Jump to content

వినాయక వ్రతకల్ప విధానం

వికీపీడియా నుండి
(వినాయక వ్రతకల్ప విధానము నుండి దారిమార్పు చెందింది)

శ్రీ వినాయక వ్రతం

శ్లోకం:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

దైవ ప్రార్థన

[మార్చు]


(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).

1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యము: మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షింతలు దేవునిపై చల్లవలెను.}

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. శుద్ధి చేసినట్టుగా)

ప్రాణాయామం

సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ

[మార్చు]

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

[మార్చు]
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ

[మార్చు]

(పుష్పములతో పూజించవలెను)

ఓo గణేశాయ నమః - పాదౌ పూజయామి Padamulaku Pooja Cheyandi?
ఓo ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి Madimalaku Pooja Cheyandi?
ఓo శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి Mokallu
ఓo విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి Pikkalu
ఓo ఆఖువాహనాయ నమః - ఊరూo పూజయామి Thodalu
ఓo హేరంబాయ నమః - కటిం పూజయామి Nadumu
ఓo లంబోదరాయ నమః - ఉదరం పూజయామి Bojja
ఓo గణనాథాయ నమః - నాభిం పూజయామి Nabhi
ఓo గణేశాయ నమః - హృదయం పూజయామి Hrudayamu
ఓo స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి Kanthamu
ఓo Skandagrajaya Namaha Skandow Poojayami Moopulu
ఓo Pasahasthaya Namaha Hasthow Poojayami Chethulu
ఓo గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి Mukhamu
ఓo విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి Kannulu
ఓo శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి Chevulu
ఓo ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి Nosata
ఓo సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి Sirasu
ఓo విఘ్నరాజాయ నమః - సర్వాంగాణి పూజయామి Anni Angamunaku Pooja Cheyyali!!

ఏకవింశతి పత్రపూజ

[మార్చు]

(21 విధముల పత్రములతో పూజింపవలెను)

సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా

[మార్చు]
  1. ఓం గజాననాయ నమః
  2. ఓం గణాధ్యక్షాయ నమః
  3. ఓం విఘ్నరాజాయ నమః
  4. ఓం వినాయకాయ నమః
  5. ఓం ద్వైమాతురాయ నమః
  6. ఓం ద్విముఖాయ నమః
  7. ఓం ప్రముఖాయ నమః
  8. ఓం సుముఖాయ నమః
  9. ఓం కృతినే నమః
  10. ఓం సుప్రదీప్తాయ నమః
  11. ఓం సుఖనిధయే నమః
  12. ఓం సురాధ్యక్షాయ నమః
  13. ఓం సురారిఘ్నాయ నమః
  14. ఓం మహాగణపతయే నమః
  15. ఓం మాన్యాయ నమః
  16. ఓం మహాకాలాయ నమః
  17. ఓం మహాబలాయ నమః
  18. ఓం హేరంబాయ నమః
  19. ఓం లంబజఠరాయ నమః
  20. ఓం హయగ్రీవాయ నమః
  21. ఓం ప్రథమాయ నమః
  22. ఓం ప్రాజ్ఞాయ నమః
  23. ఓం ప్రమోదాయ నమః
  24. ఓం మోదకప్రియాయ నమః
  25. ఓం విఘ్నకర్త్రే నమః
  26. ఓం విఘ్నహంత్రే నమః
  27. ఓం విశ్వనేత్రే నమః
  28. ఓం విరాట్పతయే నమః
  29. ఓం శ్రీపతయే నమః
  30. ఓం వాక్పతయే నమః
  31. ఓం శృంగారిణే నమః
  32. ఓం ఆశ్రితవత్సలాయ నమః
  33. ఓం శివప్రియాయ నమః
  34. ఓం శీఘ్రకారిణే నమః
  35. ఓం శాశ్వతాయ నమః
  36. ఓం బల్వాన్వితాయ నమః
  37. ఓం బలోద్దతాయ నమః
  38. ఓం భక్తనిధయే నమః
  39. ఓం భావగమ్యాయ నమః
  40. ఓం భావాత్మజాయ నమః
  41. ఓం అగ్రగామినే నమః
  42. ఓం మంత్రకృతే నమః
  43. ఓం చామీకర ప్రభాయ నమః
  44. ఓం సర్వాయ నమః
  45. ఓం సర్వోపాస్యాయ నమః
  46. ఓం సర్వకర్త్రే నమః
  47. ఓం సర్వ నేత్రే నమః
  48. ఓం నర్వసిద్దిప్రదాయ నమః
  49. ఓం పంచహస్తాయ నమః
  50. ఓం పార్వతీనందనాయ నమః
  51. ఓం ప్రభవే నమః
  52. ఓం కుమార గురవే నమః
  53. ఓం కుంజరాసురభంజనాయ నమః
  54. ఓం కాంతిమతే నమః
  55. ఓం ధృతిమతే నమః
  56. ఓం కామినే నమః
  57. ఓం కపిత్థఫలప్రియాయ నమః
  58. ఓం బ్రహ్మచారిణే నమః
  59. ఓం బ్రహ్మరూపిణే నమః
  60. ఓం మహోదరాయ నమః
  61. ఓం మదోత్కటాయ నమః
  62. ఓం మహావీరాయ నమః
  63. ఓం మంత్రిణే నమః
  64. ఓం మంగళసుస్వరాయ నమః
  65. ఓం ప్రమదాయ నమః
  66. ఓం జ్యాయసే నమః
  67. ఓం యక్షికిన్నరసేవితాయ నమః
  68. ఓం గంగాసుతాయ నమః
  69. ఓం గణాధీశాయ నమః
  70. ఓం గంభీరనినదాయ నమః
  71. ఓం వటవే నమః
  72. ఓం జ్యోతిషే నమః
  73. ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
  74. ఓం అభీష్టవరదాయ నమః
  75. ఓం మంగళప్రదాయ నమః
  76. ఓం అవ్యక్త రూపాయ నమః
  77. ఓం పురాణపురుషాయ నమః
  78. ఓం పూష్ణే నమః
  79. ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
  80. ఓం అగ్రగణ్యాయ నమః
  81. ఓం అగ్రపూజ్యాయ నమః
  82. ఓం అపాకృతపరాక్రమాయ నమః
  83. ఓం సత్యధర్మిణే నమః
  84. ఓం సఖ్యై నమః
  85. ఓం సారాయ నమః
  86. ఓం సరసాంబునిధయే నమః
  87. ఓం మహేశాయ నమః
  88. ఓం విశదాంగాయ నమః
  89. ఓం మణికింకిణీ మేఖలాయ నమః
  90. ఓం సమస్తదేవతామూర్తయే నమః
  91. ఓం సహిష్ణవే నమః
  92. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
  93. ఓం విష్ణువే నమః
  94. ఓం విష్ణుప్రియాయ నమః
  95. ఓం భక్తజీవితాయ నమః
  96. ఓం ఐశ్వర్యకారణాయ నమః
  97. ఓం సతతోత్థితాయ నమః
  98. ఓం విష్వగ్దృశేనమః
  99. ఓం విశ్వరక్షావిధానకృతే నమః
  100. ఓం కళ్యాణగురవే నమః
  101. ఓం ఉన్మత్తవేషాయ నమః
  102. ఓం పరజయినే నమః
  103. ఓం సమస్త జగదాధారాయ నమః
  104. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
  105. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే


దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।

అథ దూర్వాయుగ్మ పూజా

[మార్చు]

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

నమస్కారము, ప్రార్థన

[మార్చు]

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,

పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

శ్రీ వినాయక వ్రత కథ

[మార్చు]

గణపతి జననము

[మార్చు]

సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి, కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించి ఆపై శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేని స్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువునర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు। గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

గణేశుడు అగ్రపూజనీయుడు

[మార్చు]

ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడు మిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు। వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం

[మార్చు]

గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడు మనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడననుసరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.

ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.

శ్యమంతకోపాఖ్యానము

[మార్చు]

చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారమునీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.

నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.

ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.


అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కనుక అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని, తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి, సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.

సర్వేజనాః సుఖినో భవంతు.

విఘ్నేశ్వర చవితి పద్యములు

[మార్చు]

ప్రార్థన :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌


అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము

[మార్చు]

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.


మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!


ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి

ఇవి కూడా చూడండి

[మార్చు]


బయటి లింకులు

[మార్చు]