Jump to content

పరువు ప్రతిష్ఠ (1963 సినిమా)

వికీపీడియా నుండి
పరువు ప్రతిష్ఠ
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం మానాపురం అప్పారావు
నిర్మాణం జూపూడి వెంకటేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి ,
చలం,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కన్నాంబ,
సుజాత,
జగ్గారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ వోల్టా ప్రొడక్షన్స్
భాష తెలుగు

పరువు ప్రతిష్ఠ మానాపురం అప్పారావు దర్శకత్వంలో జూపూడి వెంకటేశ్వరరావు నిర్మాతగా ఎన్టీ రామారావు, అంజలీదేవి ప్రధానపాత్రల్లో నటించిన 1963నాటి తెలుగు చలన చిత్రం.

నిర్మాణం

[మార్చు]

నటీనటుల ఎంపిక

[మార్చు]

తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా ప్రఖ్యాతిపొందిన ఘట్టమనేని కృష్ణకు నటునిగా ఇది మూడవ చిత్రం. పరువు ప్రతిష్ఠలో ఆయన చిన్న పాత్ర పోషించారు.[1]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ ఈ సిగ్గు - ఘంటసాల, సుశీల, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
  2. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ అంతులేని చీకటిలోన - పి.సుశీల, రచన: శ్రీ శ్రీ
  3. ఇలా ఇలా జీవితం పోతే పోనీ ఈ క్షణం స్వర్గమను నరకమను - ఘంటసాల, రచన: రాజశ్రీ
  4. ఏమంటేవా బొమ్మా ఓ రమణీ ముద్దులగుమ్మా కులాసకు - ఘంటసాల, రచన:కొసరాజు
  5. కనులుండి చూడలేను గళముండి పాడలేను మనసుండి మంటలందు - సుశీల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  6. ప్రభూ గిరిధారి శౌరీ రావయా నను కరుణించి వరములీయ రావయా - సుశీల, రచన: రాజశ్రీ
  7. విను విను విను నిను వదలను నిరాశ చేయకు - ఘంటసాల,సుశీల, రచన: ఆరుద్ర.
  8. అలవైకుంఠ పురములో నగరిలో(,మహా భాగవతము నుండి) గానం పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. పులగం, చిన్నారాయణ. "50 ఏళ్ళ తేనెమనసులు". సాక్షి. Retrieved 11 October 2015.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)