చిన్నాపురం (మచిలీపట్నం)
చిన్నాపురం (మచిలీపట్నం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి తాడికొండ ధనమణి |
జనాభా (2011) | |
- మొత్తం | 5,204 |
- పురుషులు | 2,649 |
- స్త్రీలు | 2,555 |
- గృహాల సంఖ్య | 1,494 |
పిన్ కోడ్ | 521001 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
చిన్నాపురం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 001., ఎస్.టి.డి.కోడ్ = 08672.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
మచిలీపట్నం, పెడన, గుడివాడ, రేపల్లె
సమీప మండలాలు[మార్చు]
చల్లపల్లి, మచిలీపట్నం, గూడూరు, కోడూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 68 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో చదువుచున్న కట్టా కొండలమ్మ అను విద్యార్థిని, సబ్-జూనియర్ బాలికల విభాగంలో, రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనది. ఈమె 2014,నవంబరు-7న ప్రకాశం జిల్లాలోని మైనంపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుంది. ఈమె ఇటీవల విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో, అండర్-17 బాలికల విభాగంలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె కడప జిల్లా రాజంపేటలో 2014,డిసెంబరు-28 నుండి 30 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో పాల్గొంటుంది. [4]&[5] ఈమె జిల్లాస్థాయిలో నిర్వహించిన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడా పోటీలలో ఖో-ఖో విభాగంలో తన ప్రతిభ చాటి, 2014,డిసెంబరు21న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించింది. [6] గురువిద్యా నికేతన్, చిన్నాపురం
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
బ్యాంకులు[మార్చు]
ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 8672/245240.
వైద్య సౌకర్యం[మార్చు]
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- శ్రీ గరికపాటి లక్ష్మీనరసయ్య కంటి ఆసుపత్రి:- గరికపాటి దొంతులు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆసుపత్రిని, 2015,ఆగస్టు-25న ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు అందించెదరు. [7]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తాడికొండ ధనమణి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ ఎం.రాజగోపాలరావు ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం[మార్చు]
- ఈ ఆలయ నిర్మాణానికి శ్రీమతి పురం సావిత్రమ్మ 1.92 ఎకరాల భూమిని వితరణగా అందించారు. [9]
- ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం, 2016,ఏప్రిల్-1వ తేదీ శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమం, స్వామివారికి అభిషేకాలను వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భజన కార్యక్రమం నిర్వహించారు. మద్యాహ్నం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. [9]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం. వ్యవసాయాధారితి వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
శ్రీ తోట సోమేశ్వరరావు[మార్చు]
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ తోట సోమేశ్వరరావు గారు బందరు మండలం చిన్నాపురంలో జన్మించారు. వీరు తన 11వ ఏటనే హనుమాన్ జంక్షనుకు తరలి వెళ్ళారు. వీరు గాంధేయవాదం పట్ల ఆకర్షితులై, స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా, ఆయనపై కేసులుగాడా నమోదైనవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గూడా, ఆయన ఖద్దరు ధారణకూ, గాంధేయవాదానికీ కట్టుబడి జీవించారు. అదే విధానం ప్రాతిపదికగా, ప్రభుత్వం ఇస్తానన్న సమరయోధుల పింఛను గూడా తిరస్కరించారు. వీరు మంచి గూడా ప్రసిద్ధులు. వీరు తన 96వ ఏట, హనుమాన్ జంక్షన్లో, 2014,జనవరి-23న, అనారోగ్యంతో కన్నుమూశారు. [2]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామంలో 2015,డిసెంబరు-23వ తేదీనాడు, హర్షా కళాశాల ఎన్.ఎస్.ఎస్.యూనిట్-3 ఆధ్వర్యంలో, సేవా శిబిరాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా గ్రామస్థులు పలు సమస్యలను వీరి దృష్టికి తీసికొని వచ్చారు. [8]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 5,204 - పురుషుల సంఖ్య 2,649 - స్త్రీల సంఖ్య 2,555 - గృహాల సంఖ్య 1,494
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6049.[2] ఇందులో పురుషుల సంఖ్య 3086, స్త్రీల సంఖ్య 2963, గ్రామంలో నివాసగృహాలు 1590 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1196 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Chinnapuram". Retrieved 28 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2013,జనవరి-24; 15వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-23; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-6; 4వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-27; 10వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-21; 10వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,ఆగస్టు-26; 4వపేజీ. [8] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-24; 5వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2016,ఏప్రిల్-2; 5వపేజీ.