Jump to content

పాఠశాల విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)

వికీపీడియా నుండి

పాఠశాల విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్) ప్రాథమిక స్ధాయి పూర్తిగా, మాధ్యమిక స్థాయి పాక్షికంగా అనగా 1 నుండి 10 వ తరగతుల వరకు విద్యవ్యవస్థని నిర్వహిస్తుంది.[1] ఇది విద్యార్థులందరికీ మెరుగైన ప్రవేశం కల్పించడం, నమోదు, నిలుపుదలని ప్రోత్సహించడం, అందరికీ సమాన విద్య అవకాశాలను, నాణ్యత, పాఠశాల మౌలిక సదుపాయాలను అందించడం ధ్యేయంగా పనిచేస్తుంది.

ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు మొత్తంగా 62,182 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం విద్యార్థుల నమోదు 69,91,634. మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 2,86,311. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు 100% ఆధార్ అనుసంధానం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను' ప్రారంభించింది. 'విందాం నేర్చుకుందాం' (రేడియో పాఠాలు), 'మీనా ప్రపంచం' (రేడియో ప్రోగ్రామ్), వీడియో పాఠాలు లాంటి దృశ్య శ్రవణ బోధనా పద్ధతుల ద్వారా విద్య నేర్పడం జరుగుతున్నది. డిజిటలీకరణలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వేలిముద్రల ద్వారా నమోదు చేయబడుతున్నది.

'బడి పిలుస్తోంది' అనే ప్రచార కార్యక్రమం ద్వారా విద్య అనేది ప్రతి బిడ్డకు హక్కు అని ప్రజలలో అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరూ ఎనిమిదో తరగతి వరకు ప్రాథమిక చక్రాన్ని పూర్తి చేసేటట్లుగాచేయడం తద్వారా ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయం ఏర్పాటుకు ఈ శాఖ దోహదపడుతుంది.

బయటిలింకులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. "Commissionerate of School Education". Archived from the original on 2019-12-14. Retrieved 2020-01-16.