అక్షాంశ రేఖాంశాలు: 29°16′27.15″N 82°11′0.65″E / 29.2742083°N 82.1835139°E / 29.2742083; 82.1835139

చందనాథ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందనాథ ఆలయం
चन्दननाथ मन्दिर
చందననాథ్, భైరబ్నాథ్ ఆలయం
దశైన్ పండుగ సమయంలో చందననాథ్, భైరబ్నాథ్ ఆలయం వార్షిక లింగోత్పత్తి వేడుక జరుగుతుంది
చందనాథ ఆలయం is located in Nepal
చందనాథ ఆలయం
Location within Nepal
భౌగోళికం
భౌగోళికాంశాలు29°16′27.15″N 82°11′0.65″E / 29.2742083°N 82.1835139°E / 29.2742083; 82.1835139
దేశంనేపాల్
రాష్ట్రంకర్ణాలి ప్రావిన్స్
జిల్లాజూమ్లా జిల్లా
ప్రదేశంచందననాథ్ మున్సిపాలిటీ
ఎత్తు2,514 మీ. (8,248 అ.)
సంస్కృతి
దైవందత్తాత్రేయ స్వామి

చందనాథ ఆలయం (నేపాలీ: चन्दननाथ मन्दिर) నేపాల్‌లోని జుమ్లాలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది చందననాథ్ మున్సిపాలిటీలోని ఖలంగా బజార్‌లో ఉంది.

చరిత్ర

[మార్చు]

కొన్ని సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని కల్లాల రాజవంశం వారు పాలించేవారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కళ్యాల్ రాజవంశం అని కూడా పిలిచేవారు. కళ్యాల్ రాజవంశం, చందననాథ్ గురించి చాలా వ్రాతపూర్వక పత్రాలు ఉండేవి కానీ వాటిని భద్రపరచబడలేదు. వీటికి సంబంధించిన సంఘటనలు, కథలు తరతరాలుగా మౌఖికంగా ఒకరికొకరు అందించుకుంటూ వచ్చారు. ఈ సంఘటనలు, కథలు ప్రస్తుత కాలంలో కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

కాశ్మీర్‌కు చెందిన చందంనాథ్ బాబా

[మార్చు]

కాశ్మీర్‌కు చెందిన చందననాథ్ అనే వ్యక్తి దత్తాత్రేయుని (త్రిమూర్తి అని కూడా పిలుస్తారు) విగ్రహాన్ని తీసుకువచ్చాడని ప్రజలు నమ్ముతారు. అతను కల్లాల రాజవంశం సమయంలో నిర్మాణాన్ని మొదలు పెట్టాడని ప్రజలు అదే సమయంలో నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేశాడని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ఉంచి పూజలు ప్రారంభించాడని ప్రజలు చెబుతారు. జుమ్లాలో కాశ్మీర్‌లో ఉన్నటువంటి కాలానుగుణ వాతావరణాన్ని గుర్తించిన తర్వాత కాశ్మీర్‌కు చెందిన చందన్నాథ్ మొదటిసారిగా బ్రౌన్ రైస్ (మార్సి చామల్)ను ప్రవేశపెట్టాడని నమ్ముతారు.

ప్రత్యేక సంఘటన

[మార్చు]

కొంతమంది స్థానిక ప్రజలు ఆలయ స్థాపనకు సంబంధించిన మరొక కథనాన్ని కూడా చెబుతారు. అంటే, ఒకప్పుడు ఒక ఆవు ఉండేది, అది తన యజమానికి అతని గోశాలలో పాలు ఇవ్వలేదు. కానీ ఒక రోజు, ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలం పైన అది నిలబడినప్పుడు, దాని చనుబాట్ల నుండి పాలు కారడం ప్రారంభించాయి. ఆమె యజమాని అది చూసి గ్రామస్తులందరికీ చెప్పాడు. ఆవు తన పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈ ప్రదేశం పవిత్రమైనదని ప్రజలు విశ్వసించారు. అప్పుటి నుండి వారు ఈ ఆలయాన్ని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఘటస్థాపన రోజున ఈ ఆలయంలో పూజలు నిర్వహించి లింగాన్ని మార్చే ఆచారం అనాదిగా వస్తోంది. దాదాపు 52 అడుగుల పొడవున్న పచ్చని చెట్టు లింగాన్ని తయారు చేస్తారు. లింగాన్ని పూర్తిగా ఎరుపు, తెలుపు రంగుల వస్త్రాలను, లింగం పైభాగంలో కప్పి ఆలయంలో ఉంచుతారు. నిలబడితే లింగం విరిగినా, పగిలినా దేశానికి అరిష్టం అని అంటారు. దేవత, ఆర్తి, భజన కీర్తనలతో లింగాన్ని మార్చడం, పూజించడం ఆచారం.

[1]

ఉత్సవాలు

[మార్చు]

ఈ ఆలయంలో, స్థానిక ప్రజలు ప్రతి సంవత్సరం లింగాన్ని మారుస్తూ ఉంటారు. ఇక్కడి లింగం ఒక కలపతో చేయబడి ఉంటుంది, దీని పొడవు సుమారు 52 అడుగుల కంటే ఎక్కువనే ఉంటుంది, ఇది ఇటుక ఎరుపు రంగుతో ఉండి, దాని చుట్టూ ఒక భారీ వస్త్రం చుట్టబడి ఉంటుంది, ఇది త్రిభుజాకార జెండా వలె కనిపిస్తుంది. మారుతున్న సమయంలో ఆ లింగం విరిగిపోతే తప్పు జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ వేడుక ఘటస్థాపన సమయంలో జరుగుతుంది, ఇది దశైన (నేపాల్ పండుగ) మొదటి రోజు నిర్వహిస్తారు. ఆ రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతుంది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి, మహా శివరాత్రి, ఇతర ప్రధాన హిందూ పండుగల సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయ దర్శనం చేసుకుంటారు.

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.himkalaadventure.com/chandannath-temple-tour.html

వెలుపలి లంకెలు

[మార్చు]