అంజలి (నటి)

వికీపీడియా నుండి
(అంజలి (తమిళ నటి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంజలి
జననం
అంజలి

(1986-09-11) 1986 సెప్టెంబరు 11 (వయసు 38)
వృత్తినటీమణి, మోడల్.
క్రియాశీల సంవత్సరాలు2006–ఇప్పటి వరకు

అంజలి (English: Anjali) తమిళ సినిమాలలో నటిస్తున్న ఒక భారతదేశ నటీమణి, మోడల్. అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో 1986 సెప్టెంబరు 11న జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.[1]

సినీ ప్రస్థానం

[మార్చు]
  • మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి. అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన 'డేర్'.
  • తర్వాత 2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో 'ప్రేమలేఖ రాశా'.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ 'జర్నీ'లో అవకాశం ఇచ్చారు.
  • 2011లో విడుదలైన 'జర్నీ' సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది.
  • 2013లో మళ్లీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.
  • తర్వాత 'బలుపు' సినిమాలో శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని, రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి.
  • ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది.
  • తమిళచిత్రం 'ఎంగేయం ఎప్పోదం' (తెలుగులో జర్నీ)లో తన అద్భుతమైన నటనకు గాను 'సౌత్ ఫిల్మ్‌ఫేర్-2012', 'విజయ్' అవార్డులు సొంతం చేసుకుంది.

ఈమె నటించిన పాత్రల్లో రెండు చిన్న తెలుగు సినిమాలో నటించిన సమయంలో 2007 సంవత్సరంలో కట్రదు తమిళ్ అనే తమిళ సినిమాతో పరిచయమైయ్యారు. ఆనంది అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించడంతో ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2010లో అంగాడితెరు అనే సినిమాలో కనిగా నటించి ఆ సంవత్సరంలోని ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల తరువాత అత్యుత్తమ యువ నటిగా తమిళ సినిమా ప్రపంచంలో గుర్తింపు పొందారు,[2] ప్రదర్శన ఆధారిత పాత్రలలో నటిస్తు ప్రసిద్ధి చెందుతున్నారు.[3][4][5]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2006 ఫోటో స్వప్న తెలుగు
2007 ప్రేమలేఖ రస సంద్య తెలుగు
కత్తరదు తమిళ్ ఆనంది తమిళం
2008 హొంగనాసు ఇంపానా కన్నడ
ఆయుధం సీవోం మీనాక్షి తమిళం
2010 అంగడి తేరు సెర్మక్కని తమిళం
రెట్టైసుజి సుశీల తమిళం
మాగిజ్చి కుజాలీ తమిళం
2011 పయ్యన్స్ సీమ మలయాళం
తూంగా నగరం కలైవాణి (రాధ/తేరు త్రిష) తమిళం
కరుంగళి అముధానిల గుణశేఖరన్ తమిళం
కో అంజలి తమిళం "ఆగ నాగ" పాటలో ప్రత్యేక పాత్ర
మంకథ సుచిత్ర సుమంత్ తమిళం
ఎంగేయుమ్ ఎప్పోతుమ్ మణిమేగలై రామసామి తమిళం
తంబి వెట్టోటి సుందరం లార్డ్ మేరీ తమిళం
మహారాజా ప్రియా తమిళం
2012 అరవాన్ వాంచి తమిళం అతిధి పాత్ర
కలకలప్పు మాధవి తమిళం
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీత తెలుగు
వాటికూచి లీనా తమిళం
సెట్టై శక్తి తమిళం
బలుపు డా. అంజలి తెలుగు
సింగం II అంజలి తమిళం "వాలే వాలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన [1]
మసాలా సానియా / సరిత / సావిత్రి (చిత్రం) తెలుగు
2014 గీతాంజలి గీతాంజలి / ఉషాంజలి (ద్వంద్వ పాత్రలు) తెలుగు
2015 రాణా విక్రమ గౌరీ కన్నడ
సకలకళ వల్లవన్ అంజలి తమిళం
శంకరాభరణం దఖు రాణి మున్నీ తెలుగు అతిధి పాత్ర
2016 నియంత కాత్యాయిని తెలుగు
మాప్లా సింగం శైలజ తమిళం
సర్రైనోడు సింతామణి తెలుగు "బ్లాక్ బస్టర్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
ఇరైవి పొన్ని తమిళం
2017 ఎనక్కు వైత ఆదిమైగల్ సంధ్య తమిళం అతిధి పాత్ర
చిత్రాంగద చిత్రాంగద తెలుగు
తారామణి సౌమ్య తమిళం అతిధి పాత్ర
బెలూన్ జాక్వెలిన్ తమిళం
2018 రోసాపూ రేష్మి మలయాళం
కాళీ వల్లి తమిళం
2019 పేరంబు విజయ లక్ష్మి "విజి" తమిళం
లిసా లిసా తమిళం
సింధుబాద్ వెన్బా తమిళం
2020 నాడోడిగల్ 2 సెంగోడి తమిళం
నిశ్శబ్ధం / మహా లక్ష్మి "మహా" తెలుగు ద్విభాషా చిత్రం
నిశ్శబ్దం తమిళం
పావ కదైగల్ జ్యోతి లక్ష్మి/ ఆది లక్ష్మి తమిళం నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ; సెగ్మెంట్: లవ్ పన్నా ఉత్తరం
2021 వకీల్ సాబ్ జరీనా తెలుగు
2022 బైరాగీ సంగీత ఉపాధ్యాయుడు కన్నడ
మాచర్ల నియోజకవర్గం ఆమెనే తెలుగు "రా రా రెడ్డి ఐయామ్ రెడీ" సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్
2023 ఇరట్ట మాలిని మలయాళం
2024 గీతాంజలి మళ్ళీ వచ్చింది గీతాంజలి / ఉషాఅంజలి (ద్విపాత్రాభినయం) తెలుగు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రత్నమాల తెలుగు
గేమ్ ఛేంజర్ తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2021 నవరస ముత్తులక్ష్మి తమిళం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ విభాగం: తునింత పిన్
2022 ఝాన్సీ ఝాన్సీ తెలుగు హాట్‌స్టార్ విడుదల [6]
2024 బహిష్కరణ తెలుగు జి 5 తెలుగు వెబ్ సిరీస్ [7]

వివాదాలు

[మార్చు]

2013, ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న హోటల్ నుంచి ఉన్నట్టుండి మాయమవడంతో కాస్త అలజడి సృష్టించింది అంజలి. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలాంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

పురస్కారాలు

[మార్చు]

నంది పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)[8][9][10][11]

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

[మార్చు]

విజయ్ పురస్కారాలు

[మార్చు]
  • 2008: ఉత్తమ నూతన నటీమణి - కట్రదు తమిళ్ [12]
  • 2011: ఉత్తమ నటీమణి - అంగాడితెరు

ఇతర పురస్కారాలు

[మార్చు]
  • 2011: ఉత్తమ నటిగా విగడన్ పురస్కారం- అంగాడితెరు
  • 2011: ఉత్తమ నటిగా తమిళ సినిమా ప్రెస్ పురస్కారం- గాడితెరు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-13. Retrieved 2020-02-19.
  2. "Anjali eyeing mass films?". Sify.com. Archived from the original on 2011-01-25. Retrieved 2011-09-21.
  3. "Anjali wants to do commercial cinema - Times of India". Articles.timesofindia.indiatimes.com. 2011-01-17. Archived from the original on 2011-09-16. Retrieved 2011-09-21.
  4. "I want people to say there's no one like me". Rediff.com. 2011-09-15. Retrieved 2011-09-21.
  5. "Image makeover for Anjali - Times of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2012-09-27. Retrieved 2011-09-21.
  6. "Anjali to Star in Telugu Web Series Jhansi". News18 (in ఇంగ్లీష్). 30 December 2021. Retrieved 27 January 2022.
  7. "Anjali: మాస్ క్యారెక్టర్ లో అంజ‌లి....బ‌హిష్క‌ర‌ణ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌".
  8. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  9. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  10. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  11. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  12. "Reliance Mobile Vijay Awards - The Awards Ceremony". Star Vijay. Archived from the original on 2009-04-25. Retrieved 2009-03-27.

బయటి లింకులు

[మార్చు]