పెద్దపల్లి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దపల్లి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాపెద్దపల్లి

పెద్దపల్లి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. పెద్దపల్లి జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం పెద్దపల్లిలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం, పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన[మార్చు]

పెద్దపల్లి డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం పెద్దపల్లి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 పెద్దపల్లి మండలం 11 రెవెన్యూ గ్రామాలు
2 ఓదెల మండలం 21 రెవెన్యూ గ్రామాలు
3 సుల్తానాబాద్ మండలం 7 రెవెన్యూ గ్రామాలు
4 జూలపల్లి మండలం 9 రెవెన్యూ గ్రామాలు
5 ఎలిగేడు మండలం 23 రెవెన్యూ గ్రామాలు
6 ధర్మారం మండలం 16 రెవెన్యూ గ్రామాలు
7 రామగుండం మండలం 8 రెవెన్యూ గ్రామాలు
8 అంతర్గాం మండలం 14 రెవెన్యూ గ్రామాలు
9 పాలకుర్తి మండలం 13 రెవెన్యూ గ్రామాలు
10 శ్రీరాంపూర్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-04.
  3. "Revenue Divisions | PEDDAPALLI DISTRICT | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-11. Retrieved 2022-04-04.
  4. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-04-04. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)