పెర్‌కాసిన్ వెల్డింగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెర్‌కాసిన్ (percussion) అనునది ఒకరకమైన రెసిస్టన్సు వెల్డింగు. రెసిస్టన్సు/నిరోధకత అనునది మూలకము లకున్న ఒక భౌతిక లక్షణం లేదా స్వభావం.లోహంలన్నియు విద్యుత్తు యొక్క ఎలక్ట్రానుల ప్రవాహాన్ని తమకుండా ప్రవహించుటకు వీలుగా స్వేచ్ఛాఎలక్ట్రాను లను కలిగివుండుట వలన విద్యుత్తును (అవేశిత పూరక ఎలక్ట్రానులు) తమగుండా ప్రవహింపనిచ్చును. అయితే అన్ని లోహాలు అంతో యింతో కొంత విద్యుత్తు వాహక నిరోధ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి.ఈ విద్యుత్తు వాహక నిరొధక తత్వం ప్రతిలోహానికి భిన్నంగా వుంటుంది.అలాగే ఈ విద్యుత్తు ప్రవాహ నిరోధకలక్షణం వాహక లోహం యొక్క మందం (వ్యాసం) , ప్రవాఃహక విద్యుత్తు ఛాలక బలపరిమాణంపై ఆధార పడివుంటుంది. అలాగే వాహక వస్తువు (లోహం) యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలధి దాని ప్రవాహా నిరోధకత పెరుగు తుంది.

పెర్‌కాసిన్‌ అనుపదానికి తెలుగు అర్థం సమాఘాతం (ఆంధ్ర భారతి నిఘంటువు).కావున దీనినీ సమాఘాత అతుకు ప్రక్రియఅని అనవచ్చును.

పెర్‌కాసిన్‌ వెల్డింగ్ నిర్వచనం : పెర్‌కాసిన్‌ వెల్డింగు ఒక విధంగా ఫ్లాష్ బట్ వెల్డింగు వంటిదే. ప్లాష్ వెల్డింగు కన్న కాస్తబలంగా, వేగంగా వత్తిడిని అతుకవలసిన లోహ అంచులమీద ప్రేరెపించబడును. విద్యుత్తు ప్రవాహాన్ని కలుగచేసినప్పుడు అతుకవలసిన రెండు లోహ తునుకలమధ్య నున్నఖాళిలో(1.5మి.మీ.కన్నతక్కువ)వున్న గాలిలో విద్యుత్తు ఏర్పడునట్లు చేసి, బలంగా ఒకలోహా తునకను మరోలోహ తునకకు బలంగా తాటింఛి అతుకు ప్రక్రియ.[1] రెండు లోహ అంచుల మధ్య బలమైన విద్యుత్తు ఎలక్ట్రానుల ప్రవాహం కారణంగా చివరల మధ్య చిన్నప్రకాశవంతమైన ఎలక్ట్రాను ప్రవాహ చాపం కారణంగా లోహ అంచులు/చివరలు వేడెక్కును.ఈ సమయంలో కదిలే లోహా అంచును ఒకేసారి గట్టిగా రెండో లోహాంచును తాటించడం వలన రెండు లోహ అం చుల వద్ద వెడెక్కిన లోహాభాగాలు, కరగి మేళనం చెందటం వలన అతుకు ఏర్పడును.

పెర్‌కాసిన్‌ వెల్డింగు పరికరము

[మార్చు]

పెర్‌కాసిన్‌ ప్రక్రియ విధానంలో వెల్డింగు చెయ్యుపరికరంఫ్లాష్ లేదాబట్ వెల్డింగు చెయ్యునట్టి పరికరం వంటిదే.రెండు అతుకు చివరల మధ్య తగినంత స్పార్కు (మెరుపు) ను తక్కువ సమయంలో పుట్టించు విధంగా విద్యుత్తును ప్రవహింపచెయ్యగల విద్యుత్తు ట్రాన్సుఫార్మరును వెల్డింగు యంత్రానికి అనుసంధానం చెయ్యబడి వుండును.అతుకుటకు ప్రత్యేకంగా ఎలక్ట్రోడులు వుండవు.అతుకబడు లోహ పట్టికల/పలకల అంచులు లేదా చివరలే ఎలక్ట్రోడులుగా పనిచేయును.

పెర్‌కాసిన్‌ వెల్డింగు విధానం

[మార్చు]

ముందుగా అతుకవలసిన భాగాలను ఎటువంటి గ్రీజు, నూనెమరకలు, తుప్పు, దుమ్ము, ధూళి వంటివి లేకుండ శుభ్రపరచెదరు. అటు పిమ్మట అతుకవలసిన లోహఅంచులను ఎదురెదురుగా వున్న బందులలో గట్టిగా బింగించెదరు. కదిలే అమరికను ముందుకు కదిపి రెండు అంచుల మధ్య విద్యుత్తు ఆర్కు ఏర్పడునట్లు చేయుదురు.ఆర్కును రెండు, మూడు పద్ధతులలో సృష్టించెదరు.అందులో ఒక విధం మొదట విద్యుత్తును లోహాల లో ప్రవహింపచేసి, కదిలే అమరికద్వారా ఒక అంచు, రెండో అంచును తాకేలా చేసి విద్యుత్తు వలయాన్ని అంచులవద్ద ఏర్పడ చేయుదురు.ఇప్పుడు మెల్లగా రెండు చివరల మధ్య దూరాన్ని పెంచడం వలన అతుకబడు చివరల వద్ద చిన్న మెరుపువలయం (Arc) ఏర్పడును.రెండు అంచుల వద్ద ఏర్పడిన విద్యుత్తు మెరుపు వలయం వలన లోహాల అంచులు బాగా వేడెక్కును.ఇప్పుడు కదిలే లోహాఅంఛును బహ్యావత్తీడి/బలాన్ని ఉప యోగించి బలంగా స్థిరంగా వున్న అంచును బలంగా తాటించి, కొద్దిక్షణాలు అదే స్థితిలో వుంఛుతు, విద్యుత్తు ప్రవాహాన్ని నిలిపి, అతికిన భాగం చల్లారు వరకు, బాహ్యాబల ప్రయోగాన్ని కొనసాగించడం జరుగుతుంది. తరువాత వత్తిడిని నిలిపి వేసి, అతికిన వస్తువు బంధనాలు తొలగించెదరు. బహ్యబల ప్రయోగానికై స్ప్రింగు ఫోర్సు లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు లేదా హైడ్రాలిక్ ఫోర్సును ఉపయోగిస్తారు[2].

అతుకుటకు అనువైన లోహాలు[2]

[మార్చు]
  • రాగి దాని మిశ్రమ ధాతువులు
  • అల్యూమినియంయొక్క మిశ్రమ లోహాలు
  • నికెల్ లోహం యొక్క మిశ్రమ ధాతువులు.
  • తుప్పుపట్టిని ఉక్కు/స్టెయిన్‌లెస్ స్టీల్
  • మెలిబ్డినం (molbdenum) లోహం

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  1. [1] పెర్‌కాసిన్‌ వెల్డింగుకు చెందిన చిత్రాలు.
  2. [2] Archived 2013-08-30 at the Wayback Machine పెర్‌కాసిన్‌ వెల్డింగు విధానం

సూచికలు

[మార్చు]
  1. "Percussion Welding". www.mechanicalengineeringblog.com. Archived from the original on 2013-08-30. Retrieved 2014-03-03.
  2. 2.0 2.1 welding Technology-Resistance welding,By.O.P.khanna,Page No:177