మొదటి బహదూర్ షా
Bahadur Shah I | |||||
---|---|---|---|---|---|
7th Mughal Emperor | |||||
పరిపాలన | 19 June 1707 – 27 February 1712 | ||||
Coronation | 19 June 1707 in Delhi | ||||
పూర్వాధికారి | Alamgir | ||||
ఉత్తరాధికారి | Jahandar Shah | ||||
జననం | 14 October 1643 Burhanpur, Mughal Empire | ||||
మరణం | 1712 ఫిబ్రవరి 27 Lahore, Mughal Empire | (వయసు 68)||||
Burial | |||||
Spouses | Nur-un-Nissa Begum Mihr-un-Nissa Begum Amat-ul-Habib Begum Begum Nizam Bai Begum Amrita Bai | ||||
వంశము | 8 sons, 1 daughter including | ||||
| |||||
రాజవంశం | Timurid | ||||
తండ్రి | Aurangzeb | ||||
తల్లి | Nawab Bai | ||||
మతం | Islam |
బహదూర్ షా (ఉర్దు:بہادر شاه اول) (జననం బుర్హన్‌పూర్ వద్ద అక్టోబర్ 14, 1643 - మరణం లాహోర్ వద్ద ఫిబ్రవరి 27, 1712) ముఘల్ చక్రవర్తులలో ఒకరు. భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో ఆయన 7వ చక్రవర్తి. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని 1707 - 1712 వరకు పాలించాడు. ఆయన అసలు పేరు కుతుబ్ ఉద్-దీన్ ముహమ్మద్ మూ'ఆజం " తరువాత ఆయన తండ్రి " షా ఆలం " బిరుదు ఇచ్చాడు. 1707 లో ఆయన సింహాసం అధిష్టించిన తరువాత " బహదూర్ షా " బిరుదును స్వీకరించాడు. టర్కీ మంగోలు భాషలో బహదూర్ అంటే సాహసవంతుడు అని అర్ధం. ఆయన 5 సంవత్సరాల కాలం పాటు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన 63 సంవత్సరాల వయసులో సింహాసనన్ని అధిష్టించాడు. ఆయన మరాఠీ, రాజపుత్రుల మధ్య సయోధ్య కుదిరించాడు. ఆయన సిక్కులతో మైత్రీబంధాలను కలిగి ఉన్నాడు. ఆయన తనరాజ్యమంతా ప్రయాణించి చివరిగా లాహోర్‌లో కొన్ని మాసాలకాలం విశ్రాంతి తీసుకున్నాడు.
Early life
[మార్చు]ముయాజ్జం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మూడవ కుమారుడు. తల్లి నవాబ్ బాయి. ఆమె రాజౌరి రాజు (జర్రల్ రాజపుత్రుడు) కుమార్తె. ముయాజ్జం 1643లో బుర్హంపూర్‌లో జన్మించాడు. ముయాజ్జం ఔరంగజేబు సామ్రాజ్యంలోని వాయవ్య భూభాగానికి గవర్నర్‌గా నియమించబడ్డాడు. ఆయన భూభాగంలో సిక్కుల ప్రాభవం అధికంగా ఉన్న పంజాబు ఉంది. గవర్నర్‌గా ముయాజ్జం గవర్నరుగా తన భూభాగంలో ఔరంగజేబు విధించిన కఠిన చట్టాల నుండి సడలింపు కలిగించాడు. అలాగే తన భూభాగంలో కొంతకాలం ప్రశాంత వాతావరణం ఉండేలా చేసాడు. ఆయన చివరి సిక్కు గురువు గురుగోబింద్ సింగ్‌తో సత్సంబంధాలు కలిగిఉన్నాడు. ముయాజ్జం మొఘల్ సింహాసనం కొరకు తన సోదరులను సవాల్ చేసిన సమయంలో రాకుమారునికి గురుగోబింద్ సింగ్ సైనిక సాయం చేసాడు.[1][2] ఆయన కవి జఫర్‌కు అభిమాని.
మతం
[మార్చు]ఔరంగజేబు మరణించిన తరువాత మౌజం బహదూర్ షా సింహానం స్వాధీనంచేసుకున్నాడు. ఔరంగజేబు తరువాత రాజ్యాధికారానికి వారసుల మధ్య యుద్ధం సంభవించింది. ఔరంగజేబు చిన్న కుమారుడు రాకుమారుడు ముహమ్మద్ అజాం షాహ్ తనకుతానే చక్రవర్తిగా ప్రకటించి ఢిల్లీ వైపు దాడి సాగించాడు. అక్కడ ఆయన బహదూర్ షాతో యుద్ధం చేసి (మూడు మాసాల కాలం నామమాత్రపు చక్రవర్తిగా ఉన్నాడు) యుద్ధంలో మరణించాడు. మరొక సోదరుడు ముహమ్మద్ కాం బక్ష్ 1709లో మరణించాడు.
ఔరంగజేబు తన సామ్రాజ్యంలో బలవంతంగా షరియా చట్టం అమలుకు తీసుకువచ్చాడు. కఠినమైన ఆజ్ఞలద్వారా దానిని అమలు చేయడానికి ప్రయత్నించాడు. .[ఆధారం చూపాలి] ఫలితంగా మరాఠీలు, సిక్కులు, రాజపుత్ర రాజ్యాల మద్య తిరుగుబాటు తలెత్తింది. ఈ తిరుగుబాటు ఔరంగజేబు మరణించే తరుణంలో తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తండ్రికంటే ఆధునిక భావాలున్న బదూర్ షా తీవ్రవాదులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని ప్రయత్నించాడు. బహదూర్ షా ఇజాహ్ పన్నును రద్దు చేయలేదు. అయినప్పటికీ పన్నును వసూలు చేయడంలో వెసులుబాటును కలిగించాడు. ఆయన పాలించిన 5 సంవత్సరాలలో సంగీతాన్ని ఆదరించి పోషించాడు. ఆయన పాలనలో ఆలయాలు ధ్వంసం చేయబడలేదు. బహదూర్ షా 5 సంవత్సరాల పాలనలో సామ్రాజ్యం సమైక్యంగా ఉన్నప్పటికీ వర్గాల మధ్యపోరు అధికం అయింది. బహదూర్ షా రాజ్యం అంతటినీ స్వాధీనంలో ఉంచడంలో విజయం సాధించాడు.
బహదూర్ షా 5 సంవత్సరాల పాలన తరువాత చక్రవర్తి అకస్మాత్తు మరణంతో మొఘల్ సామ్రాజ్యం క్షీణదశ ఆరంభం అయింది. ఆకాలానికి సంబంధించిన నివేదికలు బహదూర్ షా మేధావి, సాహసవంతుడు అని తెలియజేస్తున్నాయి. ఆయన స్వల్పంగా ఉంద్రేకవంతుడు, విద్యావంతుడు, క్రమశిక్షణ, ఉదారం, కరుణ ఉన్నవాడని కూడా తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఆయన పూర్వీకులలాగా గొప్ప విజేత కాదు. మొఘల్ సామ్రాజ్యానికి విజయవంతమైన చివరి చక్రవర్తిగా బహదూర్ షా గుర్తించబడ్డాడు. ఔరంగజేబు అనుసరించిన కఠినమైన మతావలంబనను వదిలి బహదూర్ షా సూఫీ యిజాన్ని అనుసరించిచాడు. అయన హఠాన్మరణం తరువాత మొఘల్ చక్రవర్తుల మతావలంబన కొత్తపుంతలు తొక్కింది..
-
The Mughal Emperor Bahadur Shah I began efforts to affirm peace and order throughout the Mughal Empire after the death of his father Aurangzeb.
-
Silver Rupee of Shah Alam I issued from Shahjahanabad mint (Delhi) in 1120 A.H.
విదేశీ సంబంధాలు
[మార్చు]1711లో భూటాన్ పాలకుడు డ్రక్ రాబ్గే (1701-1719) హిందూ తిరుగుబాటుదారుడు మహేంద్ర నారాయణ, యఙనారాయణలతో చేతులు కలిపి ఘోరాఘాట్, ఢాకాల మీద దాడి కొనసాగించాడు. బిహారీ - భుటానీయుల కూటమిని పత్గ్రాం యుద్ధంలో ఓడించబడింది. మొఘల్ పాలకులు 1714లో బోడా, పత్గ్రాం, తూర్పు పరగణా, కర్జిహాత్, కకినా, ఫతేపూర్ చక్లా ఆక్రమించారు. ముఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా, బర్మా పాలకుడు సా నయ్ మిన్ గై మిషనరీలను ఇచ్చిపుచ్చుకున్నారు. వారు సముద్రమార్గంలో మొఘల్ నౌకలు అల్హరి, సెలామత్ ద్వారా ప్రయాణించారు.[3]
మరణం
[మార్చు]బహదూర్ షా 1712 ఫిబ్రవరి 27న లాహోర్లో షాలీమార్ గార్డెంస్‌కు మరమ్మత్తు పనులు చేస్తూ మరణించాడు. తరువాత ఆయన కుమారుడు జహందర్ షా సింహాసనాధిష్టుడు అయ్యాడు. మెహరౌలి లోని 13వ శతాబ్ధానికి చెందిన సూఫీ సన్యాసి " కుతుబుద్దీన్ కాకి " సమాధి సమీపంలో రెండవ అక్బర్, ఆలం షా ఆయన సమాధి చేయబడ్డాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Harbans Singh Noor (2004). Connecting the dots in Sikh history. Institute of Sikh Studies. ISBN 978-81-85815-23-7.
- ↑ Bhagat Lakshman. Short Sketch of the Life and Works of Guru Gobind Singh. Asian Educational Services. pp. 133–135. ISBN 978-81-206-0576-3.
- ↑ name="TwentiethAnniversary"
అంతకు ముందువారు Aurangzeb |
Mughal Emperor 1707–1712 |
తరువాత వారు Jahandar Shah |