మౌలా కాళికా
మౌలా కాళికా దేవాలయం | |
---|---|
मौलाकालिका मन्दिर | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 27°43′39″N 84°24′32″E / 27.7275°N 84.4088°E |
దేశం | నేపాల్ |
జిల్లా | నవాల్‌పూర్ జిల్లా |
స్థలం | గైందకోట్ |
ఎత్తు | 561 మీ. (1,841 అ.) |
సంస్కృతి | |
దైవం | కాళికా దేవి |
చరిత్ర, నిర్వహణ | |
వెబ్‌సైట్ | www.maulakalika.org.np |
మౌలా కాళికా (నేపాలీ: मौलाकालिका मन्दिर) నేపాల్‌లోని గండకి ప్రావిన్స్‌లో గల నవాల్‌పూర్ జిల్లాలోని గైందకోట్ పట్టణంలో గల కాళికా దేవి ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయం నేపాల్‌లోని గైందకోట్ మునిసిపాలిటీలో ఉన్న చాలా ప్రసిద్ధ, అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశం. ఇది గైందకోట్‌లోని నారాయణి నదికి ఉత్తరాన ఉన్న మౌలాదాదా లేదా మౌలా కొండపై ఉంది. మౌలా కాళికా ఆలయం సముద్ర మట్టానికి 561 మీటర్ల (1,841 అడుగులు) ఎత్తులో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]చారిత్రాత్మకంగా, 16వ శతాబ్దంలో పాల్ప రాజు కాళికా దేవత పేరు మీద ఒక స్థలాన్ని ("మౌలా") సృష్టించాడు, ఆ తర్వాత ఈ పర్వతానికి మౌలా కొండ అని పేరు వచ్చింది. హిందూ పురాణాలలో, ఈ దేవతను కాళి దేవత లేదా కాళికా లేదా దుర్గా అని కూడా పిలుస్తారు, ఈ దేవతను శక్తికి ప్రతీకగా కొలుస్తారు. ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలు అనేక సార్లు పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరణలో భాగంగానే ఎక్కువ మంది సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి తగిన స్థలం ఏర్పాటు చేయబడింది. జంతువులను బలి ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఆలయ నిర్వాహకులు తాజాగా నిర్ణయించారు.
ప్రత్యేక సంఘటనలు
[మార్చు]గైందకోట్‌లోని స్థానిక ప్రజలు మౌలా కాళికాను చాలా శతాబ్దాలుగా పూజిస్తున్నారు, ఇది ఇటీవల విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుత ఆలయం 1990ల ప్రారంభంలో నిర్మించబడింది.
నేపాల్, పొరుగు దేశాల నుండి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు మౌలా కాళికాను సందర్శిస్తారు. సెప్టెంబరు-అక్టోబర్, మార్చి-ఏప్రిల్‌లలో దశైన్ లేదా దసరా ఉత్సవాల పండుగల సందర్భంలో ఈ ఆలయాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు.
నేపాల్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రామ్ బరన్ యాదవ్, నేపాల్ ఆర్థిక మంత్రి రామ్ సరన్ మహత్‌తో సహా మాజీ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఆలయాన్ని సందర్శించారు. భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్‌దేవ్ 2011లో ఆలయాన్ని సందర్శించాడు. నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బిధ్యా దేవి భండారీ 20 ఏప్రిల్ 2016న ఆలయాన్ని సందర్శించి ఆలయాల నివాస సౌకర్యాలను ప్రారంభించింది.
సందర్శన
[మార్చు]గైందకోట్ సమీపంలోని నారాయణగర్, భరత్‌పూర్, చిట్వాన్ పట్టణాల నుండి వచ్చే సాధారణ సందర్శకులు తమ విశ్రాంతి సమయాన్ని వినియోగించుకోడానికి, విశాలమైన అరణ్య దృశ్యాలను వీక్షించడానికి, 2000 మీటర్ల పొడవునా నడవడం వంటి ఉత్తేజకరమైన సాహసంతో ఈ స్థలాన్ని ఒక గమ్యస్థానంగా ఎంచుకుంటారు. సందర్శకులు నారాయణి నది, గైందకోట్ పట్టణం, కొండకు దక్షిణాన ఉన్న చిత్వాన్ లోయ విశాల దృశ్యాలను చూసి ఆనందిస్తారు.
ప్రస్తుతం చిత్వాన్ నేషనల్ పార్క్, లుంబినిని సందర్శించే పర్యాటకులు తరచుగా గైండకోట్‌లోని మౌలా కాళికాను వారి ప్రయాణంలో భాగంగా సందర్శిస్తారు. మౌలా కొండ కింది నుండి పైకి వెళ్ళడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. దారిలో ఆహారం, నీరు, ఫలహారాలు అందుబాటులో ఉంటాయి
నీటి వసతులు
[మార్చు]స్వయంచాలక హైడ్రాలిక్ పరికరం నిరంతరం నీటిని శిఖరంపై ఉన్న ఆలయానికి పంపుతుంది. పరికరాలు 500 మీటర్ల దిగువన ఉత్తర వాలులో వ్యవస్థాపించబడ్డాయి. నీటి సరఫరా నిరంతరం పర్యవేక్షించబడుతుంది.
బాహ్య లింకులు
[మార్చు]- Maula Kalika Temple Official Homepage in Nepali Language
- Maula Kalika Temple background in Nepali Language
మూలాలు
[మార్చు]- ↑ "१ हजार ८ सय ८२ खुड्किला चढेर पुगिने मौला कालिका मन्दिर जसले तपाईको सारा कष्ट नास गर्नेछिन ! भिडियो हेर्नुहोस र दर्शन स्वरुप ॐ लेखी सेयर गरौ". हिमालय दैनिक. Archived from the original on 2019-06-20. Retrieved 2021-11-30.