భద్రకాళి ఆలయం (పోఖారా)
భద్రకాళి ఆలయం | |
---|---|
భౌగోళికం | |
దేశం | నేపాల్ |
జిల్లా | కస్కీ జిల్లా |
ప్రదేశం | పోఖరా |
సంస్కృతి | |
దైవం | భద్రకాళి దేవి |
ముఖ్యమైన పర్వాలు | దశైన్ |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | పగోడ |
భద్రకాళి ఆలయం (నేపాలీ :भद्रकाली मन्दिर) కుందహార్‌లోని పోఖరా తూర్పున ఒక చిన్న కొండపై ఉన్న దేవాలయం. ఇది కాళికా దేవి ఆలయం. [1] 1817 సంవత్సరంలో ఈ భద్రకాళి (దుర్గ) ఆలయాన్ని స్థాపించారు. ఇది 135 రోపానీల విస్తీర్ణంలో ఉంది. కొండ పైకి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. తూర్పు మార్గంలో ఆలయానికి చేరుకోవడానికి 292 మెట్లు ఉండగా, దక్షిణం వైపు నుండి వెళ్తే, 265 మెట్లే ఉంటాయి. ఈ ఆలయాన్ని గతంలో "ముదులే తుంప్కో" అని పిలిచేవారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 230 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ పచ్చదనంతో ఇది "ప్రశాంత వాతావరణంలో" ఉంటుంది. [2]
"భద్రకాళి" దేవత, పూజారిని కొండను త్రవ్వమని చెప్పినప్పుడు ఈ ఆలయం బయల్పడింది. అక్కడ ఈ దేవత విగ్రహం బయల్పడింది. అప్పటి నుండి దీనిని "భద్రకాళి"గా పూజిస్తారు. [3] [4]
పండుగలు
[మార్చు]సంవత్సరం పొడవునా అనేక పండుగలు ఉన్నాయి, వేలాది మంది ఈ గొప్ప వేడుకలకు హాజరవుతారు. వాటిలో అత్యంత ముఖ్యమైన పండుగలను దశయిన్ అని పిలుస్తారు, ఇది సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో జరుగుతుంది (సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం).
రవాణా
[మార్చు]భద్రకాళి ఆలయానికి స్థానిక ప్రభుత్వ బస్సులు మహేంద్రపుల్, ఖౌఖోలా నుండి అందుబాటులో ఉన్నాయి. స్థానిక టాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. [5]
చిత్ర మాలిక
[మార్చు]-
గణేష్ దేవాలయం
-
హనుమాన్ విగ్రహం
-
భద్రకాళి దేవాలయ ముఖద్వారం.
మూలాలు
[మార్చు]- ↑ Thapa, U. S. (1971). Know Nepal and Nepali (in ఇంగ్లీష్). Shail Thapa.
- ↑ Sangal, Naresh Chandra (1998). Glimpses of Nepal: A Brief Compilation of History, Culture, Language, Tradition, Religious Places, Festivals, Mountains, Revers, Safari Parks, Cities, Kathmandu University, and Other Important Informations for Holiday-makers (in ఇంగ్లీష్). APH Publishing. ISBN 978-81-7024-962-7.
- ↑ "Temples And Monuments – Pokhara Tourism Council" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-10.
- ↑ Kandel, Govinda (2011-06-23). "Heritage of Kaski: Religious area of kaski". Heritage of Kaski. Retrieved 2021-12-10.
- ↑ "pokharahotel-link.com - pokharahotel link Resources and Information". www.pokharahotel-link.com. Archived from the original on 2021-12-07. Retrieved 2021-12-10.