Jump to content

జాగర్లమూడి రాధాకృష్ణ

వికీపీడియా నుండి
(రాధాకృష్ణ(క్రిష్) నుండి దారిమార్పు చెందింది)
జాగర్లమూడి రాధాకృష్ణ
జాగర్లమూడి రాధాకృష్ణ
జననం
జాగర్లమూడి రాధాకృష్ణ

(1978-11-10) 1978 నవంబరు 10 (వయసు 46)
ఇతర పేర్లుక్రిష్
వృత్తిసినిమా దర్శకుడుస్క్రీన్ రైటర్
జీవిత భాగస్వామిరమ్య వెలగ (2015 - 2021 విడాకులు)
ప్రీతి చల్లా (2024 నవంబర్ 11 - )

జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు. తను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే (గమ్యం) ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని పొందాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైన సినిమాలు తీశాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

క్రిష్ గుంటూరులో పుట్టి పెరిగాడు. ఈయన తాత జాగర్లమూడి రమణయ్య పోలీసు అధికారి. ఆయన సంతానం ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మనవళ్ళు, మనవరాళ్ళందరిలోకీ క్రిష్ పెద్దవాడు కావడంతో తాతగారి దగ్గర చనువు ఎక్కువగా ఉండేది. క్రిష్ చిన్నతనం నుంచే కథలు, చదవడం, రాయడం మీద ఆసక్తి ఉండేది. తండ్రి జాగర్లమూడి సాయిబాబా కు సినిమాలంటే ఆసక్తి. కొన్నాళ్ళు ఒక సినిమా థియేటర్ నడిపి గిట్టుబాటు కాక మధ్యలో వదిలేశాడు.

గుంటూరు లో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న క్రిష్ ఫార్మసీ చదవడం కోసం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో చేరాడు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఫార్మసీలో ఎం. ఎస్. చేయడం కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ కూడా పుస్తకాలు బాగా చదివేవాడు, సినిమాలు చూసేవాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితులు అతన్ని ప్రోత్సహించేవారు.[1]

వివాహం

[మార్చు]

క్రిష్‌ జాగర్లమూడి 2016 ఆగష్టు 7న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో డాక్టర్‌ రమ్య వెలగ తో వివాహం జరిగింది.[2] వారిద్దరూ విభేదాల కారణంగా 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు.[3]

క్రిష్ 2024 నవంబర్ 11న గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాని వివాహం చేసుకున్నాడు.[4][5]

క్రిష్, ప్రీతి చల్లా వివాహం నటి ఫోటో

కెరీర్

[మార్చు]

అమెరికాలో ఉన్నప్పుడే ఒక కథ రాసుకుని దాన్ని సినిమాగా తీద్దామనుకున్నాడు. అక్కడ కుదరకపోవడంతో భారతదేశానికి వచ్చి ప్రయత్నిద్దామనుకున్నాడు. మొదటగా స్నేహితుడు రాజీవ్ తో కలిసి ఫస్ట్ బిజీ సొల్యూషన్స్ అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించి అది ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాజీవ్ కు అప్పగించి తాను సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒకరికొకరు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రసూల్ ఎల్లోర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు. అదే సమయంలో ఏదో కొత్తగా రాయాలి అనే తపన పెరిగింది. బాలీవుడ్ కోసం గాంధీ గాడ్సే కథను రాయడం మొదలుపెట్టాడు. పరిశోధన కోసం నాగపూరు, పుణె, సాంగ్లి లాంటి చోట్ల తిరిగాడు. కానీ ఆ ప్రయాణంలోనే కొన్ని అనుభవాల వల్ల తిరిగి హైదరాబాదుకు రావాలనుకున్నాడు.

ఒక చిన్న హోటల్ లో కూర్చుని గమ్యం సినిమా కథ రాసుకున్నాడు. 2008 లో,క్రిష్ అల్లరి నరేష్, శర్వానంద్, కమాలినీ ముఖర్జీ నటించిన, గమ్యంతో తన సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. అనేక ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాతలను ఈ చిత్రం నిర్మించటానికి నిరాకరించటంతో తన తండ్రి జాగర్లమూడి సాయిబాబా, తన సోదరుడు బిబో శ్రీనివాస్తో, అతని స్నేహితుడు రాజీవ్ రెడ్డి కలిసి గమ్యం చిత్రన్ని నిర్మించారు. ఈ చలన చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది, ఉత్తమ చిత్రం, 2009 సౌత్ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ దర్శకుడు వంటి అనేక పురస్కారాలు గెలుచుకుంది. తమిళ భాషలో "కదలనా సుమ్మల్లా" గా కన్నడలో "సవారీ"గా, బెంగాలీలో "దుయ్ ప్రిథైబి"గా ఈ చిత్రం పునర్నిర్మించబడింది.

క్రిష్ యొక్క తదుపరి చిత్రం, వేదం, జూన్ 2010 లో థియేటర్లలో విడుదల అయింది. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం, ఒక దశాబ్దం తర్వాత తెలుగులో మొదటి మల్టీ స్టారర్ చిత్రం. ఇది విమర్శకులు, ప్రేక్షకులచే బాగా ఆకర్షించబడింది, 58 వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో నాలుగు ప్రధాన పురస్కారాలను గెలుచుకుంది, క్రిష్ తన రెండవ ఫిలిం ఫేర్ అవార్డును ఉత్తమ దర్శకుడిగా అందుకున్నాడు. 1975 లో జీవన్ జ్యోతి తర్వాత, నాలుగు ప్రధాన పురస్కారాలు (ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు, అనుష్క శెట్టికి ఉత్తమ నటి) గెలిచిన రెండో చిత్రం కూడా, బాక్స్ ఆఫీసు వద్ద మంచి అదరణ లభించింది.

వేదం విజయం తరువాత, క్రిష్ తన తమిళ రీమేక్, వానమ్ పేరుతో దర్శకత్వం వహించడానికి సంతకం చేసారు, ఇందులో శింబు, భరత్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. వానమ్ కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. 2012 లో విడుదలైన దగ్గుబాటి రానా, నయన తార నటించిన అతని తదుపరి చిత్రం కృష్ణం వందే జగద్గురుం బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

అతని తొలి హిందీ చిత్రం సంజయ్ లీలా భన్సాలి ప్రొడక్షన్ లో "గబ్బర్ ఈజ్ బ్యాక్", 2015 ఏప్రిల్ 20 న విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్, కరీనా కపూర్, శ్రుతి హాసన్ నటించారు. అతని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్య తెలుగు చిత్రం, వరుణ్ తేజ్ నటించిన కంచె, అక్టోబరు 22 న దసరా సందర్భంగా విడుదలయినది, విమర్శకుల నుంచి మంచి సమీక్షలను సంపాదించింది. క్రిష్ దర్శకత్వం వహించిన నందమూరి బాలకృష్ణ గారి వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి 2017 జనవరి 12 లో విడుదలైనది.

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత భాష గమనికలు మూ
2008 గమ్యం తెలుగు [6]
2010 వేదం తెలుగు
2011 వనం తమిళం వేదం రీమేక్
2012 కృష్ణం వందే జగద్గురుం తెలుగు
2015 గబ్బర్ ఈజ్ బ్యాక్ హిందీ
కంచె తెలుగు
2017 గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు [7]
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు తెలుగు [8]
ఎన్.టి.ఆర్. మహానాయకుడు తెలుగు [9]
మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ హిందీ [10]
2021 కొండపొలం స్క్రీన్ ప్లే తెలుగు [11]
2025 ఘాతి తెలుగు చిత్రీకరణ
హరి హర వీరమల్లు: పార్ట్ 1 – కత్తి vs ఆత్మ తెలుగు చిత్రీకరణ; ఏఎం జ్యోతి కృష్ణ కూడా దర్శకత్వం వహించారు [12]
అతిధి పాత్రలు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2008 గమ్యం నక్సలైట్ తెలుగు
2009 కాధల్న సుమ్మ ఇల్లై తమిళం గమ్యం రీమేక్
2010 వేదం సాధువు తెలుగు
2011 వనం తమిళం వేదం రీమేక్
2018 మహానటి కేవీ రెడ్డి తెలుగు
2019 ఎన్టీఆర్: కథానాయకుడు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు సృష్టికర్త దర్శకుడు రచయిత మూ
2020 మస్తీస్ అవును నం అవును [13]
2022 9 అవర్స్ అవును నం అవును [14]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]

క్రిష్ అందుకున్న అవార్డులు & నామినేషన్ల జాబితా.

సినీమా అవార్డులు
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2016 కంచె ఉత్తమ దర్శకుడిగా సినీమా అవార్డు నామినేట్ చేయబడింది [15]
ఉత్తమ కథకు సినీమా అవార్డు గెలిచింది
సినీమా అవార్డ్ - స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు గెలిచింది
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2009 గమ్యం ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు గెలిచింది [16]
2011 వేదం గెలిచింది [17]
2013 కృష్ణం వందే జగద్గురుం నామినేట్ చేయబడింది [18]
2016 కంచె నామినేట్ చేయబడింది [19]
2018 గౌతమిపుత్ర శాతకర్ణి నామినేట్ చేయబడింది [20]
IIFA ఉత్సవం
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2017 కంచె ఉత్తమ దర్శకుడిగా IIFA ఉత్సవం అవార్డు - తెలుగు నామినేట్ చేయబడింది [21]
ఉత్తమ కథకు IIFA ఉత్సవం అవార్డు – తెలుగు గెలిచింది [22]
నంది అవార్డులు
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2008 గమ్యం ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు గెలిచింది [23]
జాతీయ చలనచిత్ర అవార్డులు
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2016 కంచె తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలిచింది [24]
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2016 గబ్బర్ ఈజ్ బ్యాక్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డు నామినేట్ చేయబడింది [25]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2016 కంచె ఉత్తమ చిత్రంగా SIIMA అవార్డు (తెలుగు) నామినేట్ చేయబడింది [26]
2018 గౌతమిపుత్ర శాతకర్ణి నామినేట్ చేయబడింది [27]
TSR – TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2017 కంచె ఉత్తమ దర్శకుడు - ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలిచింది [28]
2019 గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తమ దర్శకుడు గెలిచింది [29]
జీ సినీ అవార్డ్స్ తెలుగు
సంవత్సరం సినిమా వర్గం ఫలితం మూ
2017 జీ సినీ అవార్డ్స్ తెలుగు ఇష్టమైన దర్శకుడికి జీ తెలుగు గోల్డెన్ అవార్డు గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచింది [30]
2019 దాసరి అవార్డు (ప్రత్యేక ప్రశంసా పురస్కారం) ఎన్టీఆర్: కథానాయకుడు గెలిచింది [31]

మూలాలు

[మార్చు]
  1. "సహాయ దర్శకుడైనా.. సెట్‌లో టీ సర్వ్ చేశారు!". www.eenadu.net. Retrieved 2020-11-10.
  2. Mana Telangana, Ramesh (25 June 2016). "అంగరంగ వైభవంగా క్రిష్ నిశ్చితార్థం వేడుక". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  3. Sakshi (5 May 2021). "క్రిష్‌ తన భార్యతో విడిపోవడానికి ఆ హీరోయినే కారణమట!". Sakshi. Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  4. Eenadu (11 November 2024). "వైభవంగా దర్శకుడు క్రిష్‌ వివాహం.. ఫొటో వైరల్‌". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  5. The Economic Times (11 November 2024). "Telugu film director Krish to marry famous Hyderabad doctor; Who is Dr Priti Challa?". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  6. "Postmortem - Gamyam by Radha Krishna Jagarlamudi (Krish Jagar)". Idlebrain.com. Archived from the original on 14 December 2019. Retrieved 11 February 2020.
  7. "Krish, the lover of legends". The Hindu. 16 January 2017. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
  8. "Wish more people would've seen 'NTR: Kathanayakudu' in cine hall: Director Krish Jagarlamudi". The New Indian Express. 24 February 2019. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
  9. "NTR Mahanayakudu proves Krish to be a master storyteller". Business Standard India. 23 February 2019. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
  10. "Manikarnika co-director Krish on Kangana Ranaut". The Indian Express. 27 January 2019. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
  11. "Vaishnav Tej-Rakul Preet Singh movie titled Konda Polam". The News Minute. 2021-08-20. Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  12. "'Hari Hara Veera Mallu': Pawan Kalyan looks flamboyant as a heroic outlaw". The Times of India. 2021-03-11. Archived from the original on 17 March 2021. Retrieved 2021-03-11.
  13. "Director Krish Jagarlamudi's Masti's registers big numbers!". www.thehansindia.com. 18 April 2020. Archived from the original on 27 June 2023. Retrieved 15 June 2022.
  14. "'9 Hours' trailer shows up the violent side of robberies". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 2022-06-14.
  15. "CineMAA Awards 2016". NDTV. 13 June 2016. Archived from the original on 3 August 2020. Retrieved 11 February 2020.
  16. "FILMFARE AWARDS 2009 TELUGU WINNERS". The Times of India. Archived from the original on 4 March 2020. Retrieved 11 February 2020.
  17. "Vedam wins big at Filmfare Awards (South) 2011". Rediff.com. 4 July 2011. Archived from the original on 21 February 2020. Retrieved 11 February 2020.
  18. "60th Idea Filmfare Awards 2013 (South) Nominations". Filmfare. 4 July 2013. Archived from the original on 15 June 2018. Retrieved 11 February 2020.
  19. "63rd Filmfare Awards (South) 2016 nominations list". International Business Times. 8 June 2016. Archived from the original on 6 August 2020. Retrieved 11 February 2020.
  20. "TELUGU NOMINATIONS FOR FILMFARE AWARDS SOUTH 2018". Filmfare. Archived from the original on 30 March 2019. Retrieved 11 February 2020.
  21. "IIFA Utsavam 2017 Telugu nomination list". International Business Times. 14 March 2017. Archived from the original on 19 October 2019. Retrieved 11 February 2020.
  22. "'Janatha Garage', 'Kirik Party' bag top honours at IIFA Utsavam 2017". Business Standard India. 30 March 2017. Archived from the original on 30 March 2017. Retrieved 21 July 2020.
  23. "Nandi awards 2008 announced". Idlebrain.com. 24 October 2008. Archived from the original on 20 October 2014. Retrieved 11 February 2020.
  24. "National Awards 2016: Here is the complete List of Winners". The Indian Express. 29 March 2016. Archived from the original on 8 November 2020. Retrieved 21 July 2020.
  25. "Nominations for 11th Renault Sony Guild Awards". Bollywood Hungama. 21 December 2015. Archived from the original on 6 March 2021. Retrieved 21 July 2020.
  26. "SIIMA 2016 nominations out". The News Minute. 27 May 2016. Archived from the original on 3 August 2017. Retrieved 11 February 2020.
  27. "SIIMA Awards 2018 - Telugu, Kannada nominations". International Business Times. 5 August 2018. Archived from the original on 8 August 2018. Retrieved 11 February 2020.
  28. "TSR TV9 National Film Awards 2015, 2016 Winners". International Business Times. 9 April 2017. Archived from the original on 11 December 2019. Retrieved 12 February 2020.
  29. "The TSR-TV9 National Film Awards for 2017-18 and 2018-19 have been announced". The News Minute. 16 February 2019. Archived from the original on 17 December 2019. Retrieved 12 February 2020.
  30. "Zee Telugu Golden Awards 2017 winners". International Business Times. 1 January 2018. Archived from the original on 8 June 2018. Retrieved 12 February 2020.
  31. "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019. Archived from the original on 9 February 2019. Retrieved 12 February 2020.

బయటి లింకులు

[మార్చు]