మిర్జా గాలిబ్

వికీపీడియా నుండి
(మీర్జా గాలిబ్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మిర్జా అసదుల్లాహ్ ఖాన్ గాలిబ్
Mirza Ghalib photograph.jpg
కలం పేరు: అసద్, గాలిబ్
జననం: (1796-12-27)27 డిసెంబరు 1796
ఆగ్రా
మరణం: 15 ఫిబ్రవరి 1869(1869-02-15) (aged 72)
ఢిల్లీ
వృత్తి: కవి
జాతీయత: భారతీయుడు
శైలి: గజల్
Subjects: ప్రేమ, తత్వము
ప్రభావాలు: మీర్ తఖి మీర్, అబ్దుల్ ఖాదిర్ బే-దిల్
ప్రభావితులు: ఉర్దూ కవిత్వం, ఇక్బాల్, అల్తాఫ్ హుసేన్ హాలి, బహాదుర్ షా జఫర్

గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ మరియు పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి మరియు గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. లేఖలు వ్రాయడంలో ప్రసిధ్ధి. గాలిబ్ టర్కీకి చెందిన ఐబక్ వంశీయుడు. వాళ్లలో తండ్రి ఆస్తి కూతురికి లభిస్తుంది, కొడుక్కికాదు.కొడుక్కి తండ్రి ఖడ్గం మాత్రమే వారసత్వంగా లభిస్తుంది.గాలిబ్‍ది మహావీరుల వంశం.గాలిబు గారి తాతా 'సమర్‍ఖంద్' నుండి షాఃఆలం రాజుకాలంలో భారతదేశం వచ్చాడు. గాలిబు తంద్రిపేరు అబ్దుల్లాబేక్‍ఖాన్.గాలిబ్ తమ్మునుపేరు యూసుఫ్ ఖాన్. గాలిబ్ కు 5 సంవత్సరాల వయస్సులో, అన్వర్ సంస్థానంలో పనిచేస్తున్న తండ్రి శత్రువుల చేతుల్లోహతమైయ్యాడు. పినతండ్రికూడా గాలిబు తొమ్మిదో యేట మరణించాడు.గాలిబు తండ్రి, పినతండ్రి మరనాంతరం బ్ర ప్రభుత్వంనుండి 1857 వరకు, ఆయనకు ఏడాదికి 7 వందలరూపాయల ఆర్థిక సహాయం అందేది.1987లో సిపాయి పితూరి కారణంగా మూడేళ్లు సహాయం నిలచిపోయిచాలా కష్టాలు పడ్డాదు.

గాలిబ్ జీవితం పై సినిమా మిర్జా గాలిబ్ తీశారు. ఈ సినిమాకు మొదటిసారిగా జాతీయ అవార్డును ప్రవేశపెట్టి, ఉత్తమ సినిమా అవార్డు ప్రదానం చేశారు. ఈ సినిమాలో గాలిబ్ పాత్రను ప్రముఖ హిందీనటుడు భరత్ భూషణ్ పోషించాడు. గులామ్ మహమ్మద్ సమకూర్చిన సంగీతంతో ఈసినిమా గీతాలు అమరగీతాలయ్యాయి.

సినీ రచయిత మరియు దర్శకుడు గుల్జార్ 'మిర్జా గాలిబ్' టి.వి.సీరియల్ తీశాడు. నసీరుద్దీన్ షా గాలిబ్ గా నటించాడు. జగజీత్ సింగ్ మరియు చిత్రాసింగ్ నేపథ్యగానంలో జగజీత్ సింగ్ సంగీతంలో ఈ టి.వి.సీరియల్ ప్రజానీకానికి విశేషంగా ఆకట్టుకొంది.

రచనలు[మార్చు]

దీవాన్ ఎ గాలిబ్ (కవితలు) (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, ఉర్దూ భాష సిలబస్ లో గలదు).