ఆర్య వైశ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు మాతృ భాషగా కలిగిన హిందూ వైశ్య కుల వర్గాలలో ఆర్య వైశ్యులు (ఆంగ్లం : Arya Vysyas) వీరు కర్ణాటక, తమిళనాడు లలో కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా వీరి వృత్తి వ్యాపార, వాణిజ్యాలు, వ్యవసాయం. వీరు ప్రధానంగా శాకాహారులు. సాంప్రదాయిక ఆర్యవైశ్యులు వాసవి పురాణంలో చెప్పబడిన కర్మలను ఆచరిస్తారు. వీరి కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి.

మూలాలు[మార్చు]

తెలుగు నాట వైశ్యులు చారిత్రకముగా పూర్వ మధ్య యుగము, మధ్యయుగము వరకు జైనులు. గోమాత మతానుయాయులు కావున వీరికి గోమతి అను పేరు వచ్చింది. వీరి వలె ఉత్తర భారతమందు జైనులు వాణిజ్య వృత్తిలో ప్రముఖులు. మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ (1905) వారు తమ పేరును గోమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు.[1]

ఆర్యవైశ్యులకు నగరేశ్వరుడు (శివ) ఇలవేల్పు. వింధ్యవాసిని నగరేశ్వరునిదేవి లేదా కన్యక ఆఋయవైశ్య కులజులకు ఆరాధ్య దేవత.కాని కొన్ని ఆర్యవైశ్యులు ఇచ్చిన శాసనములలో మైలావరదేవర ప్రసక్తి కనబడుచున్నది. గుంటూరుజిల్లా ఎనమదల గ్రామమందు శ్రీరామస్వామి దేవరగల శిలాశాసనమునందు, గుంటూరు పట్టణమునందు అగస్త్యేశ్వరాలయమునందు (క్రీ.శ.1310), నర్సరావుపేట తాలూకా, కొండవీడు గ్రామమునందు ఒక మసీదు మూడవ స్తంభమునందు, నాల్గవ స్తంభము మీదను వేర్వేరుగా చెక్కబడిన శాసనమునందు మైలావరదేవర స్వామి గురుంచి ఆర్యవైశ్యులు ప్రస్తావించారు.ఈదాతలు పెనుగొండ వాస్తవ్యులు. శ్రీ.జి.ఆర్.వర్మ (తాడేపల్లిగూడేం) గారు మైలావరదేవ అను గ్రంథమునందు ఈ మైలావరదేవర పుట్టుపూర్వోత్తరుములు, యేయే రూపమున యేయే స్థలములందు అర్చనలందుకొనెనొ, ఈ దేవునకు ఖండఖండాతరములలో గల వివిధ సారూప్యదేవతల ప్రశంస, అర్చనావిధానము ప్రస్తావించారు.మైలావరదేవుని ప్రస్తావన కాకతీయుల పాలనా కాలమునందు ఎక్కువ ప్రచారములోనికి వచ్చినట్లు తెలియుచున్నది. వల్లభామాత్యుడు క్రీడాభిరామము లో ఈ మైలావరదేవుని వర్ణించాడు.

ఆర్యవైశ్యు కుటుంబినుల కిష్టదైవమైన కన్యక అగ్ని ప్రవేశకాలమున విష్ణువర్ధనుడు యకృత్యమును గర్హించి, కోమటుల విశుద్ధవర్తన నీతినియమములకు సమ్మొహితులై తమ ప్రభుని కొలువు విరమించి వైశ్యుల పక్షము చేరి, పోరాడిన విష్ణువర్దనుని వీరభటులను మైలారులను, వీరముష్టులను ఇప్పటికినీ వైశ్యులు గౌరవించి, పూజించుట కనవచ్చును.

గోత్రాలు[మార్చు]

ఆర్య వైశ్యులలో మొత్తం 102 గోత్రములకు చెందిన వారు ఉన్నారు. వాసవి మాత బలిదాన సమయంలో ఆత్మార్పణం చేసుకున్న 102 దంపతుల గోత్రీకులే వీరు. ప్రతి గోత్రము నకు ఒక గోత్ర ఋషి మూల పురుషుడు. ఆ గోత్ర ఋషి పేరుతొనే గోత్ర నామాలు ఏర్పడ్డాయి.

వారిలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు[మార్చు]

కొంజేటి రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి దృశ్య చిత్రం

ఆర్య వైశ్య నిత్యాన్న సత్రాలు[మార్చు]

 1. బ్రహ్మంగారి మఠం - ఆర్యవైశ్య అన్న సత్రం, మైదుకూరు రోడ్డు, పోలేరమ్మ గుడి దగ్గర.
 2. శ్రీశైలం: అఖిల భారత శ్రీశైలక్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్నపూర్ణ సత్రం
 3. శ్రీశైలం: వాసవి సత్రం - 518101
 4. పుట్టపర్తి : వాసవి నివాసం - 616134
 5. తిరుమల : వాసవి భవన్ - 517504
 6. తిరుపతి - వాసవి నిలయం.
 7. మంత్రాలయం : ఆర్యవైశ్య, పటేల్ రోడ్, రాయచూర్ - 584101
 8. మహానంది : వాసవి కన్యకా పరమేశ్వంరి సత్రం
 9. విజయవాడ : శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ.
 10. అన్నవరం: ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం - 533406
 11. వేములవాడ : ఎస్.ఆర్.ఆర్.కె. ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం - 505302
 12. అహోబిలం : ఆర్యవైశ్య వాసవి అన్న సత్ర సంఘం - 518545
 13. యాదగిరి గుట్ట : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం.
 14. భద్రాచలం : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ట్రస్ట్, మార్కెట్ రోడ్.
 15. బాసర: ఆర్య ఇందూర్ ఆర్యవైశ్య జ్ఞాన సరస్వతి ఛారిటబుల్ ట్రస్ట్
 16. మధోల్ : ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం.
 17. షోలంగిరి : అఖిల భారత ఘటికాచల క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం
 18. ధర్మపురి: : శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్ర శ్రీ ధర్మపురి ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం
 19. ఆత్థూర్, సేలం జిల్లా, తమిళనాడు : శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, బజార్ రోడ్ - 636 1

మూలాలు[మార్చు]

 1. ' Castes and Tribes of Southern India', Vol 3 K, 1909-Courtsey Muthunarayan. Trichy

బయటి లింకులు[మార్చు]