Jump to content

బెరీలియం బ్రోమైడ్

వికీపీడియా నుండి
బెరీలియం బ్రోమైడ్
పేర్లు
IUPAC నామము
Beryllium bromide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7787-46-4]
పబ్ కెమ్ 82230
SMILES [Be+2].[Br-].[Br-]
ధర్మములు
BeBr2
మోలార్ ద్రవ్యరాశి 168.820 g/mol
స్వరూపం colorless white crystals
సాంద్రత 3.465 g/cm3 (20 °C)
ద్రవీభవన స్థానం 508 °C (946 °F; 781 K)
బాష్పీభవన స్థానం 520 °C (968 °F; 793 K)
Highly
ద్రావణీయత soluble in ethanol, diethyl ether, pyridine
insoluble in benzene
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Orthorhombic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-2.094 kJ/g
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
9.5395 J/K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 0.4111 J/g K
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు see Berylliosis
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Magnesium bromide
Calcium bromide
Strontium bromide
Barium bromide
Radium bromide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బెరీలియం బ్రోమైడ్ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బనరసాయన సమ్మేళనపదార్ధం.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం BeBr2.ఇది ఎక్కువ ఆర్ద్రతాకర్షకత(hygroscopic) కలిగిన సంయోగపదార్ధం.నీటిలో బాగా కరుగుతుంది.ఈ సమ్మేళన పదార్ధఅణువు చతుర్కోణాకారంగాఉండి,కోణాలలో బెరీలియం కేంద్రాలను కలిగిఉన్నది.

భౌతిక లక్షణాలు

[మార్చు]

బెరీలియం బ్రోమైడ్ వర్ణరహితంగా లేదా తెల్లగా స్పటికరూపంలో ఉండును.బెరీలియం బ్రోమైడ్ అణుభారం 168.820గ్రాములు/మోల్.20°C వద్ద బెరీలియం బ్రోమైడ్ సాంద్రత 3.465గ్రాములు/సెం.మీ3. బెరీలియం బ్రోమైడ్ సంయోగపదార్ధం ద్రవీభవన స్థానం 508°C(946°F;781K).బెరీలియం బ్రోమైడ్ యొక్క బాష్పీభవన స్థానం 520°C(968°F;793 K).నీటిలో బాగా కరుగుతుంది.నీటిలో జలవిశ్లేషణ చెందును.ఇథనాల్, డైఇథైల్ ఈథర్, పైరిడిన్ లలో కరుగుతుంది. బెంజీన్ లో కరుగదు. అర్థోరొమ్బిక్ అణుసౌష్టవాన్ని కలిగిఉన్నది.

ఉత్పత్తి-చర్యలు

[మార్చు]

బెరీలియం లోహాన్ని 500-700 °C వద్ద బ్రోమిన్ మూలకపదార్ధంతో రసాయనచర్య వలన బెరీలియం బ్రోమైడ్ ఏర్పడును.

Be + Br2 → BeBr2

హైడ్రో బ్రోమిక్ ఆమ్లంతో బెరీలియం ఆక్సైడ్ రసాయనచర్య వలన కూడా బెరీలియం బ్రోమైడ్ ఏర్పడును.

BeO + 2HBr → BeBr2 + H2O

ఈ సమ్మేళనపదార్ధం నీటిలో నెమ్మదిగా జలవిశ్లేషణ చెందును.

BeBr2 + 2 H2O → 2 HBr + Be(OH)2

భద్రత

[మార్చు]

బెరీలియం సంయోగపదార్థాలను పీల్చిన, లేదా తినిన ప్రమాదకరం.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Perry, Dale L.; Phillips, Sidney L. (1995), Handbook of Inorganic Compounds, CRC Press, pp. 61–62, ISBN 0-8493-8671-3, retrieved 2007-12-10