కిరామున్ కాతిబీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కిరామన్ కాతిబీన్ (అరబ్బీ: كراماً كاتبين), లేదా "గౌరవ గ్రంధస్తులు", వీరు ఇస్లామీయ ధార్మికగ్రంధాలప్రకారం ఇద్దరు దేవదూతలు. వీరి పని మానవుల మంచి చెడులను గ్రంథస్థం చేస్తూవుంటారు. వీరు ప్రతి మానవుని "కుడి , ఎడమ భుజాల" పై కూర్చొనివుంటారు (అనగా వీరు మనిషిని ఎల్లప్పుడూ గమనిస్తూనేవుంటారు). కిరామన్ కుడిభుజంపైననూ, కాతిబీన్ ఎడమభుజంవైపునూ కూర్చొనివుంటారు. మానవుని కార్యముల ప్రకారం బేరీజువేసి వారు దేనికి (స్వర్గం లేక నరకం) అర్హులో రికార్డు చేస్తుంటారు. మానవులు చేసే కర్మానుసారం అవి దేనివైపు బరువుతూగుతాయో బేరీజువేసి స్వర్గం లేక నరకం యొక్క అర్హుడు అని వ్రాస్తారు. వీరి వ్రాత తీర్పుదినాన తీర్పు ఇవ్వడానికి అనువుగావుంటుంది. ప్రతి నమాజ్ ఆఖరులో సున్నీ ముస్లింలు వీరికి (కిరామున్ కాతిబీన్ లకు) సలాము చేయునట్లు భావిస్తారు.[1]

వీరికి భుజ దూతలు అనికూడా అంటారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]