జాన్ మహేంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్‌ మహేంద్రన్‌ కాసినో
John Mahendran.png
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం
తల్లిదండ్రులుమహేంద్రన్

జాన్ మహేంద్రన్, దక్షిణ భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. తమిళం, తెలుగు సినిమారంగంలో పనిచేశాడు. ఇతడు తమిళ చిత్ర నిర్మాత మహేంద్రన్ కుమారుడు.[1][2]

సినిమారంగం[మార్చు]

శ్రీకాంత్ తమ్ముడు అనిల్, మహేశ్వరి హీరోహీరోయిన్స్ గా 1999లో వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమాకు జాన్ మహేంద్రన్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడైన కోవెలమూడి ప్రకాష్, మెహక్ జంటగా 2002లో వచ్చిన నీతో సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. జాన్ మహేంద్రన్ తమిళంలో 2005లో సచిన్ సినిమా తీశాడు. ఇందులో విజయ్, జెనీలియా, బిపాషా బసు ప్రధాన పాత్రల్లో నటించారు.[3] ఆ తరువాత 2006లో అనివెర్ అనే సినిమా తీశాడు. శ్రీలంక పౌర యుద్ధంలో చిక్కుకున్న డాక్టర్ నేపథ్యంలో రూపొందించిన సినిమా. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది.[4]

2013లో ధనుష్, సోనమ్ కపూర్ నటించిన అంబికాపతి సినిమాకు మాటలు రాశాడు.[5] గోకుల్ దర్శకత్వంలో కార్తీ, నయన తార నటించిన కాష్మోరా (2016), మోట్టా శివ కెట్టా శివ (2017) సినిమాలకు రచయితగా పనిచేశాడు. చెన్నైలోని బోఫ్టా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటింగ్ టీచర్‌గా పనిచేశాడు. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం జోసెఫ్ సినిమా రీమేక్ విసితిరన్ అనే తమిళ సినిమాకు రచయితగా పనrచేశాడు.[6]

సినిమాలు[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

సంవత్సరం సినిమా పేరు భాష ఇతర వివరాలు
1999 ప్రేమించేది ఎందుకమ్మా తెలుగు
2002 నీతో తెలుగు
2005 సచిన్ తమిళం
2007 అనివెర్ తమిళం

రచయితగా[మార్చు]

సంవత్సరం సినిమా స్క్రీన్ ప్లే సంభాషణలు ఇతర వివరాలు
2013 సెట్టై అవును అవును
2013 అంబికపతి కాదు అవును హిందీ సినిమా రాంజన అనువాదం. సంభాషణలు రాశాడు.
2013 అతిరాడి వెట్టై కాదు అవును తెలుగు సినిమా దూకుడు అనువాదం. సంభాషణలు రాశాడు.
2018 కాష్మోరా కాదు అవును

మూలాలు[మార్చు]

  1. "John Roshan on director Mahendran's next". www.behindwoods.com. Retrieved 21 April 2021.
  2. Andhrajyothy (18 June 2021). "తెరవెనుక నుంచి తెరపైకి". andhrajyothy. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  3. "'Bipasha is not there just for an item number'". www.rediff.com. Retrieved 21 April 2021.
  4. "Comedy, creativity mark cultural extravaganza". The Hindu. 2007-09-08. ISSN 0971-751X. Retrieved 21 April 2021.
  5. IANS (2013-06-21). "Dhanush an effortless actor: John Mahendran". Business Standard India. Retrieved 21 April 2021.
  6. "RK Suresh to remake 'Joseph' in Tamil, Bala to produce". Sify. Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 21 April 2021.