గూగుల్
రకం | అనుబంధ సంస్థ (పరిమిత బాధ్యతలుగల కంపెనీ) |
---|---|
పరిశ్రమ |
|
స్థాపన | సెప్టెంబరు 4, 1998[a] మెన్లో పార్క్, కాలిఫోర్నియా, యుఎస్ |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | మౌంటేన్ వ్యూ, కాలిఫోర్నియా , యుఎస్ |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తంగా |
కీలక వ్యక్తులు |
|
ఉద్యోగుల సంఖ్య | 1,82,502 (2023) |
మాతృ సంస్థ | ఆల్ఫాబెట్ ఇంక్. |
వెబ్‌సైట్ | about |
Footnotes / references [5][6][7][8] |
గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[9][10][11]
1998 సెప్టెంబరు 4న లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థులుగా ఉన్నప్పుడు గూగుల్ని స్థాపించారు. వీరు ఇద్దరూ కలిసి బహిరంగంగా నమోదయిన గూగుల్ వాటాలలో 14 శాతాన్ని కలిగి ఉన్నారు. సూపర్-ఓటింగ్ వాటాల ద్వారా 56% పెట్టుబడిదారుల ఓటింగ్ శక్తిని నియంత్రిస్తారు. కంపెనీ 2004 లో IPO ద్వారా బహిరంగ సంస్థ అయ్యింది. 2015లో, ఆల్ఫాబెట్ ఇంక్కు పూర్తి యాజమాన్యంగల అనుబంధ సంస్థగా గూగుల్ పునర్వ్యవస్థీకరించబడింది. ఆల్ఫాబెట్ సీఈఓ అయిన లారీ పేజ్ స్థానంలో సుందర్ పిచై 2015 అక్టోబరు 24న గూగుల్ కు సీఈఓగా నియమితులయ్యారు. 2019 డిసెంబరు 3 నుంచి సుందర్ పిచై ఆల్ఫాబెట్ కు కూడా సీఈఓ అయ్యారు.[12]
2021లో ప్రధానంగా గూగుల్ ఉద్యోగులతో కూడిన, ఆల్ఫాబెట్ వర్కర్ల యూనియన్ స్థాపించబడింది.[13]
విలీనం తర్వాత నుండి గూగుల్ కేంద్ర శోధన యంత్రానికి (గూగుల్ శోధన) మించిన ఉత్పత్తులు, సముపార్జనలు, భాగస్వామ్యాలతో కంపెనీ వేగంగా విస్తరించింది. గూగుల్ పని, ఉత్పాదకతకు (గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు, గూగుల్ స్లయిడ్లు), ఇమెయిల్లకు (జీమెయిల్), షెడ్యూలింగ్, సమయ నిర్వహణకు (గూగుల్ క్యాలెండర్ ), క్లౌడ్ నిల్వలకు (గూగుల్ డ్రైవ్), తక్షణ సందేశం, వీడియో చాట్ కు ( గూగుల్ డ్యుయో, గూగుల్ చాట్,, గూగుల్ మీట్), భాష అనువాదానికి (గూగుల్ అనువాదం), మ్యాపింగ్, నావిగేషన్ కు (గూగుల్ మ్యాప్స్, వేజ్, గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ), పోడ్కాస్ట్లను పంచుకోడానికి (గూగుల్ పాడ్‌కాస్ట్‌లు), వీడియోలు పంచుకోడానికి (యూట్యూబ్), బ్లాగ్ ప్రచురణకు (బ్లాగర్), నోట్స్ రాసుకోడానికి (గూగుల్ కీప్, జాంబోర్డ్), చిత్రాలు ఏర్పరుచుకోడానికి, ఎడిట్ చేయడానికి (గూగుల్ ఫోటోలు) అవసరమైన సేవలను అందిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, క్రోమ్ ఓఎస్ (ఇది ఉచిత, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమైన క్రోమియం ఓఎస్ ఆధారితమైన తేలికైన ఆపరేటింగ్ సిస్టమ్), గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ల అభివృద్ధికి ఈ కంపెనీ నాయకత్వం వహిస్తుంది. అలాగే గూగుల్ హార్డ్‌వేర్‌లోకి కూడా ప్రవేశించింది; 2010 నుండి 2015 వరకు, గూగుల్ నెక్సస్ పరికరాల ఉత్పత్తుకై ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులతో భాగస్వామ్యమైంది, 2016 లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్, గూగుల్ వైఫై మెష్ వైర్‌లెస్ రౌటర్‌తో సహా పలు హార్డ్‌వేర్ ఉత్పత్తులను విడుదల చేసింది. అలాగే అంతర్జాల క్యారియర్‌గా అవతరించడానికి ప్రయోగాలు (గూగుల్ ఫైబర్, గూగుల్ ఫై) చేసింది.
Google.com (గూగుల్.కామ్) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించబడే వెబ్‌సైట్. యూట్యుబ్, బ్లాగర్‌తో పాటు గూగుల్ వారివే అనేక ఇతర వెబ్‌సైట్లు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ల జాబితాలో ఉన్నాయి.[14] అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో గూగుల్ ను ఫోర్బ్స్ రెండో స్థానంలో[15], ఇంటర్‌బ్రాండ్ నాల్గవ స్థానంలో నిలిపాయి.[16] గోప్యతా ఆందోళనలు, పన్ను ఎగవేత, సెన్సార్‌షిప్, శోధన తటస్థత, అవిశ్వాసం, గుత్తాధిపత్య దుర్వినియోగం వంటి విషయాలపై గూగుల్ ప్రముఖంగా విమర్శలను ఎదురుకుంది.
చరిత్ర
[మార్చు]తొలినాళ్ళు
[మార్చు]గూగుల్ 1996 జనవరిలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డి విద్యార్థులుగా ఉన్నపప్పుడు వారి పరిశోధన ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది.[17][18][19] ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో అనధికారిక "మూడవ వ్యవస్థాపకుడి"గా స్కాట్ హసన్ అనే ప్రధాన ప్రోగ్రామర్ ఉండేవాడు. అసలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం అతను చాలా కోడ్‌లను వ్రాసాడు, అయితే గూగుల్ అధికారికంగా కంపెనీగా స్థాపించబడకముందే నిష్క్రమించాడు;[20][21] హసన్ రోబోటిక్స్‌లో వృత్తిని చేసుకొని 2006లో విల్లో గ్యారేజ్ అనే సంస్థను స్థాపించాడు.[22][23]
గూగుల్ అనే పదం గూగోల్ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.
"www.google.com"
డొమైన్ పేరు 1997 సెప్టెంబరు 15న నమోదు చేయబడింది,[24] కంపెనీ 1998 సెప్టెంబరు 4న స్థాపించబడింది. ఇది కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోన సుసాన్ వోజ్‌కికి [19] గ్యారేజ్లో నుంచి నడిచింది. స్టాన్‌ఫోర్డ్‌లో తోటి పీ.హెచ్.డి విద్యార్థి క్రెయిగ్ సిల్వర్‌స్టెయిన్ గూగుల్ మొదటి ఉద్యోగి.[25][26][27]
ప్రాధమిక ప్రజా సమర్పణ
[మార్చు]2004 ఆగస్టు 19న, గూగుల్ ప్రాధమిక ప్రజా సమర్పణ (IPO) ద్వారా బహిరంగ సంస్థగా మారింది. ఆ సమయంలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ ష్మిత్లు 2024 వరకు 20 సంవత్సరాల పాటు గూగుల్లో కలిసి పనిచేయడానికి అంగీకరించారు.[28] ఒక్కో షేరుకు $85 ధరతో కంపెనీ 19,605,052 షేర్లను ఆఫర్ చేసింది.[29][30] మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూయిస్ నిర్మించిన ఒక వ్యవస్థను ఉపయోగించి షేర్లు అంతర్జాల వేలం విధానంలో విక్రయించబడ్డాయి.[31][32] $ 167 కోట్ల అమ్మకం గూగుల్ కి $ 2,300 కోట్లకు పైగా మార్కెట్ మూలధన్నాన్ని అందించింది.[33]
2012 మేలో, గూగుల మోటరోలా మొబిలిటీని $1,250 కోట్లకు కొనుగోలు చేసింది, ఇప్పటి వరకు ఇది దాని అతిపెద్ద కొనుగోలు.[34][35][36] గూగుల్ ఈ అడుగు వేయడానికి చాల కారణాలున్నాయి: మొబైల్ ఫోన్‌లు, వైర్‌లెస్ సాంకేతికతపై మోటరోలా యొక్క గణనీయమైన పేటెంట్ పోర్ట్‌ఫోలియోను చేజిక్కించికోవడం,[37] ప్రధానంగా యాపిల్, మైక్రోసాఫ్ట్,[38], ఇతర కంపెనీలతో కొనసాగుతున్న పేటెంట్ వివాదాలలో తమని రక్షించడం, ఆండ్రాయిడ్ ఉచిత అందుబాటుని కొనసాగించడం ఈ కారణాలలో కొన్ని.[39]
2012 నుండి
[మార్చు]2013 జూన్లో, గూగుల్ వేజ్ను $96 కోట్ల డీల్‌తో కొనుగోలు చేసింది.[41]
2014, జనవరి 26 న, లండన్కు చెందిన ప్రైవేట్ కృత్రిమ మేధస్సు సంస్థ డీప్‌మైండ్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు గూగుల్ ప్రకటించింది.[42] కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సమాజంలో గూగుల్ ఇటీవలి వృద్ధికి డీప్‌మైండ్ కొనుగోలు సహాయం చేస్తుంది.[43]
ఇంటర్‌బ్రాండ్ వారి వార్షిక బెస్ట్ గ్లోబల్ బ్రాండ్‌ల నివేదిక ప్రకారం, గూగుల్[44] 2014,[45] 2015,[46] 2016లో $13,300 కోట్ల విలువతో ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా (ఆపిల్ ఇంక్. తర్వాత ) నిలిచింది.[47]
2015 ఆగస్టు 10న, గూగుల్ తన వివిధ ఆసక్తులను ఆల్ఫాబెట్ ఇంక్ పేరుతో సమ్మేళనంగా పునర్వ్యవస్థీకరించే ప్రణాళికలను ప్రకటించింది. గూగుల్ ఆల్ఫాబెట్ యొక్క అతిపెద్ద అనుబంధ సంస్థగా, ఆల్ఫాబెట్ యొక్క ఇంటర్నెట్ ప్రయోజనాలకు గొడుగు కంపెనీగా మారింది. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత, లారీ పేజ్ను రిప్లేస్ చేస్తూ సుందర్ పిచై గూగుల్ సీఈఓ అయ్యాడు, లారీ పేజ్ ఆల్ఫాబెట్ సీఈఓ అయ్యాడు.[48][49][50]
2019 మార్చి 19 న, స్టేడియా అనే క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించి, వీడియో గేమ్ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.[51]
2021 ఏప్రిల్లో, ది వాల్ స్ట్రీట్ జర్నల్ గూగుల్ 'ప్రాజెక్ట్ బెర్నాంకే' అనే పేరుతో సంవత్సరాల తరబడి అమలు చేసిన కార్యక్రమాన్ని నివేదించింది, ఇది ప్రకటన సేవల పోటీలో ప్రయోజనాన్ని పొందడానికి గత ప్రకటనల బిడ్‌ల నుండి సమాచారాన్ని ఉపయోగించే ప్రాజెక్ట్. డిసెంబరులో గూగుల్‌పై పది యుఎస్ రాష్ట్రాలు దాఖలు చేసిన యాంటీట్రస్ట్ దావాకు సంబంధించిన పత్రాలలో ఇది వెల్లడైంది.[52]
ఉత్పత్తులు, సేవలు
[మార్చు]శోధన యంత్రం (సెర్చ్ ఇంజన్)
[మార్చు]వినియోగదారులు కీలక పదాలు, ఆపరేటర్లు ఉపయోగించి కోరుకున్న సమాచారాన్ని వెతకడం కుదిరేలా గూగుల్ కోట్ల వెబ్ పేజీలకు సూచికలను కేటాయిస్తుంది.[53] 2017 మేలో గూగుల్ శోధనలో కొత్త "వ్యక్తిగత" ట్యాబ్‌ను ప్రారంభించింది, జీమెయిల్లో ఇమెయిళ్ళు, గూగుల్ ఫోటోస్లో ఫోటోలతో సహా వినియోగదారులు తమ గూగుల్ ఖాతా యొక్క వివిధ సేవలలోని వ్యక్తిగత విషయాలను వెతకడానికి వీలు కల్పిస్తుంది.[54][55]
2002లో గూగుల్ వార్తల సేవను ప్రారంభించింది, ఇది వివిధ వెబ్‌సైట్‌ల నుండి వార్తా కథనాలను సంగ్రహించే స్వయంచాలక సేవ.[56] తన డేటాబేస్‌లోని పుస్తకాలలో పాఠాన్ని శోధించే, పరిమితమైన వీక్షణ అందించే, అనుమతి ఉంటే పూర్తి పుస్తకాన్ని చూపే గూగుల్ బుక్స్ను కూడా హోస్ట్ చేస్తుంది.[57]
ప్రకటనలు
[మార్చు]గూగుల్ యొక్క ఆదాయం చాలా వరకు ప్రకటనల నుండి ఉత్పత్తి అవుతుంది. ఇందులోకి యాప్‌ల విక్రయాలు, యాప్‌లో చేసిన కొనుగోళ్లు, గూగుల్, యూట్యూబ్లలో డిజిటల్ కంటెంట్ ఉత్పత్తులు, గూగుల్ క్లౌడ్ ఆఫర్ల కోసం స్వీకరించిన రుసుములతో సహా ఆండ్రాయిడ్ లైసెన్సింగ్ సేవా రుసుములు వస్తాయి. 2017లో, ఈ లాభంలో నలభై ఆరు శాతం అంటే $10,965 కోట్లు క్లిక్‌ల (క్లిక్కుకు ఇంత ధర) నుండి వచ్చింది. .
శోధన అభ్యర్థనలను అర్థం చేసుకోవడం కోసం దాని స్వంత అల్గారిథాలతో పాటు, శోధన సందర్భానికి, వినియోగదారు చరిత్ర,ఆసక్తికి తగినట్టుగా లక్ష్య ప్రకటనలను రూపొందించడానికి, డబుల్ క్లిక్ యొక్క సాంకేతికతను ఉపయోగిస్తుంది.[58][59]
గూగుల్ ఎనలిటిక్స్ వెబ్‌సైట్ ద్వారా యజమానులు తమ వెబ్‌సైట్‌ను వ్యక్తులు ఎక్కడ, ఎలా ఉపయోగిస్తున్నారో ట్రాక్ చేయడానికి కుదురుతుంది, ఉదాహరణకు పేజీలోని అన్ని లింకకుల మీద క్లిక్ రేట్లను పరిశీలించడం ద్వారా ఎంతమంది నొక్కారో తెలుస్తుంది.[60] గూగుల్ ప్రకటనలను థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లలో కూడా ఉంచవచ్చు.
వినియోగదారుల సేవలు
[మార్చు]వెబ్ ఆధారిత సేవలు
[మార్చు]గూగుల్ పని, ఉత్పాదకతకు (గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు, గూగుల్ స్లయిడ్లు), ఇమెయిల్లకు (జీమెయిల్), షెడ్యూలింగ్, సమయ నిర్వహణకు (గూగుల్ క్యాలెండర్), క్లౌడ్ నిల్వలకు ( గూగుల్ డ్రైవ్ ), తక్షణ సందేశం, వీడియో చాట్ కు ( గూగుల్ డ్యుయో, గూగుల్ చాట్,, గూగుల్ మీట్), భాష అనువాదానికి (గూగుల్ అనువాదం ), మ్యాపింగ్, నావిగేషన్ కు (గూగుల్ మ్యాప్స్, వేజ్, గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ), పోడ్కాస్ట్లను పంచుకోడానికి (గూగుల్ పాడ్‌కాస్ట్), వీడియోలు పంచుకోడానికి (యూట్యూబ్), బ్లాగ్ ప్రచురణకు (బ్లాగర్), నోట్స్ రాసుకోడానికి (గూగుల్ కీప్, జాంబోర్డ్), చిత్రాలు ఏర్పరుచుకోడానికి, ఎడిట్ చేయడానికి (గూగుల్ ఫోటోలు) అవసరమైన సేవలను అందిస్తుంది. 2019 మార్చిలో, గూగుల్ స్టేడియా పేరుతో క్లౌడ్ గేమింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.[51] ఉద్యోగాలు వెతకడానికి 2017కి ముందు నుండి కూడా ఒక సేవ అందుబాటులో ఉంది,[61][62][63] అయితే ఉద్యోగాలకు గూగుల్ అనేది నోటీస్ బోర్డులు, కెరియర్ సైట్‌ల నుండి జాబితాలను సమగ్రపరిచే మెరుగైన శోధన ఫీచర్.[64][65]
సాఫ్ట్‌వేర్
[మార్చు]గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్,[66] అలాగే దాని స్మార్ట్ వాచ్,[67] టెలివిజన్,[68] కార్,[69], ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)-ఎనేబుల్డ్ స్మార్ట్ పరికరాలను అభివృద్ధి చేస్తుంది.[70] ఇది గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ ను,[71] క్రోమ్ ఆధారంగా పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ క్రోమ్ ఓఎస్ ను కూడా అభివృద్ధి చేస్తుంది.[72]
హార్డ్వేర్
[మార్చు]2010 జనవరిలో, గూగుల్ నెక్సస్ వన్‌ని విడుదల చేసింది, ఇది తమ స్వంత బ్రాండ్‌లో మొదటి ఆండ్రాయిడ్ ఫోన్.[73] 2016లో నిలిపివేసే వరకు "నెక్సస్ " బ్రాండింగ్ [74] క్రింద అనేక ఫోన్లను, టాబ్లెట్‌లను విడుదలచేసింది, ఆ తర్వాత దాని స్థానంలో పిక్సెల్ అనే కొత్త బ్రాండ్‌ను రూపొందించింది.[75] 2011లో, క్రోంబుక్ ని తీసుకొచ్చింది, ఇది క్రోం ఓఎస్ తో నడుస్తుంది.[76]
2013 జూలైలో, గూగుల్ క్రొమ్‌కాస్ట్ డాంగిల్‌ను పరిచయం చేసింది, ఇది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి టీవీలకు కంటెంట్‌ను ప్రసారం చేయడాన్ని అనుమతిస్తుంది.[77][78] 2014 జూన్లో, గూగుల్ కార్డ్‌బోర్డ్‌ని ప్రకటించింది, ఇది సాధారణ కార్డ్‌బోర్డ్ వీక్షణ పరికరం, ఇది వినియోగదారు వారి స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ముందు కంపార్ట్‌మెంట్‌లో ఉంచి వర్చువల్ రియాలిటీ (VR) మీడియాను వీక్షించడానికి ఉపయోగపడుతుంది.[79][80]
సంస్థలకు
[మార్చు]గూగుల్ వర్క్ స్పేస్ (గతంలో 2020 అక్టోబరు వరకు జీ-సూట్ [81]) అనేది సంస్థలు, వ్యాపారాలు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, డాక్స్, షీట్స్, స్లైడ్స్ వంటి గూగుల్ సేవల సమాహారాన్ని, అదనపు పరిపాలనా ముట్లతో, పొందడానికి నెలవారీ సభ్యత్వ ఎంపిక. ఇందులో 24/7 మద్దతు, ప్రత్యేక డొమైన్ పేర్లు కూడా లభిస్తాయి.[82]
2012, సెప్టెంబరు 24న,[83] గూగుల ఫర్ ఆట్రప్రెన్యూర్స్ అనే లాభాపేక్షలేని వ్యాపార ఇంక్యుబేటర్ ను గూగుల్ ప్రారంభించింది, ఇందులో స్టార్టప్‌లకు "క్యాంపస్" అని పిలువబడే పని స్థలాలను అందిస్తుంది.[84] ప్రస్తుతం, ఏడు క్యాంపస్ స్థానాలు ఉన్నాయి: బెర్లిన్, లండన్, మాడ్రిడ్, సియోల్, సావో పాలో, టెల్ అవీవ్, వార్సా .
అంతర్జాల సేవలు
[మార్చు]2010 ఫిబ్రవరిలో, కొన్ని అమెరికన్ నగరాల్లో 50,000 నుండి 5,00,000 మంది వినియోగదారులకు (అల్ట్రా-హై-స్పీడ్) అతి వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే ప్రయోగాత్మక ప్రణాళికలతో గూగుల్ ఫైబర్ ప్రాజెక్ట్‌ను గూగుల్ ప్రకటించింది.[85][86] ఆల్ఫాబెట్ ఇంక్. దాని మాతృ సంస్థ అయ్యేలా జరిగిన కార్పొరేట్ పునర్నిర్మాణాన్ని అనుసరించి, Google Fiber ఆల్ఫాబెట్ యాక్సెస్ విభాగానికి తరలించబడింది.[87][88]
కార్పొరేట్ వ్యవహారాలు
[మార్చు]గూగుల్ ప్రారంభ ప్రజా మనర్పణ (ఐపిఓ, IPO) 2004 ఆగస్టు 19న జరిగింది. ఐపిఓ లో, కంపెనీ ఒక్కో షేరుకు $ 85 ధరతో 19,605,052 షేర్లను అందించింది.[29][30] ఈ $ 167 కోట్ల అమ్మకం గూగుల్ కి $ 2,300 కోట్లకు పై మార్కెట్ మూలధనాన్ని సమకూర్చింది.[33] ఆన్‌లైన్ ప్రకటనల మార్కెట్లో బలమైన అమ్మకాలు, ఆదాయాల కారణంగా ఐపిఓ తర్వాత 2007 అక్టోబరు 31 న స్టాక్ మంచి ప్రదర్శన కనబర్చింది, మొదటిసారిగా $ 350 ధరను చేరుకుంది.[89][90]
2013 మూడవ త్రైమాసికానికి, 2013 అక్టోబరు మధ్యలో విడుదలైన నివేదన ప్రకారం, గూగుల్ యొక్క ఏకీకృత ఆదాయం 1,489 కోట్ల డాలర్లు, ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం పెరుగుదల.[91] ఈ మొత్తంలో $ 1,080 కోట్ల డాలర్లను గూగుల్ యొక్క అంతర్జాల వ్యాపారం ఉత్పత్తి చేసింది, వారి ప్రకటనలపై వినియోగదారుల క్లిక్ల సంఖ్య పెరుగుదలతో ఇది సాధ్యమైంది.[92] 2014 జనవరి నాటికి, గూగుల్ యొక్క మార్కెట్ మూలధనం $39,700 కోట్లకు పెరిగింది.[93]
పన్ను ఎగవేత వ్యూహాలు
[మార్చు]గూగుల్ వివిధ పన్ను ఎగవేత వ్యూహాలను ఉపయోగిస్తుంది. అతిపెద్ద సమాచార సాంకేతిక (ఐటి) కంపెనీల జాబితాలో ఉండి, దాని ఆదాయాల మూలం ఉన్న దేశాలకు ఇది అతి తక్కువ పన్నులను చెల్లిస్తుంది. 2007, 2010 మధ్య యూఎస్ యేతర లాభాలను ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఆ తరువాత బెర్ముడాకు తరలిస్తూ 310 కోట్ల డాలర్ల పన్నును ఆదా చేసింది. ఇటువంటి పద్ధతులు దాని యూఎస్ యేతర పన్ను రేటును 2.3 శాతానికి తగ్గిస్తాయి, అయితే సాధారణంగా కార్పొరేట్ పన్ను రేటు, ఉదాహరణకు, యూకెలో 28 శాతం.[94]
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ మాట్ బ్రిటిన్ యూకె హౌస్ ఆఫ్ కామన్స్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి, వాళ్ల యూకె సేల్స్ టీం ఎటువంటి అమ్మకాలు చేయనందువల్ల యూకెకి అమ్మకపు పన్ను బాకీలేదని సాక్ష్యమిచ్చాడు.[95] 2016 జనవరిలో, గూగుల్ యూకెతో 13 కోట్ల పౌండ్లు తిరుగు పన్ను, భవిష్యత్తులో అధిక పన్నులు చెల్లిస్తామని ఒక సెటిల్‌మెంట్ కుదుర్చుకుంది.[96] 2017 లో, గూగుల్ తన పన్ను బిల్లును తగ్గించడానికి 2270 కోట్ల డాలర్లు నెదర్లాండ్స్ నుండి బెర్ముడాకు పంపింది.[97]
2013 లో లాబీయింగ్ ఖర్చులో గూగుల్ 5 వ స్థానంలో ఉంది, 2003 లో 213 వ స్థానం నుంచి పైకిపాకింది. 2012 లో టెక్నాలజీ, అంతర్జాల విభాగాల ప్రచార విరాళాలలో కంపెనీ 2 వ స్థానంలో ఉంది.[98]
కార్పొరేట్ గుర్తింపు
[మార్చు]"గూగుల్" అనే పేరు " googol " [99][100] అనే పదం నుంచి వచ్చింది, ఇది 1 తరువాత వంద సున్నాలున్న అంకెను సూచిస్తుంది. పేజ్ రాంక్ మీద పేజ్, బ్రిన్ వ్రాసిన అసలు పేపర్లో [101] " మా వ్యవస్థలకు ఎంచుకున్న పేరు Google, 10100 సంఖ్యకు సాధారణ పదం, అలాగే చాలా పెద్ద ఎత్తున శోధన ఇంజిన్లు నిర్మించాలనే మా లక్ష్యానికి సరిగ్గా సరిపొతుంది" అని ఉంది. రోజువారీ భాషలో ఈ పదం వాడుక పెరుగాక "గూగుల్" అనే క్రియా పదం 2006 లో మెరియం వెబ్‌స్టర్ కాలేజియేట్ డిక్షనరీ (నిఘంటువు), ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో జోడించబడింది, ఈ పదం అర్థం "అంతర్జాలంలో సమాచారాన్ని పొందడానికి గూగుల్ శోధన ఇంజిన్‌ను ఉపయోగించడం." [102][103] మొదటి నుండి గూగుల్ యొక్క మిషన్ స్టేట్మెంట్ "ప్రపంచ సమాచారాన్ని నిర్వహించడం, విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా, ఉపయోగకరంగా ఉండేలా చేయడం",[104] దాని అనధికారిక నినాదం "చెడుగా ఉండకూడదు".[105]
కార్యాలయాలు
[మార్చు]కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని "గూగుల్ప్లెక్స్" అని పిలుస్తారు. ఇది గూగోల్ ప్లేక్స్ అనే సంఖ్యను, అలాగే ప్రధాన కార్యాలయం భవనాల సముదాయం (complex) అన్న విషయాన్ని సూచిస్తుంది. అంతర్జాతీయంగా గూగుల్ కి 50 పైగా దేశాలలో 78కి పైగా కార్యాలయాలున్నాయి.[106]
గూగుల్ కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 85 చోట్లలో ఉన్నాయి,[107] ఉత్తర అమెరికాలో 32 కార్యాలయాలు, లాటిన్ అమెరికా ప్రాంతంలో 6 కార్యాలయాలు, యూరోప్‌లో 24 (వాటిలో 3 UK లో), ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, ప్రధానంగా భారత్, చైనాలలో, 18 కార్యాలయాలు ఆఫ్రికా మధ్యప్రాచ్య ప్రాంతంలో 5 కార్యాలయాలు ఉన్నాయి.
పర్యావరణం
[మార్చు]2017 నవంబరులో, గూగుల్ 536 మెగావాట్ల పవన శక్తిని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో సంస్థ 100% పునరుత్పాదక శక్తి వాడకాన్ని చేరుకుంది. పవన శక్తి దక్షిణ డకోటాలోని రెండు పవర్ ప్లాంట్ల నుండి వస్తుంది, ఒకటి అయోవాలో ఇంకొకటి ఓక్లహోమాలో ఉన్నాయి.[108] 2019 సెప్టెంబరులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ 200 కోట్ల డాలర్ల పవన, సౌర పెట్టుబడుల కోసం ప్రణాళికలను ప్రకటించారు, ఇది కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఒప్పందం. ఇది వారి గ్రీన్ ఎనర్జీ ప్రొఫైల్‌ని 40% పెరుగుతుంది, తద్వారా వారికి 1.6 గిగావాట్ల శుభ్రమైన శక్తి లభిస్తుందని కంపెనీ తెలిపింది.[109]
2020 సెప్టెంబరులో, గూగుల్ కంపెనీ స్థాపించినప్పటి నుండి తమ కార్బన్ ఉద్గారాలన్నింటిని పునరావృతంగా ఆపు చేసినట్లు ప్రకటించింది.[110] అలాగే 2030 నాటికి కార్బన్ రహిత శక్తిని మాత్రమే ఉపయోగించి తన సమాచార కేంద్రాలు, కార్యాలయాలను నిర్వహించడానికి కట్టుబడింది.[111] 2020 అక్టోబరులో కంపెనీ తన హార్డ్‌వేర్ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌ను 100% ప్లాస్టిక్ రహితంగా, 2025 నాటికి 100% రీసైక్లింగ్-వీలుగా చేయడానికి ప్రతిజ్ఞ చేసింది. దాని తుది అసెంబ్లీ తయారీ సైట్లన్నీ, తయారీ ప్రక్రియ నుండి అత్యధిక శాతం వ్యర్థాలు డంపింగ్లో ముగిసే బదులు రీసైకిల్ చేయబడేలా నిర్ధారించి, 2022 నాటికి డంపింగ్ వ్యర్థాలు లేనివిగా (యూల్ 2799 జీరో వేస్ట్ టు ల్యాండ్‌ఫిల్) సర్టిఫికేషన్‌ను సాధిస్తామంది.[112]
విమర్శలు , వివాదాలు
[మార్చు]గూగుల్ యొక్క మార్కెట్ ఆధిపత్యం కారణంగా విమర్శలతో సహా ఎంతో మీడియా కవరేజ్ దొరికింది. పన్ను ఎగవేత,[113] శోధన తటస్థత, కాపీరైట్, శోధన ఫలితాలు, కంటెంట్ సెన్సార్‌షిప్,[114] గోప్యత వంటి అంశాలపై గూగుల్ ఎన్నో విమర్శలను ఎదుర్కుంది.[115][116] అలాగే గుత్తాధిపత్యం, వాణిజ్యం నియంత్రణ, పోటీ వ్యతిరేక పద్ధతులు, పేటెంట్ ఉల్లంఘన వంటి సాంప్రదాయ వ్యాపార సమస్యల గురించి కూడా విమర్శలను ఎదుర్కుంది.
2017 ప్రాజెక్ట్ మావెన్ ద్వారా గూగుల్ యుఎస్ డిఫెన్స్ శాఖతో కలిసి డ్రోన్ దాడుల కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి డ్రోన్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేసింది.[117] పెంటగాన్‌తో ఈ వివాదాస్పద ఒప్పందాన్ని ముగించాలని కోరుతూ 2018 ఏప్రిల్ లో సీనియర్ ఇంజనీర్లతో సహా వేలాది మంది గూగుల్ ఉద్యోగులు గూగుల్ సిఈఓ సుందర్ పిచైకు ఒక లేఖ రాశారు.[118] గూగుల్ చివరికి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని నిర్ణయించుకుంది, ప్రస్తుత ఒప్పందం 2019లో ముగుసింది.[119]
2018 జూలై లో, మొజిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ క్రిస్ పీటర్సన్ ఫైర్‌ఫాక్స్‌లో యూట్యూబ్ పనితీరును గూగుల్ ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని ఆరోపించాడు.[120][121] 2019 ఏప్రిల్ లో, మొజిల్లా మాజీ ఎగ్జిక్యూటివ్ జోనాథన్ నైటింగేల్ క్రోమ్ స్వీకరణను పెంచడం కోసం గూగుల్ గత దశాబ్ద కాలంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉద్దేశపూర్వకంగా, క్రమపద్ధతిలో విధ్వంసం చేసిందని ఆరోపించాడు.[122]
అపనమ్మకం, గోప్యత, ఇతర వ్యాజ్యాలు
[మార్చు]హైటెక్ ఎంప్లాయి యాంటిట్రస్ట్ (ఉద్యోగుల అపనమ్మకం) లిటిగేషన్‌తో సహా అనేక వ్యాజ్యాలలో గూగుల్ దాఖలైంది, ఈ లిటిగేషన్ ఫలితంగా గూగుల్ తో సహా మూడు ఇతర కంపెనీలు ఉద్యోగులకు 41.5 కోట్ల (415 మిలియన్) డాలర్ల సెటిల్‌మెంట్ డబ్బును చెల్లించాయి.[123]
2017 జూన్ 27న, "శోధన ఫలితాల ఎగువన దాని స్వంత షాపింగ్ పోలిక సేవలను"[124] ప్రచారం చేసినందుకు ఐరోపా సమాఖ్య కంపెనీకి 242 కోట్ల € రికార్డు జరిమానా విధించింది. జరిమానాపై వ్యాఖ్యానిస్తూ న్యూ సైంటిస్ట్ మ్యాగజైన్ ఇలా చెప్పింది:
గూగుల్ (ఆల్ఫాబెట్) ఈ తీర్పును ఆమోదింలేదు.[125] విచారణ లక్సెంబర్గ్ జనరల్ కోర్టులో ఇంకా కొనసాగుతుంది.[126]
2020 జూలై లో యుఎస్ కాంగ్రెస్ విచారణలు[127], అక్టోబరు ప్రారంభంలో విడుదల చేసిన యుఎస్ ప్రతినిధుల సభ యాంటీట్రస్ట్ సబ్‌కమిటీ నివేదిక తర్వాత,[128] యునైటెడ్ స్టేట్స్ న్యాయ శాఖ 2020 అక్టోబరు 20న గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావా వేసింది. ఈ దావాలో శోధనలు, శోధన ప్రకటనలలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని అక్రమంగా కాపాడుకుంటుందని నొక్కిచెప్పింది.[129][130] ఐఫోన్లలో డిఫాల్ట్ శోధన ఇంజిన్‌గా గూగుల్ ఉండేందుకు యాపిల్‌కు 8 బిలియన్ డాలర్ల నుండి 12 బిలియన్ డాలర్ల మధ్య చెల్లించడం ద్వారా పోటీవ్యతిరేక ప్రవర్తనను కనబర్చిందని దావా వేసింది.[131] ఆదే నెలలో ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ రెండూ తమ ఆన్‌లైన్ ప్రకటనల పద్ధతులపై విచారణ నేపథ్యంలో "ఒకరికొకరు సహకరించుకోవడానికి" అంగీకరించాయి.[132][133]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Fitzpatrick, Alex (September 4, 2014). "Google Used to Be the Company That Did 'Nothing But Search'". Time (magazine).
- ↑ Telegraph Reporters (September 27, 2019). "When is Google's birthday – and why are people confused?". The Daily Telegraph.
- ↑ Griffin, Andrew (September 27, 2019). "Google birthday: The one big problem with the company's celebratory doodle". The Independent.
- ↑ Wray, Richard (సెప్టెంబరు 5, 2008). "Happy birthday Google". The Guardian.
- ↑ "Company – Google". January 16, 2015. Archived from the original on January 16, 2015. Retrieved September 13, 2018.
- ↑ Claburn, Thomas (September 24, 2008). "Google Founded By Sergey Brin, Larry Page... And Hubert Chang?!?". InformationWeek. UBM plc. Archived from the original on June 28, 2011. Retrieved January 22, 2017.
- ↑ "Locations— Google Jobs". Archived from the original on September 30, 2013. Retrieved September 27, 2013.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;:0
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Bloomberg - The 'Big Five' Could Destroy the Tech Ecosystem". www.bloomberg.com. Retrieved 2021-08-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Wall Street Journal (2021-05-01). "Five Tech Giants Just Keep Growing". Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Retrieved 2021-08-02.
- ↑ Bary, Andrew. "Big 5 Tech Stocks Now Account for 23% of the S&P 500". www.barrons.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-02.
- ↑ Feiner, Lauren (3 December 2019). "Larry Page steps down as CEO of Alphabet, Sundar Pichai to take over". CNBC (in ఇంగ్లీష్). Retrieved 16 June 2021.
- ↑ "Google employees are forming a union". Android Police. January 4, 2021. Retrieved January 25, 2021.
- ↑ "The top 500 sites on the web". Alexa Internet. Archived from the original on 2021-02-03. Retrieved 2021-10-28.
- ↑ "THE WORLD'S VALUABLE BRANDS". Forbes.
- ↑ "BEST GLOBAL BRANDS". Interbrand.
- ↑ "How we started and where we are today - Google". about.google (in ఇంగ్లీష్). Archived from the original on April 22, 2020. Retrieved April 24, 2021.
- ↑ Brezina, Corona (2013). Sergey Brin, Larry Page, Eric Schmidt, and Google (1st ed.). New York: Rosen Publishing Group. pp. 18. ISBN 9781448869114. LCCN 2011039480.
- ↑ 19.0 19.1 "Our history in depth". Google Company. Archived from the original on April 1, 2012. Retrieved July 15, 2017.
- ↑ Fisher, Adam (July 10, 2018). "Brin, Page, and Mayer on the Accidental Birth of the Company that Changed Everything". Vanity Fair. Archived from the original on July 4, 2019. Retrieved August 23, 2019.
- ↑ McHugh, Josh (January 1, 2003). "Google vs. Evil". Wired. Archived from the original on June 2, 2019. Retrieved August 24, 2019.
- ↑ "Willow Garage Founder Scott Hassan Aims To Build A Startup Village". IEEE Spectrum. September 5, 2014. Archived from the original on August 24, 2019. Retrieved September 1, 2019.
- ↑ D'Onfro, Jillian (February 13, 2016). "How a billionaire who wrote Google's original code created a robot revolution". Business Insider. Archived from the original on August 24, 2019. Retrieved August 24, 2019.
- ↑ "Google.com WHOIS, DNS, & Domain Info - DomainTools". WHOIS. Archived from the original on March 14, 2016.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;milestones2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Craig Silverstein's website". Stanford University. Archived from the original on October 2, 1999. Retrieved October 12, 2010.
- ↑ Kopytoff, Verne (September 7, 2008). "Craig Silverstein grew a decade with Google". San Francisco Chronicle. Hearst Communications, Inc. Archived from the original on October 20, 2012.
- ↑ Lashinsky, Adam (January 29, 2008). "Google wins again". Fortune. Time Warner. Archived from the original on October 20, 2012. Retrieved January 22, 2011.
- ↑ 29.0 29.1 "GOOG Stock". Business Insider.
- ↑ 30.0 30.1 "2004 Annual Report" (PDF). Google, Inc. Mountain View, California. 2004. p. 29. Archived (PDF) from the original on February 2, 2012. Retrieved February 19, 2010.
- ↑ La Monica, Paul R. (April 30, 2004). "Google sets $2.7 billion IPO". CNN Money. Archived from the original on October 20, 2012. Retrieved February 19, 2010.
- ↑ Kawamoto, Dawn (April 29, 2004). "Want In on Google's IPO?". ZDNet. Archived from the original on February 2, 2012. Retrieved February 19, 2010.
- ↑ 33.0 33.1 Webb, Cynthia L. (August 19, 2004). "Google's IPO: Grate Expectations". The Washington Post. Washington, D.C. Archived from the original on October 20, 2012. Retrieved February 19, 2010.
- ↑ "Google Completes Takeover of Motorola Mobility". IndustryWeek. Agence France-Presse. May 22, 2012.
- ↑ Tsukayama, Hayley (August 15, 2011). "Google agrees to acquire Motorola Mobility". The Washington Post. Archived from the original on November 13, 2012.
- ↑ "Google to Acquire Motorola Mobility — Google Investor Relations". Google. Archived from the original on August 17, 2011. Retrieved August 17, 2011.
- ↑ Page, Larry (August 15, 2011). "Official Google Blog: Supercharging Android: Google to Acquire Motorola Mobility". Official Google Blog. Archived from the original on July 28, 2012.
- ↑ Hughes, Neil (August 15, 2011). "Google CEO: 'Anticompetitive' Apple, Microsoft forced Motorola deal". AppleInsider. Archived from the original on December 10, 2011.
- ↑ Cheng, Roger (August 15, 2011). "Google to buy Motorola Mobility for $12.5B". CNet News. Archived from the original on October 6, 2011. Retrieved August 15, 2011.
- ↑ Google Server Assembly. 1999. Archived from the original on July 22, 2010. Retrieved July 4, 2010.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ Kerr, Dara (July 25, 2013). "Google reveals it spent $966 million in Waze acquisition". CNET. CBS Interactive. Archived from the original on February 16, 2017. Retrieved June 12, 2017.
- ↑ Chowdhry, Amit (January 27, 2014). "Google To Acquire Artificial Intelligence Company DeepMind". Forbes. Archived from the original on January 29, 2014. Retrieved January 27, 2014.
- ↑ Opam, Kwame (January 26, 2014). "Google buying AI startup DeepMind for a reported $400 million". The Verge. Vox Media. Archived from the original on July 8, 2017. Retrieved March 9, 2017.
- ↑ "Rankings - 2013 - Best Global Brands - Interbrand". Interbrand. Archived from the original on October 22, 2016. Retrieved October 23, 2016.
- ↑ "Rankings - 2014 - Best Global Brands - Interbrand". Interbrand. Archived from the original on November 3, 2016. Retrieved October 23, 2016.
- ↑ "Rankings - 2015 - Best Global Brands - Interbrand". Interbrand. Archived from the original on October 21, 2016. Retrieved October 23, 2016.
- ↑ "Rankings - 2016 - Best Global Brands". Interbrand. Archived from the original on December 20, 2016. Retrieved October 23, 2016.
- ↑ Womack, Brian (August 10, 2015). "Google Rises After Creating Holding Company Called Alphabet". Bloomberg L.P. Archived from the original on November 23, 2016. Retrieved November 22, 2016.
- ↑ Barr, Alistair; Winkler, Rolf (August 10, 2015). "Google Creates Parent Company Called Alphabet in Restructuring". The Wall Street Journal. Archived from the original on November 28, 2016. Retrieved November 22, 2016.
- ↑ Dougherty, Conor (August 10, 2015). "Google to Reorganize as Alphabet to Keep Its Lead as an Innovator". The New York Times. Archived from the original on October 19, 2016. Retrieved November 22, 2016.
- ↑ 51.0 51.1 Warren, Tom (March 19, 2019). "Google unveils Stadia cloud gaming service, launches in 2019". The Verge. Archived from the original on March 19, 2019. Retrieved April 8, 2019.
- ↑ "Google's Secret 'Project Bernanke' Revealed in Texas Antitrust Case". The Wall Street Journal (in ఇంగ్లీష్). April 11, 2021. Retrieved April 13, 2021.
- ↑ Arrington, Michael (July 25, 2008). "Google's Misleading Blog Post: The Size Of The Web And The Size Of Their Index Are Very Different". TechCrunch. AOL. Archived from the original on March 12, 2017. Retrieved March 9, 2017.
- ↑ Schwartz, Barry (May 26, 2017). "Google Adds Personal Tab To Search Filters". Search Engine Roundtable. RustyBrick. Archived from the original on May 27, 2017. Retrieved May 27, 2017.
- ↑ Gartenberg, Chaim (May 26, 2017). "Google adds new Personal tab to search results to show Gmail and Photos content". The Verge. Vox Media. Archived from the original on May 26, 2017. Retrieved May 27, 2017.
- ↑ Macht, Joshua (September 30, 2002). "Automatic for the People". Time. Archived from the original on October 22, 2010. Retrieved June 7, 2010.
- ↑ Martin, China (November 26, 2007). "Google hit with second lawsuit over Library project". InfoWorld. Archived from the original on May 10, 2011. Retrieved July 5, 2010.
- ↑ Nakashima, Ellen (August 12, 2008). "Some Web Firms Say They Track Behavior Without Explicit Consent". The Washington Post. Archived from the original on November 12, 2012.
- ↑ Helft, Miguel (March 11, 2009). "Google to Offer Ads Based on Interests". The New York Times. Archived from the original on March 28, 2017. Retrieved March 9, 2017.
- ↑ Bright, Peter (August 27, 2008). "Surfing on the sly with IE8's new "InPrivate" Internet". Ars Technica. Condé Nast. Archived from the original on March 12, 2017. Retrieved March 9, 2017.
- ↑ Zakrasek, Nick (2017). "Connecting more Americans with jobs". blog.google.
- ↑ "Job Search on Google - Get Your Job Postings on Google Today". jobs.google.com.
- ↑ "Search Job Opportunities & Expand Career Skills". Grow With Google.
- ↑ Ryan, Robin (2019). "How To Use Google's Job Search Feature To Land A Job". forbes.com.
- ↑ "How to post job listings on the 'Google for Jobs' search engine". Recruiting Resources: How to Recruit and Hire Better. July 17, 2017.
- ↑ Schonfeld, Erick (November 5, 2007). "Breaking: Google Announces Android and Open Handset Alliance". TechCrunch. AOL. Archived from the original on June 22, 2017. Retrieved June 12, 2017.
- ↑ D'Orazio, Dante (March 18, 2014). "Google reveals Android Wear, an operating system for smartwatches". The Verge. Vox Media. Archived from the original on February 10, 2017. Retrieved April 4, 2017.
- ↑ Ong, Josh (June 25, 2014). "Google announces Android TV to bring 'voice input, user experience and content' to the living room". The Next Web. Archived from the original on March 13, 2017. Retrieved April 4, 2017.
- ↑ Wilhelm, Alex (June 25, 2014). "Google Announces Android Auto, Promises Enabled Cars By The End Of 2014". TechCrunch. AOL. Archived from the original on June 22, 2017. Retrieved April 4, 2017.
- ↑ Kastrenakes, Jacob (December 13, 2016). "Android Things is Google's new OS for smart devices". The Verge. Vox Media. Archived from the original on February 17, 2017. Retrieved April 4, 2017.
- ↑ Pichai, Sundar; Upson, Linus (September 1, 2008). "A fresh take on the browser". Official Google Blog. Archived from the original on March 15, 2016. Retrieved November 22, 2016.
- ↑ Pichai, Sundar; Upson, Linus (July 7, 2009). "Introducing the Google Chrome OS". Official Google Blog. Archived from the original on November 22, 2016. Retrieved November 22, 2016.
- ↑ Siegler, MG (January 5, 2010). "The Droid You're Looking For: Live From The Nexus One Event". TechCrunch. AOL. Archived from the original on November 23, 2016. Retrieved November 22, 2016.
- ↑ Ion, Florence (May 15, 2013). "From Nexus One to Nexus 10: a brief history of Google's flagship devices". Ars Technica. Condé Nast. Archived from the original on June 24, 2017. Retrieved June 12, 2017.
- ↑ Bohn, Dieter (October 4, 2016). "The Google Phone: The inside story of Google's bold bet on hardware". The Verge. Vox Media. Archived from the original on January 6, 2017. Retrieved June 12, 2017.
- ↑ Pichai, Sundar; Upson, Linus (May 11, 2011). "A new kind of computer: Chromebook". Official Google Blog. Archived from the original on November 22, 2016. Retrieved November 22, 2016.
- ↑ Robertson, Adi (July 24, 2013). "Google reveals Chromecast: video streaming to your TV from any device for $35". The Verge. Vox Media. Archived from the original on December 26, 2016. Retrieved November 29, 2016.
- ↑ "Google Chromecast takes on streaming content to TV". BBC News. BBC. July 31, 2013. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ O'Toole, James (June 26, 2014). "Google's cardboard virtual-reality goggles". CNN. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ Kain, Erik (June 26, 2014). "Google Cardboard Is Google's Awesomely Weird Answer To Virtual Reality". Forbes. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ "Announcing Google Workspace, everything you need to get it done, in one location". Google Cloud Blog. Retrieved October 24, 2020.
- ↑ "Choose a Plan". G Suite by Google Cloud. Archived from the original on December 12, 2016. Retrieved December 2, 2016.
- ↑ "Celebrating the spirit of entrepreneurship with the new Google for Entrepreneurs". Official Google Blog (in ఇంగ్లీష్). September 24, 2012. Archived from the original on March 20, 2018. Retrieved March 20, 2018.
- ↑ Fell, Jason (September 27, 2012). "How Google Wants to Make Starting Up Easier for Entrepreneurs". Entrepreneur (in ఇంగ్లీష్). Archived from the original on March 20, 2018. Retrieved March 20, 2018.
- ↑ Ingersoll, Minnie; Kelly, James (February 10, 2010). "Think big with a gig: Our experimental fiber network". Official Google Blog. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ Schonfeld, Erick (February 10, 2010). "Google Plans To Deliver 1Gb/sec Fiber-Optic Broadband Network To More Than 50,000 Homes". TechCrunch. AOL. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ McLaughlin, Kevin (August 25, 2016). "Inside the Battle Over Google Fiber". The Information. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ Statt, Nick (August 25, 2016). "Alphabet is putting serious pressure on Google Fiber to cut costs". The Verge. Vox Media. Archived from the original on November 29, 2016. Retrieved November 29, 2016.
- ↑ Hancock, Jay (October 31, 2007). "Google shares hit $700". The Baltimore Sun. Archived from the original on February 2, 2012. Retrieved November 27, 2010.
- ↑ La Monica, Paul R. (May 25, 2005). "Bowling for Google". CNN. Archived from the original on February 2, 2012. Retrieved February 28, 2007.
- ↑ Whitwam, Ryan (October 18, 2013). "Google Beats Analyst Estimates For Third Quarter Results, Stock Passes $1000 Per Share". Android Police. Archived from the original on March 16, 2017. Retrieved March 15, 2017.
- ↑ "Google earnings up 12% in third quarter even as Motorola losses deepen". The Guardian. Reuters. October 17, 2013. Archived from the original on October 17, 2013. Retrieved October 18, 2013.
- ↑ "Google Overview". Marketwatch. Archived from the original on February 2, 2014. Retrieved February 2, 2014.
- ↑ Metz, Cade (October 22, 2010). "Google slips $3.1bn through 'Double Irish' tax loophole". The Register. Archived from the original on July 6, 2017. Retrieved August 10, 2017.
- ↑ Brid-Aine Parnell (May 17, 2013). "I think you DO do evil, using smoke and mirrors to avoid tax". Theregister.co.uk. Archived from the original on December 26, 2013. Retrieved March 13, 2014.
- ↑ John Gapper (January 23, 2016). "Google strikes £130m back tax deal". FT.com. Archived from the original on January 24, 2016. Retrieved January 24, 2016.
- ↑ Bart Meijer (January 3, 2019). "Google shifted $23 billion to tax haven Bermuda in 2017: filing". Reuters. Archived from the original on January 3, 2019. Retrieved January 3, 2019.
Google moved 19.9 billion euros ($22.7 billion) through a Dutch shell company to Bermuda in 2017, as part of an arrangement that allows it to reduce its foreign tax bill
- ↑ Hamburger, Tom; Gold, Matea (April 13, 2014). "Google, once disdainful of lobbying, now a master of Washington influence". The Washington Post. Archived from the original on October 27, 2017. Retrieved August 22, 2017.
- ↑ Koller, David.
- ↑ Hanley, Rachael.
- ↑ Brin, Sergey; Page, Lawrence (1998). "The anatomy of a large-scale hypertextual Web search engine" (PDF). Computer Networks and ISDN Systems. 30 (1–7): 107–117. CiteSeerX 10.1.1.115.5930. doi:10.1016/S0169-7552(98)00110-X. ISSN 0169-7552. Archived (PDF) from the original on September 27, 2015. Retrieved April 7, 2019.
- ↑ Harris, Scott D. (July 7, 2006). "Dictionary adds verb: to google". San Jose Mercury News. Archived from the original on February 6, 2007. Retrieved July 7, 2006.
- ↑ Bylund, Anders (July 5, 2006). "To Google or Not to Google". The Motley Fool. Archived from the original on July 7, 2006. Retrieved July 7, 2006 – via MSNBC.
- ↑ Gibbs, Samuel (November 3, 2014). "Google has 'outgrown' its 14-year old mission statement, says Larry Page". The Guardian. Archived from the original on March 26, 2017. Retrieved March 25, 2017.
- ↑ "Google Code of Conduct". Alphabet Investor Relations. Alphabet Inc. April 11, 2012. Archived from the original on February 11, 2017. Retrieved March 25, 2017.
- ↑ "Google: Our Offices". Archived from the original on July 26, 2018. Retrieved April 19, 2018.
- ↑ "Google world office locations". Google. Google. Retrieved 29 May 2021.[permanent dead link]
- ↑ Donnelly, Grace (November 30, 2017). "Google Just Bought Enough Wind Power to Run 100% On Renewable Energy". Fortune. Archived from the original on December 1, 2017. Retrieved December 1, 2017.
- ↑ correspondent, Jillian Ambrose Energy (September 20, 2019). "Google signs up to $2bn wind and solar investment". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved September 25, 2019.
- ↑ Hern, Alex (September 15, 2020). "Facebook and Google announce plans to become carbon neutral". the Guardian (in ఇంగ్లీష్). Archived from the original on December 9, 2020. Retrieved December 28, 2020.
- ↑ "Google aims to run on carbon-free energy by 2030". CNBC (in ఇంగ్లీష్). September 14, 2020. Archived from the original on December 10, 2020. Retrieved December 28, 2020.
- ↑ Schoon, Ben (October 26, 2020). "Google will ditch plastic packaging by 2025". 9to5Google (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on November 4, 2020. Retrieved December 28, 2020.
- ↑ Drucker, Jesse (October 21, 2010). "Google 2.4% Rate Shows How $60 Billion Is Lost to Tax Loopholes". Bloomberg News. Bloomberg L.P. Archived from the original on September 22, 2016.
- ↑ "The Case Against Google". nytimes.com. February 20, 2018. Archived from the original on March 19, 2018. Retrieved March 21, 2018.
- ↑ "Google ranked 'worst' on privacy". BBC News. June 11, 2007. Archived from the original on October 20, 2012. Retrieved April 30, 2010.
- ↑ Rosen, Jeffrey (November 28, 2008). "Google's Gatekeepers". The New York Times. Archived from the original on February 28, 2017. Retrieved March 9, 2017.
- ↑ Amadeo, Ron (April 4, 2018). "Google employees revolt, say company should shut down military drone project". Ars Technica. Archived from the original on February 2, 2021. Retrieved April 21, 2021.
- ↑ Chapman, Ben (April 3, 2018). "Google staff protest company's involvement with Pentagon drones programme". The Independent. Archived from the original on February 14, 2021. Retrieved April 21, 2021.
- ↑ Wakabayashi, Daisuke; Shane, Scott (June 1, 2018). "Google Will Not Renew Pentagon Contract That Upset Employees". nytimes.com. The New York Times Company. Archived from the original on October 16, 2018. Retrieved October 16, 2018.
- ↑ Kan, Michael (July 25, 2018). "Mozilla Developer Claims Google Is Slowing YouTube on Firefox". PCMag. Archived from the original on August 13, 2019.
- ↑ Cimpanu, Catalin (April 15, 2019). "Former Mozilla exec: Google has sabotaged Firefox for years". ZDNet.
- ↑ Cimpanu, Catalin. "Former Mozilla exec: Google has sabotaged Firefox for years". ZDNet (in ఇంగ్లీష్). Archived from the original on August 19, 2019. Retrieved August 13, 2019.
- ↑ Rosenblatt, Joel (March 2, 2015). "Apple-Google $415 Million No-Poaching Accord Wins Approval". Bloomberg L.P. Archived from the original on January 30, 2016. Retrieved January 24, 2016.
- ↑ Kelion, Leo (June 27, 2017). "Google hit with record EU fine over Shopping service". bbc.co.uk. Archived from the original on June 27, 2017. Retrieved June 29, 2017.
- ↑ "Google's €2.4bn fine is small change – the EU has bigger plans". newscientist.com. Archived from the original on January 24, 2019. Retrieved June 29, 2017.
- ↑ "Google starts appeal against £2bn shopping fine". BBC News. February 12, 2020.
- ↑ "Tech bosses grilled over claims of 'harmful' power". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). July 30, 2020. Archived from the original on July 30, 2020. Retrieved July 30, 2020.
- ↑ "How Are Apple, Amazon, Facebook, Google Monopolies? House Report Counts The Ways". NPR.org.
- ↑ McCabe, David; Kang, Cecilia (October 20, 2020). "U.S. Accuses Google of Illegally Protecting Monopoly". The New York Times. Retrieved October 20, 2020.
- ↑ Allyn (NPR), Bobby. "DOC". www.documentcloud.org.
- ↑ "Google Paid Apple Billions To Dominate Search On iPhones, Justice Department Says". NPR.org.
- ↑ McKinnon, Ryan Tracy and John D. (December 22, 2020). "WSJ News Exclusive | Google, Facebook Agreed to Team Up Against Possible Antitrust Action, Draft Lawsuit Says". The Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Retrieved December 25, 2020.
- ↑ Tracy, John D. McKinnon and Ryan (December 16, 2020). "Ten States Sue Google, Alleging Deal With Facebook to Rig Online Ad Market". The Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Retrieved December 25, 2020.
మరింత తెలుసుకోవటానికి వనరులు
[మార్చు]- David Vise and Mark Malseed (2005-11-15). The Google Story. Delacorte Press. ISBN 0-553-80457-X.
- John Battelle (2005-09-08). The Search: How Google and Its Rivals Rewrote the Rules of Business and Transformed Our Culture. Portfolio Hardcover. ISBN 1-59184-088-0.
బయటి అనుసంధానాలు
[మార్చు]- Corporate Homepage
- Official Google Blog
- On the Origins of Google
- Earliest known google website from 1998 - archive.org
ఇంటర్నెట్ లో గూగూల్ వెబ్‌సైట్లు
[మార్చు]- http://www.google.com గూగుల్ వెబ్‌సైట్
- http://www.google.org Google.org —The philanthropic arm of Google
- http://googleblog.blogspot.com/ అధికారిక గూగుల్ బ్లాగ్
ఇతర అనుసంధానాలు
[మార్చు]- https://web.archive.org/web/20090526164223/http://www.google.vc/ Google.VC — Unofficial Google Website
- Google indexed website Archived 2021-07-28 at the Wayback Machine
- http://www.blingo.com Archived 2006-03-28 at the Wayback Machine Blingo — Provides googgle search results with free prizes when you search
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు
- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 errors: periodical ignored
- All articles with dead external links
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- 2015 from Articles containing potentially dated statements
- బహుళజాతి కంపెనీలు
- వెబ్‌సైట్లు
- హైదరాబాదు లో సాఫ్ట్‌వేర్ సంస్థలు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు
- Pages with reference errors that trigger visual diffs