భారతీయ సంగీత వాయిద్యాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ సంగీత వాయిద్యాలు అనేవి భారతీయ సంగీతంలో పాటకు అనుగుణంగా సంగీత ధ్వనిని ఉత్పత్తిచేసే పరికరాలు. ధ్వనిని ఉత్పత్తి చేసే పద్ధతి ద్వారా వీటిని పలు విధాలుగా వర్గీకరిస్తారు. వీటిలో ముఖ్యమైనవిగా కార్డోఫోన్‌లు (స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్), ఏరోఫోన్‌లు (విండ్ ఇన్‌స్ట్రుమెంట్స్), మెంబ్రానోఫోన్‌లు (డ్రమ్స్), ఇడియోఫోన్‌లు (డ్రమ్-కాని పెర్కషన్ వాయిద్యాలు), ఎలక్ట్రానిక్ పరికరాలు చెప్పుకోవచ్చు.[1]

శాస్త్రీయ సంగీతానికి ప్రసిద్ధ కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలోని మిరాజ్ నగరం మ్యూజికల్ సిటీ ఆఫ్ ఇండియాగా విరాజిల్లుతోంది. దేశంలోని చాలామంది అగ్రశ్రేణి సంగీతకారులు ఇక్కడ రూపొందించిన సంగీత వాద్యాలను ముఖ్యంగా తంబురా, సితార్, సారంగి, వీణ వంటి వాటిని వినియోగిస్తుంటారు.[2]

కార్డోఫోన్‌లు (స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్)[మార్చు]

తంత్రీ వాయిద్యాలు అని కూడా పిలువబడే సంగీత వాయిద్యాలు తీగలతో వాయించేవి. ఉదాహరణకు వీణ, తంబూరా, సంతూర్, వయోలీన్, సరోద్, సితార, సారంగి, కడ్డీవాయిద్యం మొదలైనవి.

వాయిద్యం బొమ్మ వివరాలు
వీణ తీగలు మీటుతూంటే సప్తస్వరాలు అందిస్తుంది
తంబూరా తంబూరాని బుర్ర కథకులు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు
వయోలీన్ ( ఫిడేలు) వేళ్లతో తీగలను మీటడం ద్వారా ఫిడేలు వాయించవచ్చు
సరోద్ హిందూస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. ఇది సితార్తో పాటు అత్యంత ప్రాచుర్యం పొందింది
సితార వీణ సితారకు పూర్వగామి. కచేరీలలో, సినిమా సంగీతంలో ముఖ్యంగా నేపథ్య సంగీతంలో తప్పని సరిగా వాడుతారు
సారంగి, ఇది వాయిద్యాలన్నింటిలోను మానవుని గొంతుకు సమీపంగా ఉండే శబ్దాల్ని అందిస్తుందని చెబుతారు
కడ్డీవాయిద్యం ముఖ్యంగా ఈ వాయిద్యం భగవన్నామ సంకీర్తనలకు వాయిస్తూ వుంటారు

ఏరోఫోన్‌లు (విండ్ ఇన్‌స్ట్రుమెంట్స్)[మార్చు]

సుషిర వాయిద్యాలు అని కూడా పిలువబడే సంగీత వాయిద్యాలు గాలితో పనిచేసే వాయిద్యాలు అంటే గాలిని ఊది వాయించేవి. ఉదాహరణకు వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరశింగ్ మొదలైనవి.

వాయిద్యం బొమ్మ వివరాలు
వేణువు వేణువు/మురళి/పిల్లనగ్రోవి/ఫ్లూట్ అనేది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం
సన్నాయి కర్ణాటక సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళ ప్రథమైనదిగా భావిస్తారు
కొమ్ము వీటిని గ్రామదేవతల పండగలలో ప్రముఖంగా ఊది సంగీతం సృష్టిస్తారు
నాదస్వరం
షహనాయ్ ఇది రెండు పీకలతో గొట్టం లాంటి ఆకారంలో ఉంటుంది. హిందుస్థానీ సంగీతంలో విరివిగా ఉపయోగిస్తారు
శంఖువు శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం వుంటుంది. యుద్ధ భేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం

చెప్పడానికి దీనిని వాడుతారు

నరశింగ్

మెంబ్రానోఫోన్‌లు (డ్రమ్స్)[మార్చు]

అవనద్ధ వాయిద్యాలు అని కూడా పిలువబడే సంగీత వాయిద్యాలు చర్మాన్ని ఉపయోగించి తయారుచేస్తారు. వీటిని కొట్టి సంగీతకారులు వాయిస్తారు. ఉదాహరణకు మృదంగం, డోలు, ఢమరుకం, మద్దెల, తబలా, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాయిద్యం మొదలైనవి.

వాయిద్యం బొమ్మ వివరాలు
మృదంగం శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుంది. ఈ వాయిద్యము ఒక గొట్టపు ఆకారములో ఇరు వైపుల

వాయించటానికి చదునుగా ఉంటుంది

డోలు చెక్కతో చేయ్యబడే ఈ డోలుకు రెండు వైపులా జంతు చర్మం బిగించి ఉంటుంది. దీనిని చిన్న కర్రలతో కానీ చేతి వేళ్ళతో

కానీ వాయిస్తారు

ఢమరుకం దీనిని జానపద కళలలో బుడబుక్కల వారు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు
మద్దెల
తబలా వీటిని రెండు చేతులతో వాయిస్తారు. తబలా ఆవిష్కరణ భారతదేశంలో జరిగింది
తప్పెట
దుందుభి
నగారా ఇది మధ్య యుగాలలో అరబ్బులు, పర్షియన్లు భారతదేశానికి తీసుకువచ్చిన పురాతన వాయిద్యం. ప్రాచీన కాలంలో

దీనిని దుందుభి అని పిలిచేవారు

డోలక్ ఇది బారెల్ ఆకారంలో రెండు తలలు కలిగిన భారతీయ ఘాత వాయిద్యం
పంచముఖ వాయిద్యం

ఇడియోఫోన్‌లు (డ్రమ్-కాని పెర్కషన్ వాయిద్యాలు)[మార్చు]

ఘన వాయిద్యాలు అని కూడా పిలువబడే సంగీత వాయిద్యాలు గట్టిగా ఉండేవి. ఇవి తాళం ననుసరించు వాయిద్యాలు ఉదాహరణకు తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చురుతలు, మోర్సింగ్, మంజిర మొదలైనవి.

వాయిద్యం బొమ్మ వివరాలు
తాళాలు దీనిని మంజీర, జల్రా, గిని అని కూడా పిలుస్తారు. ఇవి రెండు కంచు బిళ్ళలతో కూడిన సాధనం. ఈ రెండు కంచు బిళ్ళలను ఒకదానిపై

ఒక దానిని తాకించి శబ్దం చేస్తారు

గంటలు
గజ్జెలు
ఘటం
చురుతలు వీటిని ఎక్కువగా దక్షిణ భారతదేశంలో హరికథకులు, భజన చేసే వారు వాడుతారు
మోర్సింగ్
మంజిర

ఎలక్ట్రానిక్ పరికరాలు[మార్చు]

ఇక ఆధునిక ఎలక్ట్రానిక్ భారతీయ సంగీత వాయిద్యాలలో ఎలక్ట్రిక్ పియానోలు, ఎలక్ట్రిక్ వయోలిన్లు, వయోలాలు, సెల్లోలు, బేస్‌లు, ఎలక్ట్రిక్ గిటార్‌లు, బాంజోలు, మాండొలిన్‌లు మొదలైనవి చెప్పుకోవచ్చు.

వాయిద్యం బొమ్మ వివరాలు
ఎలక్ట్రిక్ పియానో దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి
ఎలక్ట్రిక్ వయోలిన్ దీని ధ్వని ఎలక్ట్రానిక్ అవుట్‌పుట్‌తో కూడి ఉంటుంది
ఎలక్ట్రిక్ గిటార్‌ దీని స్ట్రింగ్‌ల వైబ్రేషన్‌ను ఎలక్ట్రికల్ సిగ్నల్‌లుగా మార్చి లౌడ్‌స్పీకర్‌ల ద్వారా ధ్వనిగా పునరుత్పత్తి చేయబడతాయి. యాంప్లిఫైయర్

సెట్టింగ్‌ల ద్వారా ధ్వని గిటార్ నుండి భిన్నమైన టింబ్రేస్ పొందవచ్చు

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "అబ్బో ఎన్నో సంగీత వాయిద్యాలు! | బుడుగు". web.archive.org. 2023-02-25. Archived from the original on 2023-02-25. Retrieved 2023-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "మ్యూజికల్ సిటీ ఆఫ్ ఇండియా". Archived from the original on 2023-02-25. Retrieved 2023-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)