అలీపూర్‌ద్వార్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలిపురద్వార్ జిల్లా
పశ్చిమ బెంగాల్ లోని జిల్లా
పశ్చిమ బెంగాల్ లో అలిపురద్వార్ జిల్లా ఉనికి
పశ్చిమ బెంగాల్ లో అలిపురద్వార్ జిల్లా ఉనికి
దేశంభారతదేశం
రాష్ట్రం పశ్చిమ బెంగాల్
డివిజన్జల్‌పైగురి
ముఖ్యపట్టణంఅలిపురద్వార్
Government
 • లోక్‌సభ నియోజకవర్గంఅలీపురద్వార్
విస్తీర్ణం
 • మొత్తం3,136 కి.మీ2 (1,211 చ. మై)
జనాభా
 • మొత్తం15,01,983
 • జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
Time zoneUTC+05:30 (భా.ప్రా.కా)
Websitehttp://alipurduar.gov.in/

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో అలిపురుదుయర్ (আলিপুরদুয়ার জেলা) జిల్లా ఒకటి.[1] జిల్లాలో అలిపురుదుయర్ పురపాలకం, ఫలకత పురపాలకం, 6 బ్లాకులు (మదరిత, బిర్పర, అలిపురుదుయర్-1, అలిపురుదుయర్-2, ఫలకత, కలచిని, కుమరగం. 6 బ్లాకులలో 66 గ్రామపంచాయితీలు, 9 పట్టణాలు ఉన్నాయి. జిల్లా ప్రధానకార్యాలయాలు అలిపురుదుయర్ పట్టణంలో ఉన్నాయి. 2014 జూన్ 14న ఈ జిల్లా రూపొందించబడింది.[2]

విభాగాలు

[మార్చు]

జిల్లాలో అలిపురుదుయర్ పురపాలకం, ఫలకత పురపాలకం ఉన్నాయి. 6 బ్లాకులు (మదరిత, బిర్పర, అలిపురుదుయర్-1, అలిపురుదుయర్-2, ఫలకత, కలచిని, కుమరగం) 66 గ్రామపంచాయితీలు, 9 పట్టణాలు ఉన్నాయి.[3] తొమ్మిది పట్టణాలు ఉన్నాయి: పశ్చిమ జిత్పూర్, చెచఖత, అలిపురుదుయర్, భోలార్ దబ్రి, సోభగంజ్, ఫలకత, జయ్గయాన్,, ఉత్తర లతబరి, ఉత్తర కామాక్యగురి. [4]

మండలాలు

[మార్చు]

మదరిత బిర్పర మండలం

[మార్చు]

గ్రామీణ ప్రాంతం మదరిహత్ -బిర్పర మండలంలో 10 గ్రామపంచాయితీలు ( బందపని, హంతపర, మదరిహత్, టోటోపర బల్లగురి, బిర్పర-1, ఖయర్బరి, రంగలిబజ్న, బిర్పర- 2, లంకపర, షిషఝంరా) ఉన్నాయి.[3] ఈ బ్లాకులో నగరప్రాంతం లేదు.[4] మదరిహత్, బిర్పర పోలీస్టేషను ఈ బ్లాకులో ఉన్నాయి.[5] ఈ మండల ప్రధానకార్యాలయం మదరిహత్‌లో ఉంది.

అలిపురుదుయర్ మండలం

[మార్చు]

అలిపురుదుయర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు మండలంలో 11 గ్రామపంచాయితీలు (బంచుకమరి, పరోర్పర్, షల్కుమార్, వివేకానంద -1, చకొవఖేతి, పత్లఖవ, షల్కుమర్-2, వివేకానందా-2, మథురా, పూర్బా కందల్బరి, తపసిఖత) ఉన్నాయి.[3] శాంతలి, ఓరాయోన్, మదెసియా, గారో వంశావళికి చెందిన బంచుకమరి ప్రజలు ఈ జిల్లాలో అధికసంఖ్యలో ఉన్నారు. బంగ్లాదేశ్ శరణార్ధులు కూడా ఈ మండలంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మండలంలో 4 పట్టణాలు (పశ్చిం జిత్పూర్), చెచకత, అలిపురుదూర్ రైల్వే జంక్షన్,, బోలార్ దబ్రి) ఉన్నాయి. భవోయియా సంగీత రాష్ట్రీయ పోటీలలో విజేతలు ఈ మండలంలో 5 గురు ఉండడం ఒక ప్రత్యేకత.[4] ఈ మండలంలో అలిపురుదూర్ పోలీస్ స్టేషను ఉంది.[5] ఈ మండలం కేద్రంగా పంచకల్గురి ఉంది.

అలిపురుదుయర్-2 మండలం

[మార్చు]

అలిపురుదుయర్-2 కమ్యూనిటీ డెవెలెప్మెంట్ మండలంలో 11 గ్రామపంచాయితీలు ఉన్నాయి. చపోరర్ పార్-1, మహాకాల్గురి, షముకతల, తుర్తురి, మఝేర్దబ్రి, తత్పర-1, భతిబరి, కోహినూర్, పరోకత,, తత్పరా-2) ఉన్నాయి.[3] ఈ మండలంలో ఒక పట్టణం ఉంది. .[4] ఈ బ్లాకుకు అలిపురుదుయర్ పోలీస్ స్టేషను సేవలు అందిస్తున్నది.[5] అలిపురుదుయర్-2 ఈ మండలానికి కేంద్రంగా ఉంది.

ఫలకత మండలం

[మార్చు]

ఫలకత కమ్యూనిటీ డెవెలెప్మెంటు మండలంలో 12 గ్రామపంచాయితీలు ( డల్గయోన్, ధనిరాంపూర్ -2, గౌబర్నగర్, మైరదంగ, డియోగయోన్, ఫతలకత-1, జతేశ్వర్-1, పరంగర్పర్, ధనిరాంపూర్-1, ఫతలకత-2, జతేశ్వర్-2, షల్కుమార్ ) ఉన్నాయి[3] ఈ బ్లాకులో ఒక పట్టణం (ఫతలకత) ఉంది.[4] బ్లాకులో ఫతలకత పోలీస్ స్టేషను సేవలందిస్తింది.[5] ఈ బ్లాక్ ప్రధాన కార్యాలయం ఫతలకతలో ఉంది.

కల్చిని మండలం

[మార్చు]

కల్చిని కమ్యూనిటీ మండలంలో 11 గ్రామపంచాయితీలు (జైగోయాన్-1, జైగోయాన్-2, డాల్షింగ్ పర, మాలంగి, సతలి, మెందబరి, లతబరి, చౌపర, కల్చిని, గరోపర, రాజభత్ఖవ.[3] ఈ మండలంలో 2 నగ్రప్రాంతాలు ( జైగోయాన్, ఉత్తర లతబరి) పట్టణాలు ఉన్నాయి.[4] జైగావ్, కాల్చిని పోలీస్ స్టేషన్‌లు ఈ బ్లాక్‌కు సేవలు అందిస్తున్నాయి .[5] ఈ మండలం ప్రధాన కేంద్రంగా హామిల్టంగంజ్.

కుమర్గ్రాం మండలం

[మార్చు]

కుమర్గ్రాం కమ్యూనిటీ డెవెలెప్మెంటు మండలంలో 11 గ్రామపంచాయితీలు ( చెంగమరి, ఖోయర్‌డంగ్, కొత్త కుమర్గ్రాం సన్ఖోస్, తుతురిఖండ, ఖమకియగురి -1, ఖొయర్దంగ-2, వల్క బరబిస -1, కామాఖ్యగురి-2, కుమర్గ్రాం, రైడక్, వల్క బరబిస-2 ) ఉన్నాయి.[3] ఈ మండలంలో ఒక పట్టణప్రాంతం ఉత్తర కామాఖ్యగురి ) ఉంది[4] ఈ బ్లాకులో కుమర్గ్రాం పోలీస్ స్టేషను సేవలు అందిస్తుంది.[5] ఈ మండలం కేంద్రంగా కుమర్గ్రాం ఉంది.

రైల్వే మార్గాలు

[మార్చు]

అలిపురుదుయర్ రైల్వే విభాగం కనీసం 710 కి.మీ పొడవు ఉంటుంది. ఎన్.ఇ.ఆర్ జోనులో ఇది అతిపెద్ద విభాగం ఇదే. జిల్లాలో 2 ప్రధాన రైల్వేస్టేషన్లు ఉంటాయి. అలిపురుదుయర్ జంక్షన్, కొత్త అలిపురుదుయర్. ఈ 2 స్టేషనులలో మల్టీఫంక్షనల్ కంప్లెక్స్‌లు ఉన్నాయి. జిల్లాలో ఇతర స్టేషన్లు కూడా ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం అలిపురుదుయర్ జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 5 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది.

  • కుమర్గ్రాం అసెంబ్లీ నియోజకవర్గం:-కుమర్గ్రాం బ్లాక్, అలిపురుదుయర్ -2 బ్లాకులోని లోని 7 గ్రామపంచాయితీలు ( భతిబరి, కోహినూర్, పరొకత, మహాకాల్గురి, షముకత, టర్తురి, తత్పరా) .
  • కల్చిని అసెంబ్లీ నియోజకవర్గం:- అలిపురుదుయర్ -2 లోని మఝెర్దబరి పంచాయితీ, కల్చిని బ్లాక్ ప్రాంతం, అలిపురుదుయర్ పురపాలకం, అలిపురుదుయర్ రైల్వేజంక్షన్, చపొరర్-1, చపొరర్-2 గ్రామపంచాయితీలు, తత్పరా-2.
  • అలిపురుదుయర్ పురపాలకం, అలిపురుదుయర్ రైల్వే జంక్షన్, చాపొరర్ పార్ -1, చాపొరర్ పార్ -2 గ్రామపంచాయితీలు,, అలిపురుదుయర్ బ్లాకు -2 లోని తత్పరా -2, అలిపురుదుయర్ బ్లాక్ -1 లోని 10 గ్రామపంచాయితీలు (బంచుకామరి, పరోర్పార్, షల్కుమార్-1, వివేకానందా-1, చకోవకేటి, పత్లఖవ, షల్కుమార్-2, వివేకానదా-2, మథురా, తప్సిఖత.
  • పత్లఖవ అసెంబ్లీ నియోజకవర్గం:- అలిపురుదుయర్ బ్లాక్- 1 లోని ఇతర గ్రామపంచాయితీ (పూర్బా కందల్బరి, ఫతల్కబ బ్లాక్.
  • మదరిహట్ అసెంబ్లీ నియోజకవర్గం:- మదరిహట్ బ్లాక్.

షెడ్యూల్డ్ జాతి , కులాల రిజర్వేషన్

[మార్చు]
  • షెడ్యూల్డ్ జాతి, కులాల రిజర్వేషన్:- కుమర్గ్రాం, కల్చిని, మదరిహట్ నియోజకవర్గాలు. ఫలకత నియోజకవర్గం.
  • అలిపురుదుయర్ పార్లమెంటు నియోజక వర్గం:- జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.[6]

మూలాలు

[మార్చు]
  1. http://timesofindia.indiatimes.com/city/kolkata/Alipurduar-a-new-district-on-June-25/articleshow/36916065.cms
  2. http://www.business-standard.com/article/news-ians/alipurduar-becomes-bengal-s-20th-district-114062500725_1.html
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-12-21.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Wise List of Statutory Towns( Municipal Corporation,Municipality,Notified Area and Cantonment Board) , Census Towns and Outgrowths, West Bengal, 2001". Census of India, Directorate of Census Operations, West Bengal. Retrieved 2008-12-21.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "List of Districts/C.D.Blocks/ Police Stations with Code No., Number of G.Ps and Number of Mouzas". Census of India, Directorate of Census Operations, West Bengal. Retrieved 2008-12-21.
  6. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. pp. 4–5, 23. Retrieved 2009-01-10.

వెలుపలి లింకులు

[మార్చు]