తెలంగాణలోని వచన కవులు - రచనలు
స్వరూపం
దాదాపు రెండు వేల ఏళ్ళ తెలంగాణ సాహిత్య చరిత్రలో ఎన్నో ప్రక్రియలు, మరెన్నో ప్రయోగాలు వెలువడ్డాయి. భావ కవిత్వం, అభ్యదయ కవిత్వం, దిగంబర కవిత్వం, చేతనావర్తన కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వంతోపాటు వచన కవిత్వ ప్రక్రియ కూడా ఉంది. 16 శతాబ్దంలోని రాయవాచకం కంటే ముందే 14వ శతాబ్దం పూరార్థంలో మహబూబ్ నగర్ జిల్లా లోని సంతూర్కు చెందిన కృష్ణమాచార్యుడు సింహగిరి నరహరి వచనములు రాశాడు.[1][ఆధారం చూపాలి] 1955లో కుందుర్తి తెలంగాణ వచన కావ్యానికంటే ముందే 1953లో కవిరాజమూర్తి మహిక అనే వచన కావ్యం రాశాడు.[2][ఆధారం చూపాలి]
- వానమామలై వరదాచార్యులు - ఆహ్వానం, జయధ్వజం, మణిమాల, కూలిపోయే కోర్సు
- కాళోజి నారాయణరావు - నా గొడవ, జీవనగీత (అనువాదం)
- పొట్లపల్లి రామారావు - చుక్కలు
- టి. కృష్ణమూర్తి యాదవ్ - తొక్కుడుబండ, షబ్నం
- కోవెల సంపత్కుమారాచార్య - కాలస్పృహ, అంతర్మథనం, చేతనావర్తనము-1
- సి. నారాయణరెడ్డి - నవ్వని పువ్వు, అక్షరాల గవాక్షాలు, మధ్య తరగతి మందహాసం, మంటలూ - మానవుడూ, ఉదయం, నా హృదయం, మార్పు నా తీర్పు, మట్టిమనిషి, ఆకాశం, విశ్వంభర
- పేర్వారం జగన్నాథం - సాగర సంగీతం, వృషభపురాణం, మోర్దోపుదున్న
- కోవెల సుప్రసన్నాచార్య - తేజచక్రము, దు:ఖయోగిని, ఆధునీకం, శతాంకుర, ఋతంబర
- చెరబండరాజు - నేనెక్కడిబోను, ఊబి, జాగ్రత్త, వందేమాతరం
- జ్వాలాముఖి - శస్త్రచికిత్స, సూర్యస్నానం
- నిఖిలేశ్వర్ - నీవు చెప్పింది అబద్ం కాదు, నా దేశంలో నేను ఏకాకిని
- అలిశెట్టి ప్రభాకర్ - చురకలు, సిటీలైఫ్, ఎర్రపావురాలు, సంక్షోభగీతం
- అమ్మంగి వేణుగోపాల్ - మిణుగురు, భరోసా, పచ్చబొట్టు, పటంచెరు
- ఎన్. గోపి - కాలాన్ని నిదురపోనివ్వను, వంతెన, చిత్ర దీపాలు, తంగేడు పూలు, జలగీతం
- నందిని సిధారెడ్డి - భూమి స్వప్పం, ఇక్కడి చెట్లగాలి, ప్రాణహిత, ఒక బాధకాదు, నదిపుట్టువడి
- గూడూరి సీతారాం - ఇదిగో ఇక్కడిదాకే, సన్/ఆఫ్ మాణిక్యం
- బోయ జంగయ్య - భోజ కవితలు, నడుస్తున్న చరిత్ర, వెలుతురు
- వేముల ఎల్లయ్య - తిరుగుబాటు కవిత్వం
- దామెర రాములు - కోరస్, జయ హే తెలంగాణ, నెత్తుటి వెన్నెల
- మాష్టార్టీ - బౌద్ధగీతాలు, మట్టిపూలు
- సతీష్ చందర్ - పంచమవేదం, నాన్నా సైకిల్, పసుపు జాబిల్లి
- ఎండ్లూరి సుధాకర్ - వర్తమానం, కొత్త గబ్బిలం, పుష్కర కవితలు, గోసంగి
- జూలూరి గౌరీశంకర్ - పొలికట్టె, ముండ్ల కర్ర
- జూపాక సుభద్ర - హైటెక్ సిటీ మామ్ కి స్వాగతం
- అనిశెట్టి రజిత - నేనొక నల్లమబ్బునవుతా, చెరుట చెట్టు, అనగనగా కాలం
- వఝల శివకుమార్ - గోగుపూలు, దాఖలా, కలలసాగు
- షాజహానా - నఖాబ్, జభ్మీ, ఆవాజ్, దర్జీ
- అఫ్సర్ - వలస, ఊరుచివర
- జూకంటి జగన్నాథం - పాతాళగంగ, బొడ్డుతాడు, తల్లికొంగు, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, ఒకరోజు పదిగాయాలు, తల్లికొంగు, పిడికెడు కలలు -దోసెడు కన్నీళ్లు, తారంగం, రాజపత్రం, చిలుక రహస్యం, చెట్టును దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి, సద్దిముల్లె
- నాళేశ్వరం శంకరం - దూదిపేడ
- వేం నర్సింహా రెడ్డి - కొలిమంటుకున్నది, చేతనావర్తనం -2, సమర్పథేబాగ్లా
- శిలాలోలిత - పంజరాన్ని నేనే పక్షిని నేనే, గాజనది
- జాజుల గౌరి - కర్షకులు
- గ్యార యాదయ్య "ఎర్కోషి" దీర్ఘ కవిత
- సిస్టర్ అనసూయ "విముక్తి" నవల
- ఆకారపు పాండురంగ ప్రజాసింగం - కడ "జీవ కవిత్వం"
- డా. వెల్దండి శ్రీధర్ - ఆసు
- నాగులవంచ వసంతరావు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ కోటలు, తెలంగాణ వైభవం పరిచయ దీపిక, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ హైదరాబాదు, డిసెంబర్ 2017, పుట. 202.
- ↑ తెలంగాణ కోటలు, తెలంగాణ వైభవం పరిచయ దీపిక, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ హైదరాబాదు, డిసెంబర్ 2017, పుట. 203.
- ↑ తెలంగాణ కోటలు, తెలంగాణ వైభవం పరిచయ దీపిక, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ హైదరాబాదు, డిసెంబర్ 2017, పుట. 206.