Coordinates: 26°31′N 86°37′E / 26.51°N 86.62°E / 26.51; 86.62

దక్నేశ్వరి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్నేశ్వరి దేవాలయం
దక్నేశ్వరి దేవాలయం
స్థానం
దేశం:నేపాల్
రాష్ట్రం:సాగరమాత
జిల్లా:సప్తరి జిల్లా
ప్రదేశం:పాటో, రాజ్బీరాజ్
ఎత్తు:76 m (249 ft)
భౌగోళికాంశాలు:26°31′N 86°37′E / 26.51°N 86.62°E / 26.51; 86.62
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:పగోడా శైలి
శాసనాలు:శిలా శాసనాలు

దక్నేశ్వరి దేవాలయం, ఆగ్నేయ నేపాల్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం, శక్తి పీఠం. దక్నేశ్వరి దేవి ఇక్కడి ప్రధాన దేవత. నేపాల్, భారతీయ యాత్రికులకు ఈ దేవాలయం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి బడా దశాయిన్ ప్రజలు వస్తుంటారు.[1] దసరా సమయంలో ఇక్కడ కొన్ని వేల మేకలను బలి ఇస్తారు.[2]

చరిత్ర[మార్చు]

ఈ దేవాలయం అక్కడి స్థానిక, పొరుగు ప్రాంతాలకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగివున్న దేవాలయం. ఈ దేవాలయంలో దక్నేశ్వరి భగవతి దేవత విగ్రహాం ఉంచబడింది. ప్రస్తుతమున్న దేవాలయ నిర్మాణం 1990వ దశకంలో పునర్నిర్మించబడింది.[2] దక్నేశ్వరీ భగవతి పేరుమీదుగా ఈ ప్రాంతానికి దక్నేశ్వరీ మున్సిపాలిటీ అనిపేరు వచ్చింది.[3]

తీర్థయాత్ర[మార్చు]

ప్రతి సంవత్సరం నేపాల్, భారతదేశం, ఇతర దేశాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి దక్నేశ్వరీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. దసరా పండుగ సమయంలో ఎక్కువమంది భక్తులు వస్తారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Maha Asthami observed today". ekantipur.com. Archived from the original on 2014-11-11. Retrieved 2021-12-07.
  2. 2.0 2.1 "The Goddess with Severed Head". Boss Nepal. Archived from the original on 2016-01-13. Retrieved 2021-12-07.
  3. "About: Dakneshwori Municipality". dbpedia.org. Retrieved 2021-12-07.
  4. Dāsa, Harikāntalāla (2003). Saptarī Jillākā pramukha sāṃskr̥tika sthalaharu : eka adhyayana : laghuanusandhānakārya. Nepāla Rājakīya Prajñā-Pratishṭhāna. p. 120. ISBN 9789993350569.

వెలుపలి లంకెలు[మార్చు]