ట్రాఫిక్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్రాఫిక్
దర్శకత్వంషహీద్ ఖాదర్
స్క్రీన్ ప్లేబాబీ - సంజయ్
కథబాబీ - సంజయ్
దీనిపై ఆధారితంట్రాఫిక్
నిర్మాతరామ నారాయణ
తారాగణంశరత్ కుమార్
చేరన్
ప్రసన్న
ప్రకాష్ రాజ్
రాధిక
పార్వతి
ఇనియా
సచిన్
ఐశ్వర్య దేవన్
గాబ్రియెల్లా చార్ల్టన్
ఛాయాగ్రహణంషెహనాద్ జలాల్
సంగీతంమోజో జోసఫ్
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
2014 ఫిబ్రవరి 14 (2014-02-14)
సినిమా నిడివి
119 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

ట్రాఫిక్ 2014లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమాను భీమవరం టాకీస్ బ్యానర్‌పై రామ సత్యనారాయణ నిర్మించాడు. 2013లో రాధిక శరత్‌కుమార్ తమిళంలో నిర్మించిన చెన్నైయిల్ ఒరు నాళ్ అనే సినిమా దీనికి మూలం. ఈ చెన్నైయిల్ ఒరు నాళ్ 2011లో విడుదలైన ట్రాఫిక్ అనే మలయాళ సినిమాకు రీమేక్.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: షహీద్ ఖాదిర్
  • సంగీతం: మోజో జోసఫ్
  • కథ, స్క్రీన్ ప్లే : బాబీ - సంజయ్
  • ఛాయాగ్రహణం: షహనాద్ జలాల్

కథ[మార్చు]

కార్తీక్ (సచిన్) మీడియా జర్నలిస్ట్. సెప్టెంబర్ 16న అతను ఉద్యోగంలో చేరే రోజునే ప్రముఖ నటుడు గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను లైవ్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని స్నేహితుడితో కలిసి ఉద్యోగానికి బయలు దేరిన కార్తీక్ దారిలో యాక్సిడెంట్‌కు గురవుతాడు. అతని బ్రెయిన్ డెడ్ అయ్యిందని, కోమా నుండి బయటకు రావడం జరగదని డాక్టర్లు నిర్థారిస్తారు. అదే రోజున ఆటల పోటీల నిమిత్తం కోదాడ వెళ్ళిన గౌతమ్ కృష్ణ కుమార్తె అనారోగ్యం పాలవుతుంది. వెంటనే గుండె మార్పిడి చేస్తే కానీ ఆమె బ్రతకదని డాక్టర్లు చెబుతారు. హైదరాబాద్‌లోని కార్తీక్ గుండెను కోదాడలోని గౌతమ్ కుమార్తెకు అమర్చితే ఆమె బ్రతుకుతుందని డాక్టర్లు భావిస్తారు. కార్తీక్ తల్లిదండ్రులను అందుకు ఒప్పిస్తారు. హైదరాబాద్ నుండి గుండెను కోదాడకు ఎలా తరలించాలనే సమస్య ఉత్పన్నమౌతుంది. రోడ్డు మార్గం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఆపరేషన్‌ను సిటీ పోలీస్ కమీషనర్ సుందర పాండ్యన్ (శరత్ కుమార్)కు అప్పగిస్తారు. గతంలో లంచం తీసుకుని ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్యమూర్తి గుండెను తీసుకెళ్ళే వాహనాన్ని నడపటానికి ముందుకొస్తాడు. అతనితో పాటు ఓ డాక్టర్, కార్తీక్ స్నేహితుడు వాహనంలో బైలు దేరతారు. అనుకున్న సమయానికి గుండెతో సహ వీరు కోదాడ చేరారా? గౌతమ్ కృష్ణ కుమార్తెకు ఆపరేషన్ జరిగిందా? ఊహించని అవాంతరాలు ఎదురైనప్పుడు వీళ్ళు ఎలా స్పందించారు? ఓ స్టార్ హీరో అభిమానులు వీరికి ఎలాంటి సాయం చేశారు? ఇది మిగతా కథ.[1]

పాటలు[మార్చు]

స్పందనలు[మార్చు]

  • చక్కని సందేశాన్ని ఉత్కంఠభరితమైన కథలో మిళితం చేసి, ప్రేక్షకాదరణ పొందే విధంగా తెరకెక్కించడమే 'ట్రాఫిక్ 'లోని గొప్పదనం. కథ, కథనాలలో ఆ పట్టు ఉంది కాబట్టే తమిళంలో రాధికా శరత్ కుమార్ నిర్మించడానికి ముందుకొచ్చారు! ప్రముఖ నటీనటులూ ఇందులో నటించడానికి ఆసక్తి చూపించారు! ఈ సినిమాను తెలుగువారి ముందుకు తీసుకొచ్చిన నిర్మాత రామ సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించాలి![1] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్

మూలం[మార్చు]

  1. 1.0 1.1 వడ్డి ఓంప్రకాశ్ (24 February 2014). "ఉత్కంఠ కలిగించే ట్రాఫిక్". జాగృతి వారపత్రిక. Retrieved 15 February 2024.