Jump to content

మసకపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°43′16.788″N 82°8′13.956″E / 16.72133000°N 82.13721000°E / 16.72133000; 82.13721000
వికీపీడియా నుండి
మసకపల్లి
పటం
మసకపల్లి is located in ఆంధ్రప్రదేశ్
మసకపల్లి
మసకపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°43′16.788″N 82°8′13.956″E / 16.72133000°N 82.13721000°E / 16.72133000; 82.13721000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంకె. గంగవరం
విస్తీర్ణం8.65 కి.మీ2 (3.34 చ. మై)
జనాభా
 (2011)
3,667
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,851
 • స్త్రీలు1,816
 • లింగ నిష్పత్తి981
 • నివాసాలు1,044
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533263
2011 జనగణన కోడ్587727

మసకపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం.[2].ఇది మండల కేంద్రమైన పామర్రు నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామచంద్రపురం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,881.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,963, మహిళల సంఖ్య 1,918, గ్రామంలో నివాస గృహాలు 952 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1044 ఇళ్లతో, 3667 జనాభాతో 865 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1851, ఆడవారి సంఖ్య 1816. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1062 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587727[4].

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు ఉన్నాయి.బాలబడి భట్ల పాలికలోను, మాధ్యమిక పాఠశాల ముమ్మిడివరంలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ముమ్మిడివరంలోను, ఇంజనీరింగ్ కళాశాల రామచంద్రపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కాకినాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు రామచంద్రపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ద్రాక్షారామంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

మసకపల్లిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మసకపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. 16 కిలోమీటర్లలో ఉన్న రామఛంద్రపురం నుండి రోజుకు 8 షటిల్ బస్ సర్వీసెస్ ఉన్నాయి, కాకినాద నించి 2 సర్వీసెస్ ఉన్నాయి. ద్రాక్షారామ నుంచి ఆటో సౌకర్యం కూడా ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మసకపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 515 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 349 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 344 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 4 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మసకపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 4 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

మసకపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కొబ్బరి

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామం ఒక త్రివేణీ సంగమం. ఇక్కడ గోదావరి నది 7 పాయల్లో 3 పాయలు సంగమిస్తాయి. అవి ఆత్రేయి, భారద్వాజ, గౌతమి అనే 3 పాయలు. రాజమండ్రి నుండి గోదావరిని 7 గురు మహర్షులు తీసుకొని వెళ్ళడంతో ఆ నదికి సప్త గోదావరిగా పేరు వచ్చింది అని చెప్తారు. ఈ గ్రామాన్ని రెండు సార్లు గోదావరి ముంచేసింది. ఆ వరదలో సర్వమూ కోల్పోయిన వారు ఇప్పుడున్నచోట మసక పల్లిని క్రొత్తగా నిర్మించు కొన్నారు. 1910, 1920 లలో కూడా ఈ విధమైన పరిస్థితులు సంభవించాయి. ఈ విధంగా ఇప్పటికి ఈ గ్రామం మూడు సార్లు ఏర్పడింది.[5] ఈ గ్రామం కోటిపల్లికీ, ద్రాక్షారామానికీ, యానాంకీ సరి సమానంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పడమరగా పెద్ద కాలువ ఉంది. ఆ ప్రక్కనే గోదావరి ప్రవహిస్తూ ఊరికంతటికీ చల్లదనం కలిగిస్తోంది. పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేసుకునేవారట. సంస్కృతంలో మస్కరి అంటే చేతి క్రింద దండం పెట్టుకొని తపస్సు చేసే ముని అని అర్థం. అట్టి మస్కరులు ఉండే పురి కనుక మస్కరపురి అని పేరు కల్గి క్రమంగా మసకపల్లి అయింది.

పూర్వం ఇక్కడ నుండి రహదారి పడవ ఉండేది. దాని మీదే కోటిపల్లి, కపిలేశ్వర పురం, ఇంజరం మున్నగు ఊర్లకి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు బస్సు సదుపాయం బాగా కలిగింది.

పూర్వం మసకపల్లిలో ఒక ధూళిపాళ శాస్త్రి ఉండేవారు. ఆయన ఒక్కడూ 8 మంది దొంగల్ని ఎదుర్కొనే వారు. ఆయన ఊర్లో ఉంటే గుంపులుగా వచ్చే దొంగలు ఆ ఊరి పొలిమేరలోకి వచ్చేవారు కాదు. [ఆధారం చూపాలి]

మసకపల్లి సరిహద్దులు

[మార్చు]

గ్రామంలో దర్శించవలసిన ప్రదేశంలు/దేవాలయంలు

[మార్చు]

మసకపల్లి దేవాలయాలు

[మార్చు]

ఇక్కడ పార్వతీ భ్రమరాంబా సమేత మల్లీశ్వరుని ఆలయం ప్రసిధ్ధమైంది. కాశీలో వలే ఈ ఆలయం పడమర ముఖంగా ఉండడం విశేషం. అక్కడ శివుడు ప్రవహించే గంగను చూస్తుంటే ఇక్కడ గోదావరిని చూస్తున్నాడు. పడమర ముఖంగా ఆలయం ఉంటే మనం తూర్పుగా లోపలికి ప్రవేశిస్తాం కనుక ఆ ఆలయానికి చాలా శక్తి ఉంటుందంటారు. అందుకే అక్కడి మల్లేశ్వర స్వామికి లక్షపత్రి పూజ చేయించి ఏం మ్రొక్కుకున్నా ఫలిస్తుందంటారు. నిజానికి పూర్వం మల్లేశ్వరాలయం గోదావరిలో కలిసి పోయినా, ఆ వూరి పెద్దలు ఎలాగో విగ్రహాల్ని నిలుపుకోగలిగారు. పిమ్మట పెద్దలంతా ఊరూరా చందాలు పోగేసి ఈ ఆలయం కట్టారుట. అందులో ముఖ్యులు కీ.శే. దువ్వూరి పుల్లయ్య శాస్త్రి. అందరూ కలిసి స్వామిని మసకపల్లినీ అందలి ప్రజల్నీ ఎప్పుడూ రక్షించమనీ, అందుకై ప్రతి సంవత్సరమూ లక్షపత్రి పూజ సామూహికంగా చేస్తామనీ ప్రార్థించారు. అందుకోసం మూలధనంకై యత్నిస్తూ ఒక సంతానం లేని బ్రాహ్మణ వితంతువును ఆమెభూమిని దేవునికి ఇమ్మని అడిగారు. ఆమె ఒప్పుకొంది కానీ ఆకస్మికంగా మరణించింది. వెంటనే పెద్దలు ఆ శవంచేత ఆస్తి దేవునికి దఖలు పరస్తున్నట్లు వేలి ముద్ర వేయించారు. అది తెలిసి వారిని ఖైదులో పెట్టారు. అపుడు వారంతా అ ఖైదులోనే నిరాహారంగా "స్వామీ! నీకోసం కదా మేమీ పనిచేశాం. నీకిది న్యాయంగా ఉందా! రేపటికల్లా నీవు మమ్మల్ని విడిపంచక పోతే మేమిక్కడే ప్రాణ త్యాగం చేస్తామని భీష్మించారుట. అంతే తెల్లవారేసరికి స్వామి మహిమ వల్ల వారు విడిపింప బడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకూ క్రమం తప్పకుండా స్వామికి లక్షపత్రి పూజ జరుగుతూనే ఉంది. ఒకసారి కోటి పత్రి పూజ కూడా జరగడం గొప్ప విశేషం. అంటే ఒక రోజుకి లక్షపత్రి చొప్పున 100 రోజులు 11 మంది ఋత్విక్కులు తక్కువ కాకుండా జరిగిందని శ్రీదువ్వూరి వారు తమ స్వీయ చరిత్రలో ఉట్టంకించారు.[6]

కేశవస్వామి గుడి

[మార్చు]

ఈ ఆలయం కూడా మల్లేశ్వరునికి ఉత్తరంగా 100 గజాల దూరంలో ఉంది. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన కేశవస్వామి ఇక్కడి దైవం. ఇది కూడా పడమర ముఖమే. క్రొత్త మసకపల్లి నిర్మాణంలో గ్రామస్థులు అభ్యర్థింపగా దంగేరు వాస్తవ్యులు సంపన్నులు అయిన రావి పాటి వారు అప్పట్లో ఈ గుడి నిర్మించారు. స్వామికి భోగాలు అప్పట్లో బాగా జరిగేవి. ఇప్పుడు ఆ ఆలయం బీదతనానికి గుర్తుగా కనిపిస్తోంది. ఏవైభవమూ లేక ఎవరైనా ఉదారులు ఆదు కొంటారా? అని ఎదురు చూస్తోంది.

సుబ్రహ్మణ్యుని గుడి శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాలయం మల్లేశ్వర స్వామికి ఉత్తరంలో ఉంది.మార్గశిర శుద్ధ షష్ఠినాడు ఈస్వామి తీర్థం బాగా జరుగు తుంది.సంతానంలేనివారు ఈస్వామిని సేవిస్తే తప్పక సంతానం కలుగుతుందని చాలామంది అంటారు.

గ్రామదేవత ఆలయం

[మార్చు]

ఊరికి ఇద్దరు గ్రామదేవతలు ఉన్నారు. 1.మసకపల్లమ్మ 2.వెలగలమ్మ. ఇద్దరూ అక్కచెల్లెండ్రు. ఇద్దరూ చాలా శాంతమైనవారు. మంచి వెల అనగా విలువ కల అమ్మ కనుక అమ్మవారికి ఆ పేరు వచ్చింది.చైత్ర పౌర్ణమికి ఆ ఇద్దరు అమ్మలకీ జాతర వైభవంగా చేస్తారు. ఎవరో తాంత్రికుడు అమ్మవార్ల నోరు కట్టేశాడని అంటారు. అందుకే జాతర్లో పూనకం వచ్చినా మాట్లాడడం ఉండదంటారు. అందర్నీ చల్లగా కాచే తల్లులు కనుక వారిని చల్లని తల్లులంటారు.

మసకపల్లి ప్రముఖులు

[మార్చు]
దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్యీయ చరిత్ర ముఖచిత్రం
  • దువ్వూరి వేంకటరమణ శాస్త్రి -సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత.[7] మసకపల్లి గ్రామంలో జన్మించాడు.
  • వేద పండితులు: ఈ ఊర్లో చాలా గొప్ప వేదపండితులు ఉండేవారు. వారు గుడిలో వేదం చదువుతుంటే 2 మైళ్ళు దూరంలో ఉన్న కోట బాల్కనీలో రాజావారుండి విని ఈవేళ ఫలానా శాస్త్రి గారి కంఠం వినపడ లేదు ఎందుకు? అని కబురు చేసేవారు.[ఆధారం చూపాలి] ఆవేళ కంఠాలు అంత ఉదాత్తంగా ఉండేవి.
  • అవధానులు: ఇంత చిన్న ఊరి నుండి ఇరువురు అష్టావధానులు తయారయ్యారు. 1.ధూళిపాళ మహాదేవమణి రాజమండ్రి, 2.చెరుకూరి సూర్యనారాయణ -తెలుగు పండితుడు-పెదపట్నం.

పాండిత్యం

[మార్చు]
  1. దువ్వూరి వారిలో పూర్వం ఒక గొప్ప సిధాంతి ఉండేవాడు. చుట్టు ప్రక్కల గ్రామాల వారంతా వారి వద్దకు వచ్చి అన్నీ తెలుసు కొనేవారు.
  2. దువ్వూరి పుల్లయ్య శాస్త్రి మంచి ధర్మ కర్తగా పేరు.
  3. తరువాతి కాలంలో కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి ఒకడు. ఇతను వ్రాసిన "రమణీయం" అనే బాలవ్యాకరణానికి వ్యాఖ్య సుప్రసిద్ధం. అతని జీవిత చరిత్ర అనే గ్రంథం ఒక రమణీయ కావ్యం.
  4. ధూళిపాళ సోమనాథ శాస్త్రి ఒక గొప్ప సంస్కృత పండితుడు. అతని కుమారుడు సుర్యనారాయణ అన్నిరంగల్లోనూ పట్టంలేని మహాపండితుడు. ఆయుర్వేదం, హోమియోపతి, పశువుల వైద్యంలో నిష్ణాతులు. 2 గ్రంథాలు కూడా వ్రాశాడు. వ్యవసాయంలో మంచి మెళకువలు చూపేవాడు.
  5. ధూళిపాళ మహాదేవమణి. సంస్కృతాంధ్రాల్లో మంచి పాండిత్యంతో 1.ప్రవచన రాజహంస,2.అభినవ వాల్మీకి, 3.పద్యకళాతపస్వి, 4.అభినవ మల్లినాథ, 5.అవధాన ప్రాచార్య, 6.ావధాన సభాసమ్చాలక సార్వభౌమ, 7.అష్టావధాని అనేబిరుదులు వరించాయి. శ్రీవిభూతులు మున్నగు అనేక గ్రంథాలు వ్రాయడమే కాక 4 గురు ఆడ పిల్లల్ని అవధానులుగా తీర్చిదిద్దాడు.

న్యాయవాది

[మార్చు]

ఆకెళ్ళవారిలోశ్రీ సత్యం ఉండేవాడు. ఇతని ఇల్లు చెరువుకు ఎదురుగా కాలువ గట్టును ఆనుకొని ఉండేది. ఇతను ఆవూరికి ఒక పట్టంలేని న్యాయమూర్తి. ఎవరికి ఏ తగువులు వచ్చినా కోర్టు అవసరంలేదు. సాయంకాలాల్లో తగువులు తీర్చే వాడు. ఇతని అరుగే ఒక న్యాయస్థా నం. ఊరి పెద్దమనుషులంతా అతని అరుగుపై కూర్చుని ఇతని న్యాయనిర్ణయం విని సెభాష్ అనేవారు. ముద్దాయిలు ఎవరైనా క్రింద నిలబడేవారు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. దువ్వూరి వేంకటరమణ శాస్త్రి తమ స్వీయచరిత్ర, 23వ పుట 2వ పేరా
  6. (చూ.దు.వెం శా. స్వీయ చరిత్ర.27,28 పుటలు)
  7. కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర, అభినవ ప్రచురణలు, తిరుపతి, 2009.
"https://te.wikipedia.org/w/index.php?title=మసకపల్లి&oldid=4261093" నుండి వెలికితీశారు