పోలాటితిప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోలాటితిప్ప
—  రెవిన్యూ గ్రామం  —
పోలాటితిప్ప is located in Andhra Pradesh
పోలాటితిప్ప
పోలాటితిప్ప
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°07′59″N 81°07′36″E / 16.133189°N 81.126787°E / 16.133189; 81.126787
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మోకా రాజు
జనాభా (2011)
 - మొత్తం 2,431
 - పురుషులు 1,283
 - స్త్రీలు 1,148
 - గృహాల సంఖ్య 640
పిన్ కోడ్ 521001
ఎస్.టి.డి కోడ్ 08672

పోలాటితిప్ప, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 001., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

పెడన, కోడూరు, గూడూరు, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్టణం, చిలకలపూడి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 77 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న సున్నపూడి నరసింహారావు అను విదార్ధి, 214, డిసెంబరు-11వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పైకా పోటీలలో, డిస్కస్ థ్రోలో, బాలుర విభాగంలో, ప్రథమస్థానం సాధించి, రాష్ట్రస్థాయి పైకా పోటీలకు ఎంపికైనాడు. [2]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మోకా రాజు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ సురేష్ ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీరామాలయం[మార్చు]

ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017,మార్చి-14వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి హోమమం, ప్రత్యేకపూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి పాలు, వెన్న, నెయ్యి మొదలగు పదార్ధాలతో అభిషేకాలు నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని పూజా క్రతువును జరిపించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీరాములవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల దైవనామస్మరణతో గ్రామం మారుమ్రోగినది. ఈ ఉత్సవాలకు పోలాటితిప్ప గ్రామం నుండియేగాక, భక్తులు చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా అసంఖ్యాకంగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాల దాత శ్రీ మోకా సాయిబాబు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

పోలాటితిప్ప గ్రామంలో రు. 1.2 కోట్లతో ప్రభుత్వం ఒక తుఫాను షెల్టరును నిర్మించుచున్నది. ఈ నిర్మాణం జనవరి-2015 చివరికి పూర్తికాగలదు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,431 - పురుషుల సంఖ్య 1,283 - స్త్రీల సంఖ్య 1,148 - గృహాల సంఖ్య 640
జనాభా (20 01) -మొత్తం 2376 -పురుషులు 1195 -స్త్రీలు 1181 -గృహాలు 567 -హెక్టార్లు 1692.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-27; 4వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-13; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-14; 5వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Polatitippa". Retrieved 28 June 2016. External link in |title= (help)