Jump to content

ఫరీదాబాద్ జిల్లా

వికీపీడియా నుండి
ఫరీదాబాద్ జిల్లా
फरीदाबाद ज़िला
హర్యానా పటంలో ఫరీదాబాద్ జిల్లా స్థానం
హర్యానా పటంలో ఫరీదాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంఫరీదాబాద్
మండలాలు1. ఫరీదాబాద్, 2. బల్లబ్‌గఢ్
విస్తీర్ణం
 • మొత్తం2,151 కి.మీ2 (831 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం17,98,954
 • జనసాంద్రత840/కి.మీ2 (2,200/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో ఫరీదాబాద్ జిల్లా (హిందీ: फरीदाबाद जिला) ; (పంజాబీ: ਫਰੀਦਾਬਾਦ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. ఫరీదాబాద్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. ఢిల్లీ- మథుర (షేర్షా - సూరీ మార్గ్) రహదారి జిల్లా మద్యగా పోతుంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 2151 చ.కి.మీ. జనసంఖ్య 21,93,276. ఈ జిల్లా గుర్‌గావ్ డివిజన్‌లో భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ఫరీదాబాద్ జిల్లా హర్యానా రాష్ట్రం లోని జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లా.[1]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

జిల్లా కేంద్రం పేరే జిల్లా పేరుగా నిర్ణయించారు. జహంగీర్ కోశాధికారి షైక్‌ఫరీద్ ఫరీదాబాద్ నగరాన్ని స్థాపించి దీనికి ఫరీదాబాద్ అని పేరు నిర్ణయించాడు. ఈ ప్రాంతం సందర్శించిన షైద్‌ఫరీద్ ఇక్కడ నగరాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఇక్కడ నిర్మించబడిన నగరానికి ఫరీద్ పేరు నిర్ణయించబడింది. గోపాల్ కాలనీ తలాబ్ రోడ్డు మీద ఫరీద్ సమాధి (మక్బరా) నిర్మించబడింది. దానిని ఇపాటికీ ప్రజలు సందర్శింస్తుంటారు.

చరిత్ర

[మార్చు]

1979 ఆగస్టు 15 గుర్‌గావ్ జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి ఫరీదాబాద్ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం

[మార్చు]

హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తించబడుతుంది. ఢిల్లీ - మథుర మార్గంలో ఢిల్లీకి సమీపంలో ఉండడం కారణంగా ఫరీదాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. పరిశ్రమల స్థాపకులకు ఫరీదాబాద్ అభిమాన నగరంగా ఉంది. ఫరీదాబాద్ ట్రాక్టర్, మోటర్ సైకిల్, స్విచ్ గీర్, రిఫ్రిజిరేటర్స్, షూస్ , టైర్లు , ఇతర ఉత్పత్తులకు ప్రాముఖ్యత వహించింది.అయినప్పటికీ ప్రస్తుత కాలంలో నోయిడా, ఒఖ్లా , గుర్‌గావ్‌లు పారిశ్రామికంగా ఫరీదాబాద్‌ను అధిగమించాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,798,954, [1]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 266వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 2269 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 31.75%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 871:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 83%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ఫరీదాబాద్ , పాల్వాల్ జాట్ జాతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. మొత్తం ప్రజలలో వీరు 21%, 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థానీ వలస పంజాబీ ప్రజలు 16%, బ్రాహ్మణులు 11% ఉన్నారు.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341