Jump to content

దానిమ్మ

వికీపీడియా నుండి
(దాడిమీపత్రం నుండి దారిమార్పు చెందింది)

దానిమ్మ
దానిమ్మ పండు.
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
P. granatum
Binomial name
Punica granatum
దానిమ్మపండు
దాడిమీ పత్రి
దానిమ్మ పువ్వులు

ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్రంలోని, మహారాష్ట్రలో షోలాపూర్, నాగ్పూర్ జిల్లాలలోని రాష్ట్రంలో కూడా దానిమ్మ సాగు జరుగుచున్నది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి. దానిమ్మ భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫలము.

లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామము " Punica Granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ, సి, ఇ, బి5, flavanoids ఉన్నాయి.

దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ "ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది .[1]

ఔషధ విలు

[మార్చు]
  • అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
  • దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
  • ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
  • సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
  • గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
  • వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
  • ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
  • రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం. దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ... శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది గుండె (హృదయము) కు మేలు చేస్తుంది . దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది . రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - inhibit the angiotenson converting enzyme .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది . ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది . దానిమ్మ గింజల, నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .

వారానికోసారి దానిమ్మ రసం

[మార్చు]

అధికరక్తపోటుతో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ 50 కన్నా తక్కువగా ఉన్నా... ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. . గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ రసమ్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.[2] దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .

దానిమ్మ చెట్టు

[మార్చు]
  • ముళ్ళతో ఎదిగే పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
  • విపరీత అండాకారంలో గురు అగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
  • గ్రీవాలలో ఏకాంతంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరిన దట్టమైన ఎరుపురంగు పుష్పాలు.
  • గుండ్రంగా ఉన్న మృదుఫలాలు.
  • కోణయుత విత్తనాలు.

సాగు

[మార్చు]

దానిమ్మ సాగుకు తేమ లేని పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం, నీరు నిలవని గట్టి గలస నేలలు అవసరం. చుట్టుప్రక్కల చెరువులు గాని, నదులు గాని, వరి పొలాలు గాని ఉన్న దానిమ్మతోటల్లో ఎక్కువ చీడపీడల ప్రభావం ఉంటుంది. దానిమ్మకు సాధారణంగా 2.50 అంగుళాల బోరు నీరు సరిపోతుంది. అందువల్ల దానిమ్మ రైతులు సాధారణంగా నీటి కరవు ఉన్న అటవీ ప్రాంతాలను ఎంచుకుంటారు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలు ఇస్తాయి. ఒక్కొక్క దానిమ్మ మొక్క సగటున 2 నుండి 10 లీటర్ల నీరును పీల్చుకుంటుంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించాల్సివుంటుంది. ఎరువులు - కలుపు - పురుగు మందుల యాజమాన్యం సకాలంలో ఉండాలి. చుట్టు ప్రక్కల ఇతర పంటలు ఉన్నా దానిమ్మకు వైరస్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొక్కలు నాటిన మొదటిలో బొప్పాయి అంతర పంటగా వేస్తారు. వరుసగా సుమారు 5 సంవత్సరాలకు మించి దానిమ్మ ఒకే చోట సాగు చేయడం మంచిది కాదు. సముద్ర తీర ప్రాంతాలు, నదీతీర ప్రాంతాలు దానిమ్మ సాగుకు ప్రతికూలం.

దానిమ్మకాయ గింజలు

ఉపయోగాలు

[మార్చు]
బండిలో దానిమ్మ పండ్లు
  • దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
  • దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
  • దానిమ్మ వేరు బెరడు, కాండం, ఆకుల నుంచి టానిన్‌లను తయారు చేయవచ్చు.
  • దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు.
  • పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు.
  • ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.
  • గర్బవతులు ప్రతి రోజు 600 మి.గ్రా నుండి 400 మి.గ్రా ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ వస్తుంది.స్తుంది.[3]

ఔషధ గుణాలు

[మార్చు]
  • 1.దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
  • 2.ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
  • 3.వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
  • 4.దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి.
  • 5.దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది.
  • 6.గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
  • 7.దీని ఆకులకు నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.

దాడిమీ పత్రి

[మార్చు]

ఈ పత్రి దాడిమీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పన్నెండవది.

భౌతిక లక్షణాలు

[మార్చు]
దానిమ్మ లక్షణాలు.

ఈ ఆకు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.

సువాసన గుణం

[మార్చు]

ఈ పత్రి పసరు వాసన వస్తుంది.

ఇతర ఉపయోగాలు

[మార్చు]

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు:

  • 1.పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు.
  • 2.దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
  • 3.దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
  • 4. దానిమ్మలో యాంతిఆక్సిదెంత్స్ ఉందతంవలన ఆరోగ్యనికి చాలా మంచిధి .

ఆయుర్వేదంలో

[మార్చు]

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కుష్టు వ్యాధికి, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. దనిమ్మ రసం ఉపయొగాలు
  3. "గర్బవతులకు దానిమ్మ ఉపయోగాలు"

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దానిమ్మ&oldid=4218910" నుండి వెలికితీశారు