Jump to content

నీలం సంజీవరెడ్డి మొదటి మంత్రివర్గం

వికీపీడియా నుండి

నీలం సంజీవరెడ్డి, సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. సంజీవ రెడ్డి తొలి మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్ అవతరణ (1956, నవంబరు 1) నుండి 1960, జనవరి 11 వరకు పదవిలో ఉన్నది.

మంత్రివర్గం

[మార్చు]
వ.సంఖ్య మంత్రి పేరు శాఖ నియోజకవర్గం పార్టీ
1. నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, అఖిలభారత సేవలు, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, ఆరోగ్యం, వైద్య శాఖ[1] శ్రీకాళహస్తి కాంగ్రేసు
2. కె.వి.రంగారెడ్డి రెవిన్యూ, రిజిస్ట్రేషన్, భూసంస్కరణలు షాబాద్ కాంగ్రేసు
3. జె.వి.నరసింగరావు నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, ప్రజాపనులు, రహదారులు, ఉపశమన కార్యక్రమాలు, పునరావాస పనులు బేగం బజారు కాంగ్రేసు
4. దామోదరం సంజీవయ్య శ్రామిక శాఖ, స్థానిక పాలన, ఎక్సైజు ఎమ్మిగనూరు కాంగ్రేసు
5. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయం, అటవీ శాఖ, పశుసంవర్ధన శాఖ, వాయల్పాడు కాంగ్రేసు
6. యస్.బి.పి. పట్టాభిరామారావు విద్య, సామాజిక సంక్షేమం, సమాచార శాఖ, ప్రచార శాఖ పామర్రు కాంగ్రేసు
7. మెహదీ నవాజ్ జంగ్ సహకార శాఖ, ఆవాస శాఖ జూబ్లీహిల్స్ కాంగ్రేసు
8. గ్రంధి వెంకటరెడ్డి నాయుడు న్యాయ శాఖ, దిగువ న్యాయస్థానాలు, కారాగారాలు నర్సాపురం కాంగ్రేసు
9. కాసు బ్రహ్మానందరెడ్డి ఆర్ధిక శాఖ, ప్రణాళికా శాఖ ఫిరంగిపురం కాంగ్రేసు
10. ముందుముల నరసింగరావు గృహమంత్రి కొల్లాపూర్ కాంగ్రేసు
11. అనగాని భగవంతరావు దేవదాయ, ధర్మాదాయ శాఖ, చిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కుచినపూడి కాంగ్రేసు

మూలాలు

[మార్చు]
  1. India Reference Annual. The Publication division. p. 400. Retrieved 3 August 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]