టులో పూర్తయింది. [26]

భారతదేశం-నేపాల్ సరిహద్దు[మార్చు]

భిత్తమోర్ వద్ద సూచిక.
  • జోగ్బాని, బీహార్ [24]
  • పానిటంకి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా, [24] 2019లో ప్రాథమిక ఆమోదం. [23]
  • రక్సాల్, బీహార్ [24]
  • సోనౌలీ, ఉత్తరప్రదేశ్  .
  • రూపైదిహా, ఉత్తరప్రదేశ్ [24]

భారత్-పాకిస్థాన్ సరిహద్దు[మార్చు]

  • కర్తార్‌పూర్ కారిడార్ - డేరా బాబా నానక్ నుండి వీసా లేకుండా పాకిస్తాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించడానికి వీలుగా సరిహద్దు దాటే స్థలం. భారతీయ పౌరులకు మాత్రమే.

ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (LCS)[మార్చు]

భారత-బంగ్లాదేశ్ సరిహద్దు[మార్చు]

ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (LCS) (ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలు లేవు): [28]

  • అస్సాం
    • మంకచార్ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (భారతదేశం) - రౌమారి పోస్ట్ (నాతున్ బందర్, రంగ్‌పూర్ డివిజన్, బంగ్లాదేశ్)
    • కరీంగంజ్ స్టీమర్ అండ్ ఫెర్రీ స్టేషన్ (KSFS) (భారతదేశం) - జాకీగంజ్ పోస్ట్ (సిల్హెట్ డివిజన్, బంగ్లాదేశ్)
    • గౌహతి స్టీమర్ ఘాట్ ( ధుబ్రి జిల్లా, భారతదేశం) -
    • ధుబ్రి స్టీమర్ ఘాట్ (ధుబ్రి జిల్లా, భారతదేశం) - రౌమతి (మేమాన్‌సింగ్ డివిజన్, బంగ్లాదేశ్)
    • అస్సాం నాన్-ఫంక్షనల్ LCS:
      • మహిసాసన్ రైల్వే స్టేషన్ (కరీంగంజ్ జిల్లా, భారతదేశం) - షాబాజ్‌పూర్ (సిల్హెట్ డివిజన్)
      • గోలోక్‌గంజ్ (ధుబ్రి జిల్లా) - సోనాహత్ (రంగపూర్ డివిజన్)
      • సిల్చార్ రైల్వే మెయిల్ సర్వీస్ (భారతదేశం) - సరిహద్దు వద్ద కాదు, లోతట్టు LCS
  • మేఘాలయ
    • బగ్మారా (సౌత్ గారో హిల్స్, ఇండియా) - బిజోయౌర్ పోస్ట్ (బంగ్లాదేశ్)
    • భోలాగంజ్ (తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా) - చతక్ (సునమ్‌గంజ్ డివిజన్)
    • బోర్సర ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (వెస్ట్ ఖాసీ హిల్స్, ఇండియా) - బోర్సర పోస్ట్ (బంగ్లాదేశ్)
    • వెస్ట్ గారో హిల్స్ - NH12 లో మహేంద్రగంజ్ క్రాసింగ్ మీదుగా బక్షిగంజ్
    • NH217 (పశ్చిమ గారో హిల్స్, ఇండియా), నకుగావ్ పోస్ట్ (బంగ్లాదేశ్) మీద డాలు క్రాసింగ్ ద్వారా తురా - నలితాబరి
    • షెల్లాబజార్ (పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా) - సునమ్‌గంజ్ (సిల్హెట్ డివిజన్)
    • గసుపరా (సౌత్ గారో హిల్స్ జిల్లా)- కరోయిటోల్ (మైమాన్సింగ్ డివిజన్)
    • మేఘాలయ నాన్-ఫంక్షనల్ LCS:
      • రింగు (తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా) - కలిబారి (సోనమ్‌గంజ్ డివిజన్)
      • బలాత్ (తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా) - డోలురా (సిల్హెట్ డివిజన్)
  • మిజోరం
    • కవార్‌పుచియా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్, 2017 అక్టోబరులో ప్రారంభం. [30]
    • మిజోరంలో పనిచేయని LCS: దేమగిరి (లుంగ్లీ జిల్లా) - రంగమతి (సిల్హెట్ డివిజన్)

భారత్-పాకిస్థాన్ సరిహద్దు[మార్చు]

 

సరిహద్దు బజార్లు, సంతలు[మార్చు]

ఈ ప్రతిపాదిత సరిహద్దు బజార్లు, సంతల ఏర్పాటు వివిధ దశలలో ఉంది. సరిహద్దు సంతల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సూచించాయి. [31]

భారత-బంగ్లాదేశ్ సరిహద్దులో సంతలు

భారత-భూటాన్[మార్చు]

భారత్-భూటాన్ సరిహద్దులో భారత్ -భూటాన్ సరిహద్దు సంతల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

భారత-మయన్మార్[మార్చు]

భారతదేశం-మయన్మార్ సరిహద్దు సంతలు. [33] [34]

  • అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సంతలు
    • చాంగ్లాంగ్ జిల్లా
      • పాంగ్సౌ పాస్ ( నాంపాంగ్ ), - పాంగ్సౌ, కాచిన్ రాష్ట్రం
      • చింగ్సా (ఖిమియాంగ్ సర్కిల్) - లాంగ్‌హాంగ్, కాచిన్ రాష్ట్రం
      • మకాంటోంగ్ (ఖిమియాంగ్ సర్కిల్) - నగైమోంగ్, కచిన్ రాష్ట్రం

మీడియాలో[మార్చు]

ప్రదీప్ దామోదరన్ రాసిన"బోర్డర్ ల్యాండ్స్: ట్రావెల్స్ ఎక్రాస్ ఇండియాస్ బౌండరీస్" పుస్తకంలో భారతదేశంలోని అన్ని భూ సరిహద్దులను వివరించాడు. [35] బాలీవుడ్ దర్శకుడు JP దత్తాకు భారతదేశ సరిహద్దును ఇతివృత్తంగా తీసుకుని హిందీ సినిమాలను రూపొందించడంలో ప్రత్యేకత ఉంది. అతని సినిమాలు బోర్డర్ (1997 చిత్రం), రెఫ్యూజీ (2000 చిత్రం), LOC: కార్గిల్, పల్టాన్ (చిత్రం) మొదలైనవి సరిహద్దు ఇతివృత్తంగా కలిగినవి. [36]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Neighbouring Countries of India 2020: Map, Capitals, Connected States". www.careerpower.in.
  2. SSB to strengthen presence on India-Bhutan border, Times of India, 20 Dec 2017.
  3. "doklam: SSB to strengthen presence on India-Bhutan border | India News - Times of India". The Times of India.
  4. "Fishing rights disputes between India and Sri Lanka". Archived from the original on 2017-12-22. Retrieved 2017-12-20.
  5. 5.0 5.1 5.2 5.3 5 crossing points in India: All you need to know, India Today, 10 OCt 2016.
  6. 6.0 6.1 6.2 6.3 Beating Retreat Wagah India, CHanging Guards, accessed 8 July 2021.
  7. Sadqi retreat ceremony, nic.in, accessed 8 July 2021.
  8. Second Wagah: India, Pak agree to new ceremony, beating retreat on Punjab border, Hindustan Times, 201 April 2017.
  9. At Sadiqi border, strained Indo-Pak ties dampen spirits, The Tribune, 17 April 2019.
  10. 10.0 10.1 Yusuf, Jameel (April 14, 2016). "India, China officials meet on Ladakh border, pledge to maintain LAC sanctity". Deccn Chronicle. Retrieved November 24, 2017.
  11. "Indian, Chinese armies decide to improve ties at functional level". News18. Retrieved September 14, 2017.
  12. "Bonhomie, friendship between Indian and Chinese border personnel at Nathu La". sify.com. Archived from the original on December 1, 2017. Retrieved November 24, 2017.
  13. Envis Team (4 June 2006). "Ecodestination of India-Sikkim Chapter" (PDF). Eco-destinations of India. The Environmental Information System (ENVIS), Ministry of Environment and Forest, Government of India. p. 45. Archived from the original (PDF) on 19 June 2007. Retrieved 1 December 2006.
  14. Vinayak, G (28 July 2004). "Nathu La: closed for review". The Rediff Special. Rediff.com. Archived from the original on 22 February 2006. Retrieved 26 November 2006.
  15. "Retreat Ceremony at Indo–Bangladesh Border". PIB. Press Information Bureau. Retrieved 9 April 2016.
  16. "PETRAPOLE SET TO HAVE A SPECTACULAR RETREAT CEREMONY" (PDF). PRESS RELEASE. BORDER SECURITY FORCE. Archived from the original (PDF) on 22 July 2014. Retrieved 9 April 2016.
  17. 17.0 17.1 17.2 17.3 [1], Indian Express, Oct 2017.
  18. 18.0 18.1 18.2 "India plans to construct 7 integrated check posts on border with Bangladesh". Dhaka Tribune. October 18, 2017.
  19. 19.0 19.1 19.2 19.3 "Ministry of Development of North Eastern Region, North East India". mdoner.gov.in.
  20. Dawki ICP foundation stone laid.
  21. 21.0 21.1 "12th Five Year Plan". Archived from the original on 2013-06-19. Retrieved 2023-01-07.
  22. $107 Million World Bank Project to Connect Mizoram with Bangladesh and Myanmar via Roads, World Bank.
  23. 23.0 23.1 23.2 23.3 23.4 23.5 Delhi approves Sutarkandi integrated check post along Indo-Bangla border, North East News, 7 Jan 2019.
  24. 24.0 24.1 24.2 24.3 24.4 24.5 Indo-Nepal and Indo-Bhutan border to have more ICP, Oct 2016.
  25. 25.0 25.1 India opens two border crossing points with Myanmar, Bangladesh, Times of India, 1 Oct 2017.
  26. India's north east opened up Archived 2018-11-27 at the Wayback Machine, PowerUpConstruction.Com
  27. "सीतामढ़ी के भिठ्ठामोड़ में भारत-नेपाल सीमा के नो-मेंस लैंड पर बनेगा इंटीग्रेटेड चेकपोस्ट". Hindustan (in hindi). Retrieved 2021-01-17.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  28. ICP and LCS
  29. "Tripura opens new land customs station along Bangladesh border". bdnews24.com.
  30. "India opens two border crossing points with Myanmar, Bangladesh". @businessline.
  31. "Ministry of Development of North Eastern Region, North East India". mdoner.gov.in.
  32. Meghalaya border haats Archived 2023-01-07 at the Wayback Machine, megindustry.gov.in, accessed 28 Aug 2021.
  33. Closer economic ties with neighbours vital, The Hindu, 7 May 2019.
  34. Border haats of India
  35. What will you see if you visit the precise point where India ends and Sri Lanka begins?, Scroll.in, 1 March 2017.
  36. Adrian M. Athique, 2010, A Line in the Sand: The India–Pakistan Border in the Films of J.P. Dutta, Centre for Critical and Cultural Studies, University of Queensland, Pages 472-499.