వాడుకరి చర్చ:కాసుబాబు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16,180 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చంద్రకాంతరావుగారి అనుచిత వ్యాఖ్యలు-ఫిర్యాదు
(చంద్రకాంతరావుగారి అనుచిత వ్యాఖ్యలు-ఫిర్యాదు)
 
ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 03:10, 26 ఏప్రిల్ 2009 (UTC)
==ఫిర్యాదు==
కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి '''దయచేసి''' కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా '''సంయమనం''' ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా.
చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది
ఏమిటీ దాష్టీకం, పిడివాదం
సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)
 
"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb" నుండి వెలికితీశారు
 
 
ఇంతవరకు జరిగిన సంఘటనలు
*నేను ఒక మంచి బొమ్మను(ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర సామాన్యవ్యక్తి విగ్రహం) వికీలోకి ఎక్కించి, నలుగురికీ బాగా తెలియాలన్న సంకల్పంతో, వెంటనే ఈ వారపు బొమ్మ మూస తగిలించి, అప్పటికే ఉన్న బొమ్మల వరసలో చివరగా ఉంచాను. నేనేమి ఉన్న వరుస చెదర్చలేదు, ఈ బొమ్మకు ప్రాధాన్యమిచ్చి ఇతర బొమ్మలను వెనుకకు తొయ్యలేదు. ఒక నిర్వాహకుల వారు, ఈ బొమ్మ ఏమిటి? బొమ్మ ప్రాశస్త్యమేమిటి? అన్న విషయాలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈ వారపు బొమ్మ పుటలో లేని నియమాలను ఉట్టంగిస్తూ బొమ్మ ను ఈ వారపు బొమ్మల వరుసలోనుండి తొలగించారు. ఆపైన ఆ బొమ్మ చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్యను నా చర్చా పుటలో వ్రాశారు. అటువంటి వ్యాఖ్య నా చర్చా పేజీలో ఉండటం అనవసరం అని తోచి, అదే మాట వ్రాసి తొలగించాను.
*దీనికి ఈ నిర్వాహకులవారు మళ్ళీ నా చర్చా పుటలో "ఇది సభ్యత కాదు" అన్న హెడ్డింగు పెట్టి ఎమేమో వ్రాసి తన అక్కస్సును వెళ్ళగక్కారు. ఇంత చిన్న విషయానిమి సభ్యత వంటి మాటలు వ్రాసి ఆవతలి వారిని క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయటం భావ్యం కాదని తలచి, నేను ఆ నిర్వాహకుని పుటలో హెడ్‌మాస్టర్ లాగ ప్రవర్తించవద్దని, సభ్యులను నిరుత్సాహపరచవద్దని నా వ్యాఖ్యలు వ్రాశాను. దానికి వారుకూడ తన చర్యలను సమర్ధించుకుంటూ తాను వ్రాయగలిగినది వ్రాశారు. నేనుకూడ సామరస్యపూర్వకంగ స్పందిస్తూ విషయాన్ని ముగించాను.
*ఈలోగా దేవాగారు, ఈ నిర్వాహకులవారి చర్చాపుటలో సహనం పాటించమని వారిని కోరుతూ రెండు వ్యాక్యాలువ్రాస్తే, దానికి వీరు దాదాపు పేజీడు వ్యాఖ్యవ్రాసి అందులో చాలా ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇది చూసిన నాకు అనిపించింది, అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, నియమాలు ఏమిటి తెలుసుకుందామని.
*కాబట్టి మన వికీ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తులను (వైజా సత్య గారిని, కాసుబాబుగారిని)వివరణ కావాలని అడిగాను. ఈ నిర్వాహకుడి తొందరపాటుతనం ఇంతకుముందే తెలుసు కనుక, నేను వివరణలు అడగటానికి పురికొల్పిన సంఘటనలకు కారణమైన వారు దయచేసి కలుగచేసుకొనవద్దు అనికూడ చివరలో వ్రాశాను(వారి పేరును ఎక్కడా కూడ వ్రాయలేదు).
*వైజా సత్యగారు ఎంతో పెద్దమనిషి తరహాలో నాకు కొంత సంయమనపరచటానికి చల్లటి మాటలతో నా చర్చా పేజీలో వ్యాఖ్య వ్రాశారు. కాసుబాబుగారు, లైట్ తీసుకోండి అన్నారు. నేను సత్యా గారు వ్రాసిన పాయింట్లకు నా పక్కనుండి కొన్ని సూచనలు (వారు వారి వ్యాఖ్యలో కోరిన ప్రకారం)వ్రాద్దామనుకున్నాను.
*ఈలోగా, ఈ నిర్వాహకులవారు తన తోటి నిర్వాహకులైన సత్యాగారు, కాసు బాబుగారు వ్రాసిన వ్యాఖ్యలు లెక్క చెయ్యకుండా(వీరి వ్యాఖ్యలకిందే ఈ నిర్వాహకులవారు వ్రాశారు) ఎక్కడలేని తామసాన్ని ప్రదర్శిస్తూ, నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు(పైన కాపీ చేసినవి). ఇప్పటికి కూడ నేను నా సభ్యతను కోల్పోకుండా వారిని గౌరవంగానే సంభోదిస్తున్నాను.
 
నిర్వాహకుడైనటువంటివారికి తామసం పనికిరాదు. ఓర్పు అవసరం అసహనం పనికిరాదు. విషయం విలువ పట్టించుకోకుండా ఎక్కడా వ్రాతలో కనపడని నియమాలు బోధించటానికి ప్రయత్నించటం,తాను చెప్పినదే వేదమన్నట్టుగా వ్యవహరించటం, దురుసైన భాష, పిడివాదం కాక మరేమవుతుంది. సామాన్య సభ్యులమీద కోప తాపాలు చూపటం, అనుచిత భాష వాడటం, తటాలున (at the drop of a hat, with least provocation)ఆవతలి వ్యక్తిని ఏకవచన ప్రయోగం చెయ్యటం, సభ్యత అంటూ వారి కారెక్టర్ గురించి వ్యాఖ్యలు చెయ్యటం ధాష్టీకం కాక ఏమిటి. వికీ అంటే ఈ నిర్వాహకుల వారు తమ సొంత జాగీర్దారు అనుకుంటున్నారా. మాట్టాడితే నేను గమనిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని వ్యాఖ్యలు. సామాన్య సభ్యులు కూడ గమనిస్తూనే ఉంటారు వారు చేస్తున్న పనులు, చేస్తున్న వ్యాఖ్యలు. వారు వ్రాసిన ప్రతి మాటలోను తాను నిర్వాహకుడినన్న అహంకారం తొణికిసలాడుతూ ఉంటుంది. నేను వికీలో చేరినది మొదలు కాసుబాబు, వైజాసత్య, రాజశేఖర్ గార్లు తదితర నిర్వాహకులు ఎంతో చక్కగా తోటి సభ్యులను ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సున్నితంగా చక్కటి ఆహ్లాదకరమైన భాషలో వారిని సరిచేస్తూ చెప్తూంటారు. వారెక్కడ, ఈ నిర్వాహకులవారెక్కడ
 
నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.
 
నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 18:02, 29 ఏప్రిల్ 2009 (UTC)
 
==గరికపాడు==
కాసు బాబు గారు, మీరు ప్రస్తవించిన అన్నం భట్టు గారు గుంటురు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గరికపాడు అగ్రహారానికి [[గరికపాడు (క్రోసూరు మండలం)]] చెందినవారు, గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన గరికపాటి వంశచరిత్ర పుస్తకంలో శాసనాల ఆధారంగా నిరూపించారు. మీ వద్ద దీనికి ప్రతీప ఆధారాలు ఉంటే నేను చూడ గోరతాను.
3,487

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/405867" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ