భీమవరపు నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమవరపు నరసింహారావు
BNR.jpeg
జననంజనవరి 24, 1905
కొలకలూరు, గుంటూరు జిల్లా
మరణంసెప్టెంబర్ 7, 1976
వృత్తిసంగీత దర్శకుడు
పిల్లలుఇద్దరు; కొడుకు, కూతురు
తండ్రిపుండరీకాక్ష శర్మ
తల్లికోటమ్మ

భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 - సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం కూడా తనే స్వయంగా నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలోసంగీత దర్శకుడిగా పనిచేశాడు.[1]ఈయన ధూమపాన ప్రియుడు. కేవలం సిగరెట్ల సంపాదన కోసం హార్మోనిస్ట్ గా థియేటర్ లో పనిచేయడం మొదలుపెట్టాడు.[ఆధారం చూపాలి]

జీవనసరాగాలు[మార్చు]

 • పుట్టిన తేది : 1905 జనవరి 24
 • జన్మస్థలం : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో కొలకలూరు.
 • తల్లిదండ్రులు : కోటమ్మ, పుండారీకాక్ష శర్మ
 • విద్యార్హత : ఎస్.ఎస్.ఎల్.సి
 • తోబుట్టువులు :
  • అన్నయ్యలు - పూర్ణయ్య, రామచంద్రరావు
  • నలుగురు సోదరులు
 • సంతానం :
  • కొడుకు - బి.వెంకటేశ్వరరావు
  • కూతురు - డాక్టర్ లీలావతి
 • మొదటి సినిమా : సతీ తులసి (1936)
 • ఆఖరి చిత్రం : అర్ధాంగి (1955)
 • మరణం : 7 సెప్టంబర్ 1976.

చిత్రసమాహారం[మార్చు]

 1. సతీ తులసి (1936)
 2. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)
 3. కనకతార (1937)
 4. మోహినీ రుక్మాంగద (1937)
 5. మాలపిల్ల (1938)
 6. భక్త తుకారమ్ (1938)
 7. రైతుబిడ్డ (1939)
 8. మీరాబాయి (1940)
 9. అపవాదు (1941)
 10. భాగ్యలక్ష్మి (1943)
 11. మాయా మచ్చీంద్ర (1945)
 12. భక్త తులసీదాస్ (1946)
 13. భక్త జన (1948)
 14. తిరుగుబాటు (1950)
 15. వీట్టుక్కారి ( తమిళం) (1950)
 16. ధర్మదేవత ( నేపథ్య సంగీతం మాత్రమే ) (1952)
 17. పెణ్ణిన్ పెరుమై (తమిళం) (1955)
 18. అర్ధాంగి (1955)

మూలాలు[మార్చు]

 1. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14

బయటి లింకులు[మార్చు]