Jump to content

తెలంగాణ యువ నాటకోత్సవం - 6

వికీపీడియా నుండి

తెలంగాణ యువ నాటకోత్సవం - 6 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2022, ఏప్రిల్ 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించబడుతున్న నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ యువ నాటకోత్సవం పేర నాటకోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ యువనాటకోత్సం 4 రోజులలో 10 నాటికలు ప్రదర్శించబడుతున్నాయి, ఒక్కో నాటికకు భాషా సాంస్కృతిక శాఖ నుండి 40వేల రూపాయల ప్రదర్శన పారితోషికం అందించబడుతోంది. దాదాపు 600 మంది నాటక కళాకారులు ఈ నాటకోత్సవంలో పాల్గొంటున్నారు.

తెలంగాణ యువ నాటకోత్సవం - 6 పోస్టర్, ఫ్లెక్సీలను అవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు

పోస్టర్ ఆవిష్కరణ

[మార్చు]

ఈ యువ నాటకోత్సవానికి సంబంధించిన పోస్టర్, ఫ్లెక్సీలను 2022 ఏప్రిల్ 4వ తేదీన రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షకార్యదర్శులు చిలకమర్రి నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి, సినీ రచయిత తోటపల్లి సాయినాథ్, వడ్డేపల్లి నర్సింగరావు, ఒగ్గు రవి, ఆకుల శ్రీధర్, పవన్, భాను, బిర్రు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.[1][2]

బ్రోచర్ ఆవిష్కరణ

[మార్చు]
బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న మామిడి హరికృష్ణ తదితరులు

2021, ఏప్రిల్ 9వ తేదీ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ నాటకోత్సవ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షకార్యదర్శులు చిలకమర్రి నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్, నటులు నామాల మూర్తి, సినీ దర్శకులు నాగసాయి మాకం, యువ నాటక దర్శకులు నటులు సురభి రాఘవ, ప్రభాకర్ సింగపంగ, బిర్రు కిరణ్ కుమార్, పవన్ కుమార్, మనోహర్ ఇతర కళాకారులు పాల్గొన్నారు.

సభా కార్యక్రమాలు

[మార్చు]

మొదటిరోజు

[మార్చు]

ఏప్రిల్ 21న మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సినీ దర్శకులు దశరథ్, కేవీఆర్ మహేంద్ర విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో నాటకోత్సవం ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ నటుడు, దర్శకుడు మోహన్ సేనాపతికి స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో డా. ఖాజా పాషా, నాటకరంగ ప్రముఖులు బి.ఎం. రెడ్డి, డా. వెంకట్ గోవాడ, శ్రీధర్ బీచరాజు, తెర అధ్యక్షకార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు.[3][4]

రెండవ రోజు

[మార్చు]

ఏప్రిల్ 22న రెండవరోజు జరిగిన సభా కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, ప్రొఫెసర్ తులసి, రంగస్థల నటి, అధ్యాపకురాలు బి.హెచ్. కల్యాణి, అధ్యక్షకార్యదర్శులు సిహెచ్. నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్ పాల్గొన్నారు. 5 దశాబ్ధాలకుపైగా తెలుగు నాటకరంగంలో కృషిచేస్తూ అనేక పద్య, సాంఘిక నాటకాల్లో నటిస్తున్న కొరిడే నరహరి శర్మకి అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.

మూడవరోజు

[మార్చు]

ఏప్రిల్ 23న మూడవరోజు జరిగిన సభా కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, సినీనటులు సివిఎల్ నరసింహారావు, నాటకరంగ ప్రముఖులు బాదంగీర్ సాయి, సురాపానం సినిమా టీం, తెర అధ్యక్షకార్యదర్శులు సిహెచ్. నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్ పాల్గొన్నారు. కొన్ని దశాబ్ధాలుగా తెలుగు నాటకరంగంలో కృషిచేస్తున్న జమ్మలమడక శశిమోహన్ కు అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.

నాలుగవరోజు

[మార్చు]

ఏప్రిల్ 24న జరిగిన నాటకోత్సవం ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నాడు. తెలుగు నాటకరంగంలో కృషిచేస్తున్న చక్రాల జానకీబాయి గారికి అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.[5][6]

ప్రదర్శించిన నాటికలు

[మార్చు]

తెలంగాణ యువనాటకోత్సం 6వ సిరీస్ లో 4 రోజులలో 10 నాటికలు ప్రదర్శించబడుతున్నాయి

తేది నాటిక పేరు సంస్థ రచయిత దర్శకత్వం
21.04.2022 పెట్రోమాస్ పంచాయితీ కర్టెన్ కాల్ థియేటర్, హైదరాబాదు హిందీ కథ: ఫనీశ్వర్ నాథ్ రేణు
నాటకీకరణ: డా వెంకట్ గోవాడ
సురభి సంతోష్
మీకోసం నేను ఆర్ట్ ఫామ్ క్రియేషన్స్ పి.టి. మాధవ్ వై.వి.ఎస్. మూర్తి
22.04.2022 టియర్స్ ఆఫ్ బ్లడ్ విశ్వకర్మ ఆర్ట్స్, వీరారెడ్డిపల్లి, యాదాద్రి తమిళమాలం: తిరువరూర్ కె తంగరాజన్
అనువాదం: భానుప్రకాశ్
భానుప్రకాశ్
తృష్ణ వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, వరంగల్ వి. నర్సింగరావు కె. తిరుమలరావు
23.04.2022 పైసా-పరమాత్మ కళా కిరణాలు కల్చరల్ అసోసియేషన్, నిడిగొండ, జనగాం కె. కుమారస్వామి బిర్రు కిరణ్ కుమార్
కరోనా కుచ్ కరోనా నవరంగ్ ఆర్ట్స్ హైదరాబాద్ శశిమోహన్ ఏ. అనిల్ కుమార్
మౌనధ్వని శృతి లయ కళాభారతి, వైరా, ఖమ్మం సయ్యద్ గఫార్ సంపసాల వరదరాజు
24.04.2022 గప్పాలు పాప్‌కార్న్ థియేటర్, హైదరాబాదు మూలం: యోగేష్ సోమన్
అనువాదం: లక్ష్మీకాంత్ దేవ్
తెలుగు రచన: మనోజ్ ముత్యం
సురభి రాఘవ
H2OSIS వెంకటకృష్ణ థియేటర్, వెల్జాల పవన్ కృష్ణ పవన్ కృష్ణ
పైసా వసూల్ నటరాజా ఆర్ట్స్, హైదరాబాదు మూల రచయిత: ప్రిగేస్ కారంతీ

స్వేచ్ఛానువాదం: చిలుకమఱ్ఱి నటరాజ్

చిలుకమఱ్ఱి నటరాజ్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణ యువ నాటకోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్". epaper.andhrajyothy.com (2022, ఏప్రిల్ 5. హైదరాబాదు. 7వ పేజీ. 2022-04-05. Archived from the original on 2022-04-21. Retrieved 2022-04-21.
  2. వైభవంగా తెలంగాణ యువ నాటకోత్సవం, వార్త, హైదరాబాదు జిల్లా ఎడిషన్, పేజీ 2.
  3. "తెలంగాణలె పుష్కలంగా నాటక సాహిత్యం (వార్త, హైదరాబాద్ ఎడిషన్, 2022 ఏప్రిల్ 22, పేజి 3.)". epaper.vaartha.com. Archived from the original on 2022-04-22. Retrieved 2022-04-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. తెలంగాణ యువ నాటకోత్సవం-6 ప్రారంభం, ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, 2022 ఏప్రిల్ 22. పేజీ 7.
  5. telugu, NT News (2022-04-25). "నాటక రంగం చాలా గొప్పది". Namasthe Telangana. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-25.
  6. Web, Disha (2022-04-24). "తెలంగాణ వచ్చాక నాటకరంగం అభివ‌ద్ధి చెందింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్". www.dishadaily.com. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-25.