గణతంత్ర దినోత్సవం

వికీపీడియా నుండి
Republic dsy wallpaper en-wiki.jpg
2004లో మద్రాసు రెజిమెంటు నందు సైనికులు కవాతు చేస్తున్న దృశ్యం.

గణతంత్ర దినోత్సవం (ఆంగ్లం : Republic Day) : ఒక దేశపు రాజ్యాంగవిధానం ప్రకారం, ఆదేశమును గణతంత్ర దేశం గా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" దినం.

[మార్చు] భారత్ - గణతంత్ర దినోత్సవం

మనము ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవము (Republic Day) జరుపు కుంటాము . ఇది దేశవ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ. 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిరి. వారు పరిపాలించినంత కాలము మనదేశములోని పరిపాలనా విదానము బ్రిటిష్ రాజ్యాంగము ప్రకారము జరిగేది. వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగమూ తయారైనది , అలా తయారయిన రాజ్యాంగము ఎప్పుదో ఒకప్పుడు మొదలిపెట్టాలి కదా, మనము అలా మొదలు పెట్టిన రోజే .. 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరము జనవరి 26 న పండగ జరుపుకుంటున్నాము .

మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి , ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 (రెండు)సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది.

[మార్చు] ఇతర దేశాలు

ఫ్రెక్కే ట్రైకలరి ఫెస్టా డెల్లా రిపబ్లికా, ఇటలీ గణతంత్ర ఉత్సవాలు, జూన్ 2, 2005.

గణతంత్ర దినము ('Republic Day) అనునది రిపబ్లిక్ హాలిడే అని అనేక దేశాలలో వ్యవహరింపబడుచున్నది. ఈ దినాన ఆయా దేశాలు రిపబ్లిక్ దేశాలుగా ప్రకటించడమైనది.

[మార్చు] మూలము

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు