కొడికున్నిల్ సురేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడికున్నిల్ సురేష్ లో‍క్‍సభ సభ్యుడు
కొడికున్నిల్ సురేష్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
31 మే 2009 (2009-05-31)
ముందు సీఎస్ సుజాత
నియోజకవర్గం మావేలికర
పదవీ కాలం
1999 – 2004
ముందు చెంగర సురేంద్రన్
తరువాత చెంగర సురేంద్రన్
నియోజకవర్గం అదూర్
పదవీ కాలం
1989 – 1998
ముందు కె.కె. కుంహంబు
తరువాత చెంగర సురేంద్రన్
నియోజకవర్గం అదూర్

కేంద్ర రాష్ట్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు హరీష్ రావత్
తరువాత విష్ణుదేవ్ సాయ్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1962-06-04) 1962 జూన్ 4 (వయసు 62)
కోడికున్నిల్,[1] తిరువనంతపురం జిల్లా, కేరళ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కుంజన్, థంకమ్మ
సంతానం 2
పూర్వ విద్యార్థి

కొడికున్నిల్ సురేష్ (జననం 4 జూన్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికై,[2] 2024 జూన్ 26న జరిగే లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు.[3][4]

ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కొడికున్నిల్ సురేష్ 1962 జూన్ 4న తిరువనంతపురం జిల్లాలోని కోడికునుమ్‌లో కుంజన్, థంకమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కళాశాల నుండి ప్రీ-డిగ్రీని పూర్తి చేసి తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కొడికున్నిల్ సురేష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తన 27 ఏళ్ల వయసులో 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అదూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1991, 1996, 1999లో అదూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నకై, 1998, 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా పని చేశాడు.

కొడికున్నిల్ సురేష్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మావేలికర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు.

ఇతర పదవులు

[మార్చు]

కొడికున్నిల్ సురేష్ 1983 నుండి 1997 వరకు కేరళ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, 1987 నుండి 1990 వరకు కేరళ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ తరువాత అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, కొల్లం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పని చేసి 19 సెప్టెంబర్ 2018న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు.

వివాదాలు

[మార్చు]

ఆయన 2009 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం తన కుల ధృవీకరణ పత్రం నకిలీదని, ఆయన క్రైస్తవుడని ఆరోపించడంపై కేరళ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును ఆ తర్వాత 2011 మే 12న హైకోర్టు తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (28 October 2012). "Ancestral village celebrates Kodikunnil Suresh's appointment" (in ఇంగ్లీష్). Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.
  2. Eenadu (25 June 2024). "ఎనిమిదోసారి.. లోక్‌సభలో 'సీనియర్‌ మోస్ట్‌' ఎంపీలు". Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.
  3. Andhrajyothy (25 June 2024). "దేశ చరిత్రలో తొలిసారి.. లోక్‌సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ". Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.
  4. The Hindu (25 June 2024). "Lok Sabha Speaker election: Kodikunnil Suresh of Congress files nomination as INDIA bloc candidate" (in Indian English). Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.
  5. "Apex court upholds Kodikunnil Suresh's election". The Hindu. 13 May 2011. Archived from the original on 19 May 2011. Retrieved 28 October 2012.
  6. "Kodikunnil Suresh @ J.Monian vs N.S.Saji Kumar". Supreme Court Records. Indian Kanoon. Retrieved 28 October 2012.