Jump to content

పర్వతాల శివాలయం (పర్వతగిరి)

వికీపీడియా నుండి
పర్వతాల శివాలయం (పర్వతగిరి)
పర్వతాల శివాలయం
పర్వతాల శివాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:వరంగల్ జిల్లా
ప్రదేశం:పర్వతగిరి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివలింగం
ప్రధాన దేవత:పార్వతి

పర్వతాల శివాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, పర్వతగిరి పట్టణంలోని హిందూ దేవాలయం.[1]

చరిత్ర

[మార్చు]

రాణిరుద్రమ దేవి మనవడు ప్రతాపరుద్రుడి పేరుమీదుగా ఈ ప్రాంతానికి సమీపంలోని పర్వతాల గుట్ట కింద ప్రతాప రుద్రగిరి గ్రామం ఏర్పాటుచేయబడింది. ప్రజల అవసరాలకు చెరువు, కుంటలతోపాటు శివాలయాన్ని కూడా నిర్మించారు. అలా సుమారు 800 ఏళ్ళ కిందట కాకతీయుల కాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది.[2]

ప్రతిష్టాపన మహోత్సవం

[మార్చు]

దాదాపు 850 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ శివాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలకుపైగా ఖర్చుచేసి దేవాలయాన్ని నిర్మించింది.[3] దేవాదాయశాఖ నుంచి 70 లక్షల రూపాయల నిధులతో గుట్టమీద దేవాలయానికి కావాల్సిన విద్యుత్తు, మంచినీటి వసతి, రవాణా, భక్తుల సదుపాయాల ఏర్పాట్లు పూర్తిచేశారు. 2022 డిసెంబరు 5న ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమం జరిగింది.[4]

2023 జనవరి 26 నుండి 28 వరకు పర్వాతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు కల్లెడ గ్రామం నుంచి ట్రాక్టర్‌లో శివలింగం, ఉత్సవమూర్తులను ఊరేగించగా, గ్రామస్తులు కలశాలతో విగ్రహాలకు జలాభిషేకం, గోపూజ, 108 బిందెలతో జలాభిషేకం, అంకురార్పణ, హోమాలు నిర్వహించారు.[5] రెండవ రోజు సుప్రభాత సేవ, కుంకుమార్చన, అష్టలక్ష్మీ పూజలు నిర్వహించబడ్డాయి.

మూడవ రోజు ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా రుద్ర హోమం, దేవాలయ సంస్కారం, యంత్ర స్థాపన, విగ్రహాలు, నందీశ్వర శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు, మహా అన్న సంతర్పణ, కల్యాణం, పూర్ణాహుతి, రెండు గంటలకు ఒకసారి 200మంది పాఠశాల విద్యార్థులతో వందేమాతర గీతాలాపన మొదలైనవి జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్‌ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, నన్నపనేని నరేందర్, వొడితల సతీశ్‌కుమార్, బానోత్ శంకర్‌నాయక్‌, తాటికొండ రాజయ్య, వరంగల్ నగర మేయర్‌ గుండు సుధారాణి, టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ వై. సతీశ్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.[6]

సాంస్కృతిక కార్యక్రమం

[మార్చు]

ఈ ఉత్సవాలలో సినీ నేపథ్య గాయని సునీత బృందంచే సంగీత విభావరి, వెంపటి శ్రావణి బృందంచే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడ్డాయి.

మూలాలు

[మార్చు]
  1. "పర్వతమెక్కిన శివయ్య". EENADU. 2023-01-29. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.
  2. "కాకతీయ వైభవం ఉట్టిపడేలా శివాలయం పునఃప్రతిష్ఠ". EENADU. 2023-01-25. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.
  3. telugu, NT News (2023-01-28). "ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు". www.ntnews.com. Archived from the original on 2023-01-28. Retrieved 2023-01-29.
  4. telugu, NT News (2022-12-05). "పర్వతగిరి శివాలయంలో ధ్వజారోహణ.. పాల్గొన్న మంత్రి దయాకర్‌రావు". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-06.
  5. ABN (2023-01-27). "ప్రారంభమైన శివాలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-29.
  6. telugu, NT News (2023-01-29). "పర్వతాల శివాలయం అద్భుతం". www.ntnews.com. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.