Jump to content

సూర్య వినాయక దేవాలయం

వికీపీడియా నుండి
సూర్య వినాయక ఆలయం
सुर्यविनायक मन्दिर
సూర్య వినాయక ఆలయం
సూర్య వినాయక ఆలయం
భౌగోళికం
దేశంనేపాల్
స్థలంభక్తపూర్ జిల్లా

సూర్యవినాయక దేవాలయం నేపాల్‌లోని ఒక హిందూ దేవాలయం.ఇది నేపాల్‌లోని భక్తపూర్ జిల్లాలో ఉంది . ఈ ఆలయం హిందూ దేవుడు గణేశుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఒక చారిత్రక, సాంస్కృతిక స్మారక చిహ్నం, పర్యాటక కేంద్రం. సూర్యవినాయక దేవాలయం ఖాట్మండు లోయలో ఉన్న నాలుగు ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఒకటి.ఈ ఆలయాన్ని ఉదయించే సూర్యుని ఆలయం అని కూడా అంటారు.[1]

ఆలయ స్థానం

[మార్చు]

ఈ ఆలయం నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ ఆలయానికి  అడవిలో నుండి  కాలినడకన మాత్రమే చేరుకోవచ్చు. ఈ ఆలయం సిపాడోల్ లో ఉంది.ఇది ఒక మంచి ప్రదేశం. ఈ ప్రదేశం  చాలా పవిత్రమయింది. ఇక్కడి వినాయక స్వామిని పూజిస్తే తమ బాధలు అన్నీతొలగిపోతాయి అని  ప్రజల నమ్మకం.[2]

చరిత్ర

[మార్చు]

ఈ ఆలయం నిజానికి 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు.ఈ ఆలయం లిచ్ఛవి రాజు ‘విష్ణు దేవ్ బర్మా’ కాలంలో నిర్మించబడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "SuryavinayakTemple".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "commons.wikimedia.org/wiki/File:Suryavinayak_Temple.jpg".{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Suryavinayak Temple, Nepal · History, Info, Timing and videos 2021". All World Temple (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-11. Retrieved 2021-12-02.

వెలుపలి లింకులు