Coordinates: 27°38′20″N 85°26′17″E / 27.63889°N 85.43806°E / 27.63889; 85.43806

డోలేశ్వర్ మహాదేవ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోలేశ్వర్ మహాదేవ ఆలయం
దస్త్రం:Doleshwar Mahadev.jpg
డోలేశ్వర్ మహాదేవ ఆలయం is located in Nepal
డోలేశ్వర్ మహాదేవ ఆలయం
నేపాల్‌లో ఆలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు27°38′20″N 85°26′17″E / 27.63889°N 85.43806°E / 27.63889; 85.43806
దేశంనేపాల్
జిల్లాభక్తపూర్ జిల్లా
స్థలంసిపాడోల్
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుశివరాత్రి, తీజ్, బలచతుర్దశి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుపగోడ

డోలేశ్వర్ మహాదేవ దేవాలయం (నేపాలీ: डोलेश्वर महादेव) నేపాల్‌లోని భక్తపూర్ జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉన్న సూర్యాబినాయక్ మునిసిపాలిటీలో ఉంది. దీనిని భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్ కు ప్రధాన కేంద్రంగా భావిస్తారు.[1][2] [3]

చరిత్ర[మార్చు]

4000 సంవత్సరాల క్రితం ప్రజలు పంచ కేదార్ ఆలయాల అధిపతి కోసం వెతికారు. పంచ కేదార్ ఆలయాల సృష్టికి సంబంధించిన విషయాలు అనేక జానపద పురాణాల్లో వివరించబడ్డాయి.

పంచ కేదార్ గురించిన ఒక జానపద పురాణం ప్రకారం ఈ ప్రదేశం హిందూ ఇతిహాసం మహాభారతంలోని పాండవులకు సంబంధించినది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులైన కౌరవులను ఓడించి చంపారు. పాండవులు యుద్ధ సమయంలో సోదర హత్య (గోత్ర హత్య), బ్రాహ్మణహత్య (బ్రాహ్మణులను చంపడం - పూజారి వర్గం) చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని కోరుకున్నారు. ఆ విధంగా, వారు తమ రాజ్యాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడిని వెతుకుతూ, అతని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట, వారు పవిత్ర నగరమైన వారణాసి (కాశీ)కి వెళ్లారు, ఇది శివుడికి ఇష్టమైన నగరం, కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. కానీ, శివుడు కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన మరణ కాండ పట్ల, మోసం పట్ల తీవ్రంగా మండిపడ్డాడు. పాండవుల ప్రార్థనల పట్ల సున్నితత్వంతో వారిని తప్పించాలనుకొని, ఎద్దు (నంది) రూపాన్ని ధరించి, గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.[4][5]

వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్లారు. ఐదుగురు పాండవ సోదరులలో రెండవవాడైన భీముడు, రెండు పర్వతాల మీద నిలబడి శివుని కోసం వెతకడం ప్రారంభించాడు. గుప్తకాశి ("దాచిన కాశీ" - శివుడు దాక్కున్నందుకు వచ్చిన పేరు) సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు చూశాడు. భీముడు వెంటనే ఆ ఎద్దును శివునిగా గుర్తించాడు. భీముడు ఎద్దును దాని తోక, వెనుక కాళ్ళతో పట్టుకున్నాడు. కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు, కేదార్‌నాథ్‌లో మూపురం పెరగడం, తుంగనాథ్‌లో చేతులు కనిపించడం, రుద్రనాథ్‌లో ముఖం, నాభి కనిపించిడం , మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు కనిపించిడం , కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపించిడం జరిగింది. ఐదు వేర్వేరు రూపాల్లో శివుడు తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు, శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. నేపాల్‌లోని భక్తపూర్ జిల్లా, డోలేశ్వర్ మహాదేవ ఆలయంలో శివుని ముందుభాగాలు కనిపించాయని కూడా నమ్ముతారు.[6]

ఈ సంఘటనలో భీముడు ఎద్దును పట్టుకోవడమే కాకుండా, అది అదృశ్యం కాకుండా ఆపాడు. తత్ఫలితంగా, ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌లోని ఐదు ప్రదేశాలలో కనిపించింది. పాండవులు ఆయా ప్రదేశాల్లో పంచ కేదార్ ఆలయాలను నిర్మించిన తర్వాత, మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానం చేసి, యజ్ఞం చేసి, ఆపై మహాపంత్ (స్వర్గరోహణం అని కూడా పిలుస్తారు) అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాలు ఉత్తర-భారత హిమాలయ ఆలయాలైన కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి.

పంచ కేదార్ ఆలయాల వద్ద శివుని దర్శనం, పూర్తి చేసిన తర్వాత, బద్రీనాథ్ ఆలయంలో విష్ణువును సందర్శించడం అనేది ఒక ఆచారం, దీనిని శివుని ఆశీర్వాదం కోరినట్లు ధృవీకరణ రుజువుగా చెప్పవచ్చు.

పరిశోధన, ఫలితాలు[మార్చు]

హిందూ కార్యకర్త భరత్ జంగం కేదార్‌నాథ్, పంచ డోలేశ్వర్ ల మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాల ఆధారంగా డోలేశ్వర్ మహాదేవ్ కేదార్‌నాథ్ ప్రధాన భాగమని పరిశోధన చేసి నిర్ధారించాడు. రెండు పుణ్యక్షేత్రాలలో లభించిన శివుని శిల్పాలు 4,000 సంవత్సరాల క్రితం నాటివని తేల్చి చెప్పాడు. డోలేశ్వర్‌లో దొరికిన రాతి గ్రంథం కూడా పాత నేపాలీ భాషలో సంస్కృతంలో వ్రాయబడింది. రెండు పుణ్యక్షేత్రాలలోని పూజారులు భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు నుండి ఎంపిక చేయబడ్డారు. పూజారులు ఇద్దరూ దేవుడి ఆరాధకులుగా తమ సామీప్యాన్ని తెలియజేయడానికి పేర్ల తర్వాత 'లింగం' అనే పదాన్ని చేర్చుకున్నారు. రెండు దేవాలయాలు ఐదు శివాలయాల సమూహాన్ని కలిగి ఉంటాయి. హిందూ గ్రంథాల ప్రకారం, ఇద్దరు పూజారుల ప్రధాన దేవత బీర్భద్ర, ఇతడు శివుని సహచరుడు.[7][8]

గుర్తింపు[మార్చు]

22 ఆగష్టు, 2009న కేదార్‌నాథ్ పీఠం ప్రధాన అర్చకుడు జగత్ గురువైన భీమశంకరలింగ శివాచార్యులు జంగం మఠం భక్తపూర్‌లో ఉన్న డోలేశ్వర్ మహాదేవ్ అనేది శ్రీ కేదార్‌నాథ్ ప్రధాన భాగమని పేర్కొంటూ ఫలకాన్ని ఆవిష్కరించాడు. భక్తపూర్ జిల్లా సిపడోల్ గ్రామంలో ఉన్న డోలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇది డోలేశ్వర్ మహాదేవ్ వద్ద ఉన్న శాసనం లో కూడా ప్రస్తావించబడింది. ప్రతిరోజు డోలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తుతారు.[9][10][11][12]

మూలాలు[మార్చు]

  1. "Doleshwor Mahadev". www.doleshwor.org.np. Archived from the original on 2021-05-13. Retrieved 2021-12-30.
  2. http://in.news.yahoo.com/20/20090812/365/twl-mahabharata-era-relic-links-kedarnat.html[permanent dead link]
  3. Prasai, Dirgha Raj. "Hindu shrine: Pashupatinath (Lord Shiva) and Shivaratri in Nepal". The Indian Post. Retrieved 7 July 2012.
  4. "Panch Kedar Yatra". Archived from the original on 24 May 2011. Retrieved 2009-07-05.
  5. Kapoor. A. K.; Satwanti Kapoor (1994). Ecology and man in the Himalayas. M.D. Publications Pvt. Ltd. p. 250. ISBN 9788185880167.
  6. "Panch Kedar". Archived from the original on 31 ఆగస్టు 2009. Retrieved 15 జూలై 2009.
  7. Annapurna Post (29 August 2009). "Doleshwar Mahadev Kedarnath ko Sheer bhayeko khosana". Bhaktaput.
  8. Nepali Samachar patra (22 August 2009). "Aba Doleshwar Hindu ko pramukh dham ". Thimi.
  9. Thapa, Bharat Bandu. "Mandir Anabaran ". Rajdhani. Bhaktapur.
  10. "Doleshwor Mahadev, Sipadol, Bhaktapur, Nepal". Mrrajunepal. Mar 31, 2012. Retrieved 29 July 2012.
  11. "Kedharnaat Seer Doleshore Mahadev". Bikram Khatri. May 5, 2012. Retrieved 29 July 2012.
  12. "Thousands throng Doleswor Temple". The Himalayan. 2013-08-05. Archived from the original on 2013-09-15. Retrieved 9 Sep 2013.

వెలుపలి లంకెలు[మార్చు]