Jump to content

జోగు రామన్న

వికీపీడియా నుండి
(జోగురామన్న నుండి దారిమార్పు చెందింది)
జోగురామన్న
జోగు రామన్న


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009-2012, 2012-2014, 2014-2018, 2018-2023
ముందు సి. రామచంద్రారెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం

తెలంగాణ ప్రభుత్వ అటవీ-పర్యావరణ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రి
పదవీ కాలం
2 జూన్ 2014 – 6 సెప్టెంబరు 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1963-07-04) 1963 జూలై 4 (వయసు 61)
దీపాయిగూడ, జైనథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ఆశన్న - బోజమ్మ
జీవిత భాగస్వామి రమ
సంతానం ప్రేమేందర్, మహేందర్
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

జోగు రామన్న తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తొలి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

రామన్న 1961, జూలై 4వ తేదీన ఆశన్న - బోజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, దీపాయిగూడ గ్రామంలో జన్మించాడు. రామన్న బి.ఏ. వరకు చదువుకున్నాడు.[1]

బసవేశ్వరుని 883వ జయంతి ఉత్సవంలో సత్కారం అందుకుంటున్న జోగు రామన్న

వివాహం - పిల్లలు

[మార్చు]

రామన్నకు రమతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (ప్రేమేందర్[2], మహేందర్).

రాజకీయరంగం

[మార్చు]

1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న, దీపాయిగుడ గ్రామానికి సర్పంచ్‌గా జైనాథ్ మండల ఎంపిటిసి, జెడ్‌పిటిసిగా పనిచేశాడు. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి. రామచంద్రారెడ్డి పై 25,580 ఓట్ల మెజారిటీతో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడుగా గెలుపొందాడు.[3] ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరుపై నాగం జనార్ధన్ రెడ్డితో కలిసి పోరాడి[4][5] 2011, అక్టోబరు 10న టిడిపి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. అనంతరం 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటిచేసి మరలా అదే అభ్యర్థిపై గెలుపొందాడు.[6][7]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ పై 14711 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[8] 2014, జూన్ 2వ తేదీన కెసీఆర్ తొలి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తనవంతు కృషిచేశాడు.[9]2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ పై 25,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. జోగు రామన్న 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాదు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[10][11]

పదవులు

[మార్చు]
  • 02.06.2014 - 16.12.2014: అటవీ-పర్యావరణ శాఖా మంత్రి తెలంగాణ ప్రభుత్వం.
  • 16.12.2014 - 11.12.2018: అటవీ-పర్యావరణ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రి, తెలంగాణ ప్రభుత్వం

ఇతర వివరాలు

[మార్చు]

మెక్సికో, దక్షిణ కొరియా దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. "Andhra Pradesh News : Adilabad MLA joins fast". The Hindu. 3 January 2010. Archived from the original on 7 జనవరి 2010. Retrieved 10 December 2019.
  4. "All-party meet on Telangana at the earliest: PC". Ibnlive.in.com. 24 May 2011. Archived from the original on 5 జూన్ 2014. Retrieved 10 December 2019.
  5. "Cities". Deccan Chronicle. 30 June 2013. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 10 డిసెంబరు 2019.
  6. May. "Another MLA joins Nagam's bandwagon - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2012-06-12. Retrieved 10 December 2019.
  7. "AP: TRS Workers Try to Disrupt TDP Public Rally". news.outlookindia.com. Retrieved 10 December 2019.[permanent dead link]
  8. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  9. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 June 2018). "జూలై రెండో వారం నుంచి హరితహారం". www.ntnews.com. Archived from the original on 10 December 2019. Retrieved 10 December 2019.
  10. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  11. Eenadu (19 November 2023). "గతంలో దోస్తీ.. నాలుగోసారి కుస్తీ". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.