Jump to content

గుంటూరు నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
(గుంటూరు నగర పాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు నగర పాలక సంస్థ
నగర పాలక సంస్థ భవనం, గుంటూరు
సంకేతాక్షరంGMC
ఆశయంకృషితో నాస్తి దుర్భిక్షం
స్థాపన1866
1994 (సంస్థ నవీకరణ)
రకంప్రభుత్వేతర సంస్థ
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన సంస్థ
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
గుంటూరు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
మున్సిపల్ కమిషనర్ఎస్.నాగలక్ష్మి
ప్రధానభాగంకమిటీ
జాలగూడుhttp://www.gunturcorporation.org/

గుంటూరు నగర పాలక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని ఒక పురాతన పురపాలక సంస్థ.[1]

చరిత్ర

[మార్చు]

ఈ సంస్థ, 1866 లో గుంటూరు పురపాలక సంస్థగా ఏర్పడింది, 1881 లో మొదటి ఎన్నికలు జరిగాయి. 1891 లో రెండో గ్రేడ్, 1971 లో మొదటి గ్రేడ్, 1952 లో ప్రత్యేక గ్రేడ్, 1960 లో ఎంపిక గ్రేడ్ గా ఎర్పడింది. 1994 లో గుంటూరు నగర పాలక సంస్థగా ఏర్పడింది.[2][3]

పరిపాలన

[మార్చు]

2012 లో, గుంటూరు పది పరిసర గ్రామాలను నగరంలో విలీనం చేశారు.[4][5] కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాంతం 168.41 కి.మీ2 (65.02 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 52 వార్డులు కలిగిఉంది.[6] ఎస్.నాగలక్ష్మి ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గా ఉంది.[7]

పౌరసేవలు

[మార్చు]

పౌర సేవల్లో ప్రధానమైనవి, రోడ్లు, బస్సు షెల్టర్లు, కాలిబాటలు, పబ్లిక్ గార్డెన్స్ మొదలైనవి కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు.[8]

ప్రాజెక్టులు

[మార్చు]

ఒక 15 మెగావాట్ల వ్యర్ధాల నుండి విద్యుత్ ఉత్పత్తి చెసే ప్లాంట్ ను జెఐటియఫ్ లిమిటెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకారంతో ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు, గుంటూరు జిల్లా నుండి ఏడు ఇతర పురపాలక సంఘాలతో పాటు దీనిలో భాగస్వామ్యులు.[9]

పురస్కారాలు, విజయాలు

[మార్చు]

నేషనల్ అర్బన్ పారిశుద్ధ్య విధానం (2009 –10) ప్రకారం, నగరనికి మొత్తం 39.363 పాయింట్లతో 42వ స్థానం ఇచ్చారు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Guntur Municipal Corporation". Official website of Guntur district. Retrieved 29 March 2016.
  2. "Guntur Corporation's Timeline". B. C. Retrieved 29 March 2016.
  3. "Guntur Municipal Corporation". Official website of Guntur Municipal Corporation. gunturcorporation. Retrieved 29 March 2016.
  4. "Expansion of corporation" (PDF). gunturcorporation. Retrieved 26 June 2014.
  5. "City Profile" (PDF). Guntur Corporation. Retrieved 22 June 2015.
  6. "The Case of Guntur, India" (PDF). DReAMS - Development of Resources and Access to Municipal Services. p. 1. Retrieved 18 February 2016.
  7. "Present & Ex-Commissioners". Guntur Corporation. Retrieved 13 February 2016.
  8. "Guntur civic body plans to beautify roads". Guntur. 6 February 2016. Retrieved 18 February 2016.
  9. "Waste-to-energy plant to be set up in Guntur". The Hindu. 7 February 2016. Retrieved 18 February 2016.
  10. "Rank of Cities on Sanitation 2009–2010: National Urban Sanitation Policy" (PDF). Press Information Bureau. National Informatics Centre. Retrieved 13 August 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]