Coordinates: 28°53′N 81°37′E / 28.88°N 81.61°E / 28.88; 81.61

ధులేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధులేశ్వర్
ధులేశ్వర్ ఆలయం
స్థానం
దేశం: Nepal
రాష్ట్రం:భేరి
జిల్లా:డైలేఖ్
ప్రదేశం:బదలాంజీ, దుల్లు మున్సిపాలిటీ
ఎత్తు:544 m (1,785 ft)
భౌగోళికాంశాలు:28°53′N 81°37′E / 28.88°N 81.61°E / 28.88; 81.61
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:పగోడా శైలి
శాసనాలు:శాసనాలు

ధూలేశ్వర్ (నేపాలీ: ) నేపాల్‌లోని కర్నాలీ ప్రదేశ్ రాష్ట్రంలో గల దైలేఖ్ జిల్లాలో ఉన్న ఒక ధార్మిక ప్రదేశం. ఇది పంచకోషి అని పిలువబడే ఐదు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ స్థలం దుల్లు మున్సిపాలిటీలోని బదలాంజీ గ్రామంలో ఉంది.[1]

ఈ ఆలయం కింది భాగం నుండి ఎల్లప్పుడూ దుమ్ము పైకి వస్తూ ఉంటుంది, శాస్త్రవేత్తలు దీనిని అధ్యయనం చేసి ఇది అగ్నిపర్వత కేంద్రం అని నిర్ధారించారు. కానీ మత విశ్వాసాలు దీనికి దైవిక శక్తిగా పేరు పెట్టాయి. పంచకోషిలోని ధూలేశ్వర్ దేవాలయం, పాదుకాస్థాన్, శిర్స్థాన్, నాభిస్థాన్, కోటిలస్థాన్‌ల కంటే అత్యంత పవిత్రమైందిగా ప్రసిద్ధి చెందింది.[2]

పురాణం[మార్చు]

అగ్ని పురాణం, వైశ్వానర పురాణం ప్రకారం, కోటిలస్థాన్ పంచకోశి పరిధిలోకి రాదు. కోటిలస్థాన్ ఒక శక్తి పీఠం. పంచకోషి ప్రకారం, ఈ ప్రాంతంలో తీర్థయాత్ర చేయాలంటే తప్పనిసరిగా పాదుకాస్థాన్, శిర్స్థాన్, నాభిస్థాన్ నుండి మొదలు పెట్టి చివరకు ధూలేశ్వర్ వద్ద ఒక రాత్రి బసతో ముగించాలి. వైశ్వానర పురాణం లోని స్నో ఫెయిరీ ఎపిసోడ్‌ ఈ ప్రదేశాన్ని ఫ్లేమ్ మౌంటైన్ గా, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ల కంటే ఎక్కువ పవిత్రమైనదిగా సూచించింది.[3]

సంబంధిత నిర్మాణాలు[మార్చు]

ఈ ఆలయానికి సమీపంలో భైరవ్ ఆలయం, మస్తా ఆలయం, శివాలయం ఉన్నాయి. ఇతర నిర్మాణాలలో ఫ్లేమ్ హౌస్, గాడి హౌస్ ఉన్నాయి.[4]

ఫ్లేమ్ హౌస్‌లో నేపాలీలో వ్రాయబడిన రెండు రాతి శాసనాలు ఉన్నాయి. కానీ దీనిపై రచనలు సులభంగా కనిపించవు. క్రీస్తుపూర్వం 1748లో ఆలయాన్ని స్థాపించిన అప్పటి రాజు రాజేంద్ర బిక్రమ్ షా గురించి ఇందులో ప్రస్తావించారు. మరొకటి 1778 BCలో ఆలయ పైకప్పును నిర్మించిన కల్నల్ కుల్మాన్ సింగ్ బాస్నెట్ గురించి ప్రస్తావించారు. నేపాల్ అంతర్యుద్ధం సమయంలో చాలా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, అనేక విగ్రహాలు కనుమరుగయ్యాయి. ఫ్లేమ్ హౌస్ నుండి నరపతేశ్వర్ మహాదేవ్, ఇతర పురాతన విగ్రహాలను హిందూ వ్యతిరేక మూకలు దోచుకున్నాయి.[5]

ఆచారం[మార్చు]

ధూలేశ్వర్ దిగువన ఉన్న బంగంగా, బ్రహ్మకుండ్‌ లలో స్నానం చేయడం ఇక్కడి సాంప్రదాయం. బాలేశ్వర్ ఆలయంలో అంత్యక్రియలు ప్రజలు నిర్వహిస్తారు. దులంగే కొండ, బదలాంజీ నాగ్ స్నేక్ అనేవి ఇక్కడి ఇతర పూజా స్థలాలు.

పవిత్రంగా భగవంతుడిని ఆరాధించే సమయంలో, ధూళితో కూడిన గాలి (ధూలి) భూమి కింద నుండి వస్తుంది, అందుకే ఇక్కడి ప్రధాన దైవాన్ని "ధూలేశ్వర్", (శివుని అవతారం దుమ్ము) అని పిలుస్తారు. ఈ ఆలయం మధ్యలో ఒక శివలింగం ఉంది. శివలింగానికి ఒకవైపు శివుని వాహనం అయిన నంది (నందీశ్వరుడు), మరోవైపు సింహం ఉన్నాయి. దానితో పాటు కాలభైరవుడు, బాల భైరవుడు, బతుక్ భారవ్ విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. జంతువులను బలి ఇవ్వడం ద్వారా కాలభైరవుడిని పూజిస్తారు, మిగిలిన ఇద్దరిని పాలతో పూజిస్తారు. మస్తా దేవుడి విగ్రహాన్ని కూడా పాలతో పూజిస్తారు. ఎక్కువగా, వీటిని చైతే దశైన్, బడా దశైన్ (నేపాల్లో జరువుకునే పండుగ రోజులు) సమయంలో పూజిస్తారు. సాధారణ రోజుల్లో, రోజువారీ పూజలు బ్రహ్మచారులు, సాధువుల చేతుల మీదుగా జరుగుతాయి.

పురాణ కథ[మార్చు]

తన తండ్రి తన భర్తను అవమానించాడని శివుని భార్య సతిదేవి పవిత్ర జ్వాల మీద దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానంతరం, శివుడు ఆమె మృతదేహాన్ని మోస్తూ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. ఈ సంఘటన వలన కైలాస పర్వతం ఖాళీగా ఉండటం చూసి, ఇతర దేవతలు సృష్టిని సజావుగా నడపలేకపోయినందున, విష్ణు భగవానుడు ఆమె శరీరాన్ని క్షీణింపజేసే బ్యాక్టీరియాను సృష్టించాడు. సతీదేవి క్షీణించిన శరీర భాగాలు భూమిపై ఎక్కడ పడితే అక్కడ శక్తి పీఠాలు ఉద్భవించాయి.

ధూళేశ్వర్ వద్ద, సతీ శరీరం ధూళిగా మారింది, కాబట్టి ఈ ప్రదేశాన్ని ధూళేశ్వర్ అని పిలుస్తారు, ఇది శివుడి అవతారం.

సెయింట్ నదిబన్ శివలింగాన్ని కనుగొనే వరకు ఈ ప్రదేశం ప్రాచుర్యంలోకి రాలేదు. అతను ఒంటరిగా, దాగి పూజించడం ప్రారంభించాడు. ప్రజలు అతనిపై ఫిర్యాదు చేసినందున ఖాట్మండు నుండి సైనికులు అతనిని అరెస్టు చేయడానికి వచ్చారు. సైనికులు అతన్ని ఖాట్మండుకు తీసుకెళ్తుండగా, అతను తరువాత వస్తానని చెప్పి తిరిగి వచ్చి సైనికుల కంటే ముందుగా రాజభవనానికి చేరుకున్నాడు. అప్పటి ఖాట్మండు రాజు అతనిని పరీక్షించి, అతని ధ్యాన శక్తిని, పూజా స్థలాన్ని గ్రహించాడు. నదిబాన్ సంతానం ఈ ఆలయానికి సాధువులుగా, పూజారులుగా మారారు. వారి సమాధులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి.[5]

మూలాలు[మార్చు]

  1. Dolma, Tenzin. "Heritage of Surkhet, Dailekh at first glance". My City (in ఇంగ్లీష్). Retrieved 2019-03-12.
  2. "Inseconline » Districts » Dailekh". inseconline.org. Retrieved 2019-03-12.
  3. "History". Bheri Samaj UK (in ఇంగ్లీష్). Archived from the original on 2018-08-08. Retrieved 2019-03-16.
  4. "Thousand years old heritages in Dailekh await conservation and promotion". Integration Through Media ....! (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-31. Archived from the original on 2021-11-29. Retrieved 2019-03-12.
  5. 5.0 5.1 के.सी. (पोखरेल), विश्व. Kittambam. 1st Edition Page 103-105.

వెలుపలి లంకెలు[మార్చు]