సబితా ఇంద్రారెడ్డి

వికీపీడియా నుండి
(పట్టోళ్ళ సబితా ఇంద్రారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి


విద్యాశాఖ మంత్రి
పదవీ కాలము
8 సెప్టెంబర్ 2019-
నియోజకవర్గము మహేశ్వరం (2009-2014, 2018-ప్రస్తుతం)
చేవెళ్ళ (2000 నుంచి 2009)

వ్యక్తిగత వివరాలు

జననం 1963 మే 5
కోటబాసుపల్లి, వికారాబాదు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము ముగ్గురు కుమారులు
కార్తీక్ రెడ్డి
నివాసము హైదరాబాద్
మతం హిందూ మతం

పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. రంగారెడ్డి జిల్లా రాజకీయ నేతలలో ముఖ్యురాలు. 2000, 2004లలో చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 2009, 2018లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది.[1][2]

జననం[మార్చు]

వికారాబాదు జిల్లా, కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది.[3]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

భర్త, మాజీ మంత్రి పి. ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉపఎన్నికలలో 2000లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలోకి ప్రవేశించింది. 2004లో కూడా చేవెళ్ళ నుంచి నెగ్గిన సబిత నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గంను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. 2004-09 కాలంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి, 2009 వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది, భారత దేశంలోనే తొలి మహిళ హోం మంత్రి గా చరిత్ర సృష్టించింది.[4]

2014లో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని అధిష్టానం సూచించడంతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై గెలుపొందింది. 2019, మార్చి 14న టిఆర్ఎస్ పార్టీలో చేరింది.[5][6] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. ఆమెకు విద్యాశాఖ ను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళ మంత్రిగా చరిత్ర సృష్టించింది.[7][8][9][10]

కేసులు[మార్చు]

దాల్మియా సిమెంటు కేసులో సబిత పేరును సీబీఐ చార్జిషీటులో ఏ4గా పేర్కొనడంతో రాజీనామా చేయగా 2013 మే 25న గవర్నర్ రాజీనామా ఆమోదించారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019. CS1 maint: discouraged parameter (link)
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019. CS1 maint: discouraged parameter (link)
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 27-05-2009
  5. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019. CS1 maint: discouraged parameter (link)
  6. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019. CS1 maint: discouraged parameter (link)
  7. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019. CS1 maint: discouraged parameter (link)
  8. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019. CS1 maint: discouraged parameter (link)
  9. సాక్షి, పాలిటిక్స్ (9 September 2019). "మూడోసారి మంత్రిగా.. సబితా ఇంద్రారెడ్డి". Sakshi. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019. CS1 maint: discouraged parameter (link)
  10. సాక్షి, తెలంగాణ (11 September 2019). "ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి: మంత్రి". Sakshi. Archived from the original on 11 September 2019. Retrieved 11 September 2019. CS1 maint: discouraged parameter (link)