Coordinates: 26°32′27″N 86°44′51″E / 26.5407°N 86.7475°E / 26.5407; 86.7475

భగవతి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవతి దేవాలయం
ఛండీ భగవతి దేవాలయం
భగవతి దేవాలయం
భగవతి దేవాలయం
భగవతి దేవాలయం is located in Nepal
భగవతి దేవాలయం
నేపాల్ లోని భగవతి దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు26°32′27″N 86°44′51″E / 26.5407°N 86.7475°E / 26.5407; 86.7475
దేశంనేపాల్
రాష్ట్రంసాగరమాత
జిల్లాసప్తరి జిల్లా
ప్రదేశంరాజ్‌బిరాజ్‌
ఎత్తు76 m (249 ft)
సంస్కృతి
దైవంభగవతి దేవి
ముఖ్యమైన పర్వాలుదసరా
వాస్తుశైలి
దేవాలయాల సంఖ్య1
కట్టడాల సంఖ్య7
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1925[1]

భగవతి దేవాలయం (చండీ భగవతి దేవాలయం) నేపాల్ దేశం సప్తరిలోని రాజ్‌బీరాజ్ నడిబొడ్డున ఉన్న హిందూ దేవాలయం. ఈ దేవాలయంలోని భగవతి దేవి నేపాలీ, భారతీయ యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బడా దశాహ్న సమయంలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. దసరా సమయంలో ఇక్కడ కొన్ని వేల మేకలను బలి ఇస్తారు.[2] ఇక్కడి ప్రాగణంలో హనుమాన్ దేవాలయం, శివాలయం, బిశ్వకర్మ దేవాలయం వంటి అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి.[3] ఈ దేవాలయం వెనకవైపు భగవతి పోఖారి అనే ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఛట్ పూజ నిర్వహించబడుతోంది.

చరిత్ర[మార్చు]

గొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగివున్న ఈ దేవాలయం 1925లో నిర్మించబడింది.

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం నేపాల్, భారతదేశం, ఇతర దేశాల నుండి వేలాది మంది యాత్రికులు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించి భగవతీ దేవిని ఆరాధిస్తుంటారు. దసరా, తీహార్ పండుగల సమయంలో ఎక్కువమంది భక్తులు వస్తుంటారు.

మూలాలు[మార్చు]

  1. Dāsa, Harikāntalāla (2003). Saptarī Jillākā pramukha sāṃskr̥tika sthalaharu : eka adhyayana : laghuanusandhānakārya (1. saṃskaraṇa. ed.). Kāṭhamāḍauṃ: Nepāla Rājakīya Prajñā-Pratishṭhāna. p. 120. ISBN 9789993350569.
  2. "Bhagwati Temple". Boss Nepal. Archived from the original on 2021-11-29. Retrieved 2021-11-29.
  3. "नगरका अधिकांश मन्दिर जीर्ण". Rajdhaani. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2015.

వెలుపలి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.