రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతజార్ఖండ్ , బీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలురాంచీ
ఆగే స్టేషనులు6(BOTH ROUTES)
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం1,306 km (812 mi) / 1,341 km (833 mi)
సగటు ప్రయాణ సమయం17గంటల 40నిమిషాలు / 16గంటల 55నిమిషాలు
రైలు నడిచే విధంవారానికి రెండు మార్లు
రైలు సంఖ్య(లు)12453 / 12454; 12439/12440
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఎల్.హెచ్.బి భోగీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం95 km/h (59 mph) average with halts

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ ,భారతదేశ రాజధాని ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.ఇది రాంచీ ఢిల్లీ రైలుమార్గంలో నడిచే రైళ్ళలో అత్యంత వేగంగా నడిచే రైలు.

సర్వీసు[మార్చు]

  • 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (బొకారో స్టీల్ సిటీ మీదుగా) వారంలో రెండు రోజులు బుధ,శని వారాల్లో రాంచీ నుండి బయలుదేరి మరుసటిరోజు ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
  • రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (దళ్తోన్గంజ్ మీదుగా) ప్రయాణించు ఎక్స్‌ప్రెస్ ఆధివారం,గురువారాల్లో రాంచీ నుండి బయలుదేరి మరుసటిరోజు ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.

ప్రయాణ మార్గం[మార్చు]

సమయ సారిణి[మార్చు]

  • 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (బొకారో స్టీల్ సిటీ మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 RNC రాంచీ ప్రారంభం 18:15 0.0 1
2 BKSC బొకారో స్టీల్ సిటీ 20:15 20:20 5ని 112.8 1
3 KOR కోడెర్మా జంక్షన్ 22:04 22:06 2ని 238.6 1
4 GAYA గయ 23:21 23:24 3ని 314.8 1
5 DOS దేహ్రి-ఆన్-సోనే 00:14 00:15 1ని 399.9 2
6 MGS మొగల్ సారై 01:45 01:55 10ని 520.0 2
7 CNB కాన్పూర్ సెంట్రల్ 05:45 05:50 5ని 867.1 2
8 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:50 గమ్యం 1307.2 2
  • 12453 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (దళ్తోన్గంజ్ మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 RNC రాంచీ ప్రారంభం 17:10 0.0 1
2 BRKA బార్కకానా జంక్షన్ 19:25 19:30 5ని 118.5 1
3 DTO దళ్తోన్గంజ్ 21:53 21:55 2ని 301.4 1
4 GLD గర్హ్వా రోడ్ జంక్షన్ 22:50 22:55 5ని 334.8 1
5 MGS మొగల్ సారై 01:39 01:49 10ని 553.8 2
6 CNB కాన్పూర్ సెంట్రల్ 05:45 05:50 5ని 900.8 2
7 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:50 గమ్యం 1341.2 2

కోచ్ల అమరిక[మార్చు]

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో మొదటి తరగతి ఎ.సి భొగీ 1,రెండవ తరగతి ఎ.సి భొగీలు 6,మూడవ తరగతి ఎ.సి భోగీలు 10,పాంట్రీకార్ 1,2 జనరేటర్ల తో కలిపి మొత్తం 20భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
EOG హెచ్1 ఎ6 ఎ5 ఎ4 ఎ3 ఎ2 ఎ1 PC బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG

సౌకర్యాలు[మార్చు]

భారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికి పూర్తిగా ఎయిర్-కండిషన్ బోగీలు ఉంటాయి. ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు ఉచిత భోజనాలు అందజేస్తారు. ప్రయాణ వ్యవధి, సమయాలు ఆధారంగా, మధ్యాహ్న భోజనం, టీ, రాత్రి భోజనం, ఉదయం టీ, అల్పాహారం అందిస్తారు. దాదాపుగా అన్ని రాజధాని రైళ్లలో మూడు తరగతుల వసతి ఉంటుంది: అవి 2- లేదా 4 బెర్త్‌ల లాకబుల్ బెడ్‌రూములతో ఫస్ట్ క్లాస్ AC, ఓపెన్ బెర్త్‌లతో AC 2-టైర్ (4 బెర్త్‌ల గదులు + కారిడార్ మరోవైపు 2 బెర్త్‌లు), దీనిలో ఏకాంతం కల్పించేందుకు కర్టన్లు ఉంటాయి, AC 3-టైర్ (6 బెర్త్‌ల గదులు + మరోవైపు 2 బెర్త్‌లు), వీటికి కర్టన్లు ఉండవు.

ట్రాక్షన్[మార్చు]

రాంచీ - న్యూఢిల్లీ ల మద్య రైలుమార్గం పూర్తిస్థాయిలో విధ్యుతీకరించబడింది.అందువల్ల రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషెడ్ ఆధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]