Jump to content

వాడుకరి:కాసుబాబు/వికీ డైరీ

వికీపీడియా నుండి




26/3/2008 - ఈ పేజీని మొదలు పెట్టడానికి ప్రేరణ - నేను పాల్గొన్న వ్యాసాల జాబితాను చేయమని రంగారావు గారు చేసిన సూచన. అచ్చం అలా కాకున్నా నా వికీ ప్రయాణంలో ముఖ్యమైన మజిలీలు ఇక్కడ వ్రాయాలనుకొంటున్నాను. (వ్యక్తిగతంగా నాకు డైరీ రాసే అలవాటు లేదు.)

నా దిద్దుబాట్ల గణాంకాలు

[మార్చు]

26/3/2008 నాటికి

[మార్చు]

ఈ రోజు http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?dbname=tewiki_p&user=కాసుబాబు లింకు ద్వారా నా User edit counter ఇలా చూపించింది.

Username కాసుబాబు   -- User groups sysop  
  Total edits 12318
  Image uploads 471 (450 cur, 21 old) 
  Distinct pages edited 5937    
  Edits/page (avg) 2.07  --  Avg edits/day 0.88  --  Deleted edits 124  

  '''First edit 2006/07/31 13:56:03''' 

;Edits by namespace 

  (Main) 8921  --  చర్చ 463  --  సభ్యుడు 157  --  సభ్యులపై చర్చ 814 
  వికీపీడియా 403  --  వికీపీడియా చర్చ 38  --  బొమ్మ 644  --  బొమ్మపై చర్చ 80  --    
  మూస 690  --  మూస చర్చ 22  --  వర్గం 81  --  వర్గం చర్చ 5   
  Delete 438  --  Restore 1  --  Move 260  --  Move_Redirect 1

గమనిక: దిద్దుబాట్ల లెక్కల జాడ్యం ఆరోగ్యానికి మంచిది కాదు.

Your edit count is not your IQ, value as a human being, or a score in a video game. It does not determine your worth as a Wikimedian. It does not cure cancer or grant you a seat on the secret spaceship that will be traveling to Mars when the Krulls return to destroy the planet in 2012... Don't let it bother you. It's just a number in the database. — Slashdot

29/6/2009 నాటికి

[మార్చు]
Total edits 24514 
Image uploads 847 (821 cur, 26 old) ) 
     Distinct pages edited 10739  - Edits/page (avg) 2.28 
     Avg edits/day 1.70 - Deleted edits 552  

Edits by namespace 
     (Main) 16731 
     చర్చ 1252 -  సభ్యుడు 211   - సభ్యులపై చర్చ 1493 -  వికీపీడియా 1697 - వికీపీడియా చర్చ 81 
     బొమ్మ 1346 - బొమ్మపై చర్చ 269  - మూస 1203  - మూస చర్చ 33  - సహాయము 1  - వర్గం 182  - వర్గం చర్చ 14 
     Unknown namespace(101) 1  - Delete 1149 - Restore 10  - Move 620 - Move_Redirect 23 


9/6/2010 నాటికి

[మార్చు]

Total edits 27674 
Image uploads 1080 (1051 cur, 29 old) 
Distinct pages edited 12192 
Edits/page (avg) 2.27 
Deleted edits 615 
First edit 2006-07-31 13:56:03 

Edits by namespace 
Articles 18714  - Talk 1440 - User 244 - User talk 1566 - 
Project 2013 - Project talk 91 - 
Image 1642 - Image talk 434 - 
MediaWiki 3 - Template 1278 - Template talk 33 - Help 1 - Category 197 - Category talk 14 - 
Unknown namespace 100 1 - Unknown namespace 101 3 

జూలై

[మార్చు]

జూలై 31, 2006న సభ్యునిగా చేరాను. నేను 517వ సభ్యుడిని. ఇంగ్లీషు వికీపీడియా కూడా అంతకు కొద్ది రోజుల ముందే పరిచయం. ఏదో వెతుకులాటలో తెలుగు వికీపీడియా లింకుకు అనుకోకుండా చేరుకొన్నాను. ఇదేదో క్రొత్తగా అనిపించింది. అంతకు ముందు ఒకటి రెండు నెలలుగా కావ్యనందనం వెబ్ సైటునుండి పోతన ఫాంట్ దించుకొని తెలుగులో టైపింగ్ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రాక్టీసు వికీపీడియాలో కూడా చేయవచ్చుననిపించింది. అప్పటికి తెలుగువికీ ఎడిట్ బాక్స్‌లో నేరుగా తెలుగు టైపు చేసే సదుపాయం లేదు. ఎక్కువ మంది లేఖినిలో తెలుగు టైపు చేసుకొని, దానిని కత్తిరించి తెలుగు వికీలో అతికిస్తున్నారనుకొంటాను. కాని నేను లేఖినిని వాడలేదు. అయితే లేఖిని ఉందని మాత్రం తెలుసు.


జూలై 2006లో (ఒక్క రోజులో) నేను చేసిన ఘన కార్యాలు
  • సభ్యునిగా నమోదు చేసుకొన్నాను. నా సభ్యనామం User:Kajasudhakarababu (తరువాత "కాసుబాబు"గా మార్చుకొన్నాను)
  • "వికీపీడియాలో మీ వూరు ఉందా?" అనే లింకు పట్టుకొని వెళ్ళి మా వూరు పెదవేగి‎ గురించి రెండు, మూడు వాక్యాలు వ్రాశాను. పెదవేగి మండలం పేజీలో చూస్తే పెదవేగి లింకు ఎరుపూ కాదు, నీలం కాదు. నల్లగా ఉంది (అదే పేజీ కనుక!). ఏంచెయ్యాలో తెలియక చాలా సతమతమమయ్యాను. "మార్చు" ట్యాబ్ నొక్కాలని చాలా సేపటికి వెలిగింది.
  • కారం తినడం కడుపుకి మంచిది కాదా? అన్న 'వ్యాసం'లో ఒక పేరా (ఎప్పుడో టి.వి.లో చూసిన విషయం) వ్రాశాను. అప్పటికి వికీ అంటే ఒక బ్లాగులాంటిదనే అనుకొనేవాడిని. కనుకనే ఇంత గొప్ప వ్యాసం మీద ప్రారంభోత్సవం చేశాను.


అప్పటికి తెలుగు వికీలో సభ్యుల సంఖ్య నాతో కలిపి 517. వ్యాసాల సంఖ్య షుమారు 3300.

ఆగష్టు

[మార్చు]

క్రమంగా వికీ అంటే కొద్ది అవగాహన ఏర్పడసాగింది. అయితే ఒక బలమైన వ్యసనానికి పునాదులు పడుతున్నాయని అనుకోలేదు.

2006 ఆగష్టులో నేను చేసిన ముఖ్యమైన పనులు -


  • రామాయణము అనే ముఖ్యమైన వ్యాసం ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఇక విజృంభించుదామని ఒక పేరా వ్రాశాను. అది కూడా "తల్లిదండ్రులకు నమస్కారములు" అని మొదలు పెట్టిన స్వంత పరిచయమే. తరువాత అది "ప్రకటన" గనుక తొలగించాలని చావాకిరణ్ వ్రాశారు. ముఖం మాడ్చుకొని సరే అన్నాను. రామాయణము వ్రాస్తే రామాయణం పేజీ ఖాళీగా ఉన్నది. ఏం చేయాలో తోచక వైజాసత్య చర్చా పేజీలో వ్రాశాను. ఎందుకంటే నన్ను స్వాగతించిన పాపం అతనిదే. అప్పుడు "దారిమార్పు" విధానం గురించి వైజాసత్య వ్రాశాడు. నాకు తెలిసిన విషయం ప్రయోగించుదామని మహాభారతం వ్యాసానికి దారిమార్పు చేశాను.

త్రివిక్రమ్ (అనుకొంటా) మొదలుపెట్టిన సంఖ్యానుగుణ వ్యాసములులో తెలిసినవి జోడించడం మొదలుపెట్టాను.

  • అప్పటికి వైజాసత్య తెలుగు సినిమాల డేటాబేస్‌ను బాట్ ద్వారా వ్యాసాలుగా సృష్టించాడు. వ్యాసాల పేర్లు తెలుగులో ఉన్నాయి గాని మూసలో సమాచారం ఆంగ్లంలో ఉంది. చదువరి వాటిని తెలుగులోకి అనువదించడం "ఇటీవలి మార్పులు"లో గమనించాను. ఓహో ఇలా చేయాలి కాబోలుననుకొని సినిమాల అనువాదం మొదలుపెట్టాను. ఈ పనికి "వెల సులభము, ఫలమధికము" - దిద్దుబాట్లు సంఖ్య బాగా పెరుగుతుంది. ఒకో పేజీని పూర్తిగా అనువదించడానికి ఒకటి నుండి ఐదు నిముషాల మధ్య పడుతుంది. చాలా పని చేసేసిన ఫీలింగ్ కలుగుతుంది.

సెప్టెంబరు

[మార్చు]
  • సినిమాల అనువాదం కొనసాగించాను. రోజుకు 50 నుండి 150 దాకా పేజీల అనువాదం సాగుతున్నది. ఈ నెలలో చిట్టెళ్ళ కామేశ్వరరావు గారు ఈ పనిలో తోడయ్యారు. ఇద్దరం కలిసి ఎడా పెడా ఈ పని లాగించేశాము. 26వ తారీఖు నాటికి అన్ని పేజీల అనువాదాలూ పూర్తయ్యాయి. చివరిలో రెండు పేజీలను మాత్రం అలా ఉంచేసి కామేశ్వరరావుగారిని ఈ పనికి మంగళం పాడమన్నాను. ఆయన సంతోషించారు. షుమారు రెండు వేల సినిమా పేజీల అనువాదాలు పూర్తి చేసినందుకు మమ్ముల్నిద్దరినీ (చదువరి, వైజాసత్య..) అభినందించారు.


  • క్రొత్త సభ్యులకు స్వాగతం చెప్పడం మొదలుపెట్టాను.

అక్టోబరు

[మార్చు]
  • కొన్ని మండలాల పేజీలలో వూళ్ళ పేర్లు ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని అనువదించడం మొదలుపెట్టాను.

నవంబర్

[మార్చు]

డిసెంబరు

[మార్చు]

ఈ నెలలో వ్రాసిన, అనువదించిన కొన్ని ముఖ్య వ్యాసాలు:

  • ఈ నెలలో వ్యాసాల సంఖ్య 25 వేలకు చేరుకొంది. అయితే దీనికి ప్రధాన కారణం బాట్ల ద్వారా వైజాసత్య గ్రామాలకు ప్రత్యేక పేజీలు చేయడమే. అంతకుముందు "పదివేల పండుగ" అని చదువరి ఒక మైలురాయిని గురించి ప్రస్తావించారు. కాని బాట్ల కారణంగా ఒక్కసారిగా వ్యాసాల సంఖ్య 25 వేలకు దూకింది. ఈ వ్యాసాలను విస్తరించడం మరియు వాటి నాణ్యత పెంచడం అనేది ఇప్పటికీ (2009 జూన్ నాటికి) తెలుగు వికీ శ్రామికులకు ఒక సవాలుగా ఉంది.
  • గ్రామాల అనువాదం కొనసాగింది. చాలా గ్రామాలకు అయోమయ నివృత్తి పేజీలు చేశాను.

జనవరి

[మార్చు]

ఫిబ్రవరి

[మార్చు]

జాతీయములు, గ్రామాల అయోమయ నివృత్తి, సినిమాల విస్తరణ - కొనసాగినవి

మార్చి

[మార్చు]

ఏప్రిల్

[మార్చు]
  • పుస్తకాల ప్రాజెక్టు మీద కొంత కృషి మొదలు పెట్టాను.
  • ముఖ్య వ్యాసాలు - విష్ణువు వేయి నామములు-201-300
  • ఆంగ్ల వికీనుండి దేశాల జాబితాలు తెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టాను. మూస:Country showdata మరియు దానికి సంబంధించిన మూసలపై ప్రయోగాలు చేశాను. తరువాత వందలకొద్దీ మూసలు ఆంగ్లవికీనుండి తెలుగులోకి తీసుకొచ్చాను. దేశాల జాబితా, ప్రపంచ దేశాల జాబితాలు చాలావరకు తయారు చేశాను. ఈ పనిలో భాగంగా దేశాల జాబితా - డేటా ఫైలు కూడా తయారయ్యింది.
  • సినిమాల వ్యాసాలు మామూలే. సినిమా వ్యాసాలు వ్రాయడం, దిద్దడంలో నేను గమనించిందేమంటే ఈ పని చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. స్ట్రెస్ ఉండదు.

జూన్

[మార్చు]

జూలై

[మార్చు]
  • జూన్ నుండి "ఈ వారం వ్యాసం" క్రమంగా రావడం మొదలయ్యింది. ఈ శీర్షిక నిర్వహణలో అధికంగా పాల్గొనడం మొదలు పెట్టాను. వైజా సత్య చేసిన పట్టిక నుండి వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 - 2009 పేజీని మరింత విస్తారంగా వివరంగా తయారు చేశాను.

ఆగష్టు

[మార్చు]
  • తెలుగు సినిమాలు అకారాది అమరిక, వర్గీకరణ, విస్తరణ, సవరణలు

సెప్టెంబరు

[మార్చు]
  • తెలుగు సినిమాలు అకారాది అమరిక, వర్గీకరణ, విస్తరణ, సవరణలు

అక్టోబరు

[మార్చు]
  • సెప్టెంబరు నెలలో సెలవుకు వెళ్ళాను. సెలవుల్లో మా వూరు చుట్టుప్రక్కల మండలాల్లో ఆటోమీద వెళుతూ ఒకోవూరు ఫొటోలు తీశాను. ఏలూరు, పెదవేగి, నూజివీడు, ద్వారకాతిరుమల ప్రాంతాలు. అందరూ నాకు పిచ్చిపట్టిందని విసుక్కునేవారు. ఆటో డ్రైవర్లు మాత్రం చాలా సహకరించారు. ఆ ఫొటోలను అప్‌లోడ్ చేశాను. షుమారు 200 ఫొటోలు ఉండవచ్చును. వీటిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఫొటోలు - పెదవేగి, ద్వారకా తిరుమల, రంగాపురం, ఏలూరు, గుంటుపల్లి (కామవరపుకోట), గద్దేవారిగూడెం.

నవంబర్

[మార్చు]
  • వివిధ దేశాల జాబితాల పని కొనసాగింది
  • నవంబర్లో మళ్ళీ సెలవులకు వెళ్ళాను. ఇప్పుడు ఫొటోల ప్రస్థానం కొనసాగించాను. ముఖ్యంగా హైదరాబాదులోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మ్యూజియంలో అనేక ఫొటోలు తీశాను. మ్యూజియంలో ఉద్యోగులు చాలా సహకరించారు. వూళ్ళల్లో కూడా మరిన్ని ఫొటోలు తీశాను. ఇవన్నీ తరువాత అప్‌లోడ్ చేశాను.

డిసెంబరు

[మార్చు]
  • క్రొత్తలో రామాయణం వ్యాసాన్ని వ్రాశాను. ఇప్పుడు ఒక్కోకాండాన్ని ఒక్కో వ్యాసంగా వ్రాయాలని అనుకొన్నాను. ఈ నెలలో బాలకాండ, అయోధ్యకాండ వ్రాశాను.

జనవరి

[మార్చు]

ఫిబ్రవరి

[మార్చు]
  • ఎక్కువగా గ్రామాల పేజీలమీద పని చేశాను. ఇంతకు ముందు తీసిన అనేక బొమ్మలు అప్‌లోడ్ చేశాను.
  • వికీపీడియా:WikiProject/పుస్తకాలు పుస్తకాల ప్రాజెక్టుపై కొంత కృషి చేశాను. ఈ ప్రాజెక్టులోని పనులను క్రోడీకరించాను. కొన్ని జాబితాఉ తయారు చేశాను.
  • ప్రదీప్ నడిపిన బాట్ వల్ల అనేక బొమ్మలు కాపీహక్కులు సరిగా లేనందున తొలగించవలసినవిగా పేరుకు పోయాయి. చాలా బొమ్మలకు సరైన కాపీ హక్కుల ట్యాగ్‌లను తగిలించాను. కొన్నింటిని తొలగించాను.

మార్చి

[మార్చు]
  • సెలవులలో తీసిన మరికొన్ని ఫొటోలను అప్‌లోడ్ చేశాను.
  • తెలుగువారి ఇంటిపేర్లు కలగాపులగంగా ఉన్నాయి. వాటిని అకారాదిక్రమంలో తెలుగునాట ఇంటిపేర్ల జాబితా అనే వ్యాసంగా అమర్చాను. ఈ పేజీకి సందర్శకులు ఎక్కువగా ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
  • గ్రామాలు, సినిమాల వ్యాసాలమీద కూడా కొంత పని జరిగింది.


  • వికీ డైరీ (ప్రస్తుతం మీరు చదువుతున్నది) మొదలుపెట్టాను. కాని క్రమంగా వ్రాయడం లేదు. అప్పుడప్పుడూ.
  • కాపీహక్కుల ట్యాగ్‌ల పరిష్కరణ పని కొనసాగింది.
  • వేంగి - ఇది తూర్పు చాళుక్యుల రాజ్యం. మావూరైన పెదవేగికి పూర్వనామం. వేంగి వ్యాసాన్ని దాదాపు పూర్తిగా స్వంతంగా, అనగా వివిధ మూలాలు పరిశోధించి, వ్రాశాను. - నాకు చాలా ఇష్షమైన నా వ్యాసాలలో ఇది ఒకటి.

ఏప్రిల్

[మార్చు]

ముఖ్యమైన పనులు

జూన్

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు

జూలై

[మార్చు]

ఆగష్టు

[మార్చు]

సెప్టెంబరు

[మార్చు]

అక్టోబరు

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు, చిట్కాలు

నవంబర్

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు

డిసెంబరు

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు, మొలకల తగ్గింపు

జనవరి

[మార్చు]

ఫిబ్రవరి

[మార్చు]

మార్చి

[మార్చు]

ఏప్రిల్

[మార్చు]
  • భగవద్గీత, నాలాయిర దివ్యప్రబంధము
  • సెలవుల్లో తీసిన మరికొన్ని వూళ్ళ, సినిమాల బొమ్మలు ఎక్కింపు
  • రూపవాణి ఆర్చివ్స్ నుండి కొన్ని సినిమా బొమ్మలు ఎక్కింపు
  • flickr నుండి కొన్ని బొమ్మల ఎక్కింపు
  • కొల్లూరి భాస్కరరావు గారి బ్లాగు నుండి ఆయన అనుమతితో పాటపాటలను ఆయా సినిమా పేజీలలోకి కాపీ చేశాను. ఆయన సహకారానికి కృతజ్ఞతలు. ఈ మార్పులు నా పేరు మీద ఉండవచ్చును గాని శ్రమంతా ఆయనదే.

జూన్

[మార్చు]

జూలై

[మార్చు]

ఆగష్టు

[మార్చు]

సెప్టెంబరు

[మార్చు]

అక్టోబరు

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు

నవంబర్

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు

డిసెంబరు

[మార్చు]
  • సాధారణ నిర్వహణా కార్యక్రమాలు

జనవరి

[మార్చు]
  • కొద్దిపాటి నిర్వహణా కార్యక్రమాలు

ఫిబ్రవరి

[మార్చు]
  • కొద్దిపాటి నిర్వహణా కార్యక్రమాలు

మార్చి

[మార్చు]
  • కొద్దిపాటి నిర్వహణా కార్యక్రమాలు


ఏప్రిల్

[మార్చు]
  • ఏమీ చేయలేదు
  • ఈ వారం బొమ్మ, వ్యాసం మాత్రం

జూన్

[మార్చు]
  • వికీ డైరీ
  • కొద్ది నెలలుగా ఇతర వ్యాపకాల కారణంగా వికీలో పని దాదాపు శూన్యంగా ఉంది. మరల పని ఆరంభిస్తున్నాను.


జూలై

[మార్చు]
  • ఈ వారం బొమ్మ, వ్యాసం మాత్రం

ఆగష్టు

[మార్చు]
  • ఈ వారం బొమ్మ, వ్యాసం మాత్రం

సెప్టెంబరు

[మార్చు]

ఈ నెలలో మళ్ళీ వికీకి కాస్తంత ఎక్కువ సమయం కేటాయించ గలుగుతున్నాను. చిన్న చిన్న దిద్దుబాట్లు చేస్తున్నాను. అక్టోబరు, నవంబర్ నెలల్లో నేను సెలవు, ప్రయాణాలలో ఉంటాను కనుక ఈ సంవత్సరం చివరి వరకు ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం శీర్షికలను పూర్తి చేశాను.


అక్టోబరు

[మార్చు]

నవంబర్

[మార్చు]

డిసెంబరు

[మార్చు]